Jump to content

టోటల్ స్టేషన్

వికీపీడియా నుండి
స్వీడన్ లో టోటల్ స్టేషను ఉపయోగించి ఇనుప యుగంపై చేస్తున్న పురావస్తు సర్వే.

టోటల్ స్టేషన్ అనేది ఆధునిక సర్వేయింగులోను, నిర్మాణాలలోనూ ఉపయోగించే ఒక ఎలక్ట్రానిక్/ఆప్టికల్ పరికరం. ఇది ఒక ప్రత్యేక బిందువుకు పరికరం నుండి వాలు దూరాలను రీడ్ చేయడానికి ఎలక్ట్రానిక్ డిస్టెన్స్ మీటరుతో (EDM) అనుసంధానించబడిన ఒక ఎలక్ట్రానిక్ థియోడోలైట్ (ట్రాన్సిట్). రోబోటిక్ టోటల్ స్టేషన్లు రిమోట్ కంట్రోల్ ద్వారా దూరం నుండి పరికరాన్ని నియంత్రించడానికి అపరేటర్లకు అనుమతినిస్తాయి. ఇది సహాయక సిబ్బంది అవసరం లేకుండానే ఆపరేటర్ లా పరావర్తనాన్ని కలిగిస్తుంది. పరిశీలన స్థానం నుండే టోటల్ స్టేషను నియంత్రిస్తుంది.

వేలాది ఎకరాల భూముల సర్వేను వేగంగా పూర్తి చేయడానికి ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్లు ఉపయోగపడతాయి. సర్వే గొలుసు ఉపయోగించి భూములు కొలవడం కష్టమనుకున్న చోట వీటి ద్వారా సులభంగా సర్వే చేయగలుగుతారు. ఆధునిక పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఈ ఈటీఎస్ మిషన్ల ద్వారా పంట సాగు అవుతున్న భూముల్లోను, కొండలు, గుట్టల్లో సైతం భూ సర్వే వేగంగా, కచ్చితంగా చేయవచ్చు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • సాక్షి దినపత్రిక - 25-10-2014 - (రాజధాని భూముల సర్వేకు ఈటీఎస్‌లు!)