టెర్రీ గిలియమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టెర్రీ గిలియమ్
టెర్రీ గిలియమ్ (2019)
జననం (1940-11-22) 1940 నవంబరు 22 (వయసు 83)
మిన్నియాపాలిస్‌, మిన్నెసోటా, యుఎస్
పౌరసత్వం
  • యునైటెడ్ స్టేట్స్ (1940–2006)
  • యునైటెడ్ కింగ్‌డమ్ (1968–present)
విద్యబర్మింగ్‌హామ్ హైస్కూల్‌
విద్యాసంస్థఆక్సిడెంటల్ కళాశాల (బిఏ)
వృత్తి
క్రియాశీల సంవత్సరాలు1968–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
మ్యాగీ వెస్టన్
(m. 1973)
పిల్లలు3

టెరెన్స్ వాన్స్ గిల్లియం[1][2] అమెరికన్-బ్రిటిష్ సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత, నటుడు, యానిమేటర్. జాన్ క్లీస్, ఎరిక్ ఐడిల్, మైఖేల్ పాలిన్, టెర్రీ జోన్స్, గ్రాహం చాప్‌మన్‌లతో కలిసి మాంటీ పైథాన్ కామెడీ ట్రూప్‌లో సభ్యుడిగా ఉంటూ స్టార్‌డమ్‌ని పొందాడు.

వీరిద్దరూ కలిసి మాంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్ (1969-1974) అనే స్కెచ్ సిరీస్, మాంటీ పైథాన్, హోలీ గ్రెయిల్ (1975), లైఫ్ ఆఫ్ బ్రియాన్ (1979), ది మీనింగ్ ఆఫ్ లైఫ్ (1983) సినిమాలకు సహకరించారు. బ్రిటీష్ సినిమారంగంలో వారిద్దరు చేసిన కృషికి 1988లో బ్రిటీష్ ఫిల్మ్ అవార్డును అందుకున్నారు.[3]

జననం[మార్చు]

టెర్రీ గిల్లియమ్ 1940, నవంబరు 22న బీట్రైస్ - జేమ్స్ హాల్ గిల్లియమ్ దంపతులకు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లో జన్మించాడు.[2][4] 1952లో ఇతని కుటుంబం లాస్ ఏంజిల్స్ పరిసరాల్లోని పనోరమా సిటీకి మారంది. గిల్లియమ్ బర్మింగ్‌హామ్ హైస్కూల్‌లో చదివాడు. ఆ సమయంలో ఇతను తన తరగతికి అధ్యక్షుడిగా, సీనియర్ ప్రాం కింగ్‌గా వ్యవహరించాడు. చదువులో 'ఎ' గ్రేడ్‌లను సాధించాడు. హైస్కూల్ సమయంలో మ్యాడ్ మ్యాగజైన్‌ను ఆసక్తిగా చదవడం ప్రారంభించాడు. హార్వే కర్ట్జ్‌మాన్ సంపాదకత్వం వహించాడు.[5]

1962లో ఆక్సిడెంటల్ కళాశాల నుండి పొలిటికల్ సైన్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌తో పట్టభద్రుడయ్యాడు.[6]

సినిమారంగం[మార్చు]

ఊహాశక్తి, బ్యూరోక్రసీ నేపథ్యం, నిరంకుశత్వానికి వ్యతిరేకతలను విశ్లేషించే ఇతివృత్తాలతో కూడిన సినిమాలకు దర్శకత్వం వహించాడు. టైమ్ బాండిట్స్ (1981), బ్రెజిల్ (1985), ది అడ్వెంచర్స్ ఆఫ్ బారన్ ముంచౌసెన్ (1988), ది ఫిషర్ కింగ్ (1991), 12 మంకీస్ (1995), ఫియర్ అండ్ లాథింగ్ ఇన్ లాస్ వెగాస్ (1998), ది బ్రదర్స్ గ్రిమ్ (2005), టైడ్‌ల్యాండ్ (2005), ది ఇమాజినారియం ఆఫ్ డాక్టర్ పర్నాసస్ (2009), ది జీరో థియరమ్ (2013), ది మ్యాన్ హూ కిల్డ్ డాన్ క్విక్సోట్ (2018) వంటి 14 సినిమాలకు దర్శకత్వం వహించాడు. 2009లో జీవితకాల పురస్కారంలో భాగంగా బ్రిటీష్ ఫిల్మ్ ఫెలోషిప్‌ని అందుకున్నాడు.[7]

సినిమాలు[మార్చు]

దర్శకత్వం వహించినవి
సంవత్సరం శీర్షిక పంపిణీదారు
1975 మాంటీ పైథాన్ అండ్ ది హోలీ గ్రెయిల్ ఈఎంఐ ఫిల్మ్స్/సినిమా 5
1977 జాబర్‌వాకీ కొలంబియా పిక్చర్స్/వార్నర్ బ్రదర్స్.
1981 టైమ్ బందిట్స్ పఎంబసీ
1985 బ్రెజిల్ యూనివర్సల్ పిక్చర్స్ / 20వ సెంచరీ ఫాక్స్
1988 ది అడ్వెంచర్స్ ఆఫ్ బారన్ ముంచౌసెన్ కొలంబియా పిక్చర్స్
1991 ది ఫిషర్ కింగ్ ట్రైస్టార్ పిక్చర్స్
1995 12 మంకీస్ యూనివర్సల్ పిక్చర్స్
1998 ఫియర్ అండ్ లోయాథింగ్ ఇన్ లాస్ వెగాస్‌
2005 బ్రదర్స్ గ్రిమ్ డైమెన్షన్ ఫిల్మ్స్
టైడ్‌ల్యాండ్ రివాల్వర్ ఎంటర్టైన్మెంట్ థింక్ ఫిల్మ్
2009 ది ఇమాజినేరియం ఆఫ్ డాక్టర్ పర్నాసస్ లయన్స్‌గేట్ యుకె
2013 ది జీరో థియోరెమ్ స్టేజ్ 6 ఫిల్మ్
2018 ది మ్యాన్ హూ కిల్డ్ డాన్ క్విక్సోట్‌ స్పార్కీ పిక్చర్స్

సన్మానాలు, ప్రశంసలు[మార్చు]

గిల్లియమ్ రెండు బ్రిటీష్ ఫిల్మ్ అవార్డులు, మాంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్ (1969) సినిమాకు ప్రత్యేక అవార్డు, 2009లో బ్రిటీఫ్ ఫిల్మ్ ఫెలోషిప్ అందుకున్నాడు. బ్రెజిల్ (1985) సినిమాకు ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో అకాడమీ అవార్డుకు, ది ఫిషర్ కింగ్ (1991) సినిమాకు ఉత్తమ దర్శకుడిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు కూడా ఎంపికయ్యాడు. ఫియర్ అండ్ లాథింగ్ ఇన్ లాస్ వేగాస్ (1998) కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడడంతోపాటు పామ్ డి ఓర్ అవార్డు కూడా పోటీ పడింది. ది ఫిషర్ కింగ్ సినిమాకు బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నుండి సిల్వర్ బేర్‌ను అందుకున్నాడు. 2013లో ఆర్డర్ డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెటర్స్ అవార్డు లభించింది.

మూలాలు[మార్చు]

  1. "Terence Vance GILLIAM". Companies House. Retrieved 2023-06-03.
  2. 2.0 2.1 "BBC Music biography". BBC Music. Retrieved 2023-06-03.
  3. "Outstanding British Contribution To Cinema in 1988". BAFTA.org. Retrieved 2023-06-03.
  4. The Pythons: Autobiography by the Pythons. New York: St. Martin's Griffin. 2005. ISBN 978-0-312-31145-2.
  5. Gilliam, Terry; Sterritt, David; Rhodes, Lucille (April 2004). Terry Gilliam: Interviews. Univ. Press of Mississippi. p. 67. ISBN 978-1-57806-624-7. Retrieved 2023-06-03. Mad (magazine) comics inspired everything we ever did. (p. 67)
  6. "Terry Gilliam '62 Honored by British Film Academy". Oxy. Occidental College. 9 February 2009. Archived from the original on 5 ఏప్రిల్ 2018. Retrieved 3 జూన్ 2023.
  7. "Gilliam to get Bafta fellowship". BBC News. 3 February 2009. Retrieved 2023-06-03.

బయటి లింకులు[మార్చు]