డంకన్ షార్ప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డంకన్ షార్ప్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
డంకన్ ఆల్బర్ట్ షార్ప్
పుట్టిన తేదీ (1937-08-03) 1937 ఆగస్టు 3 (వయసు 87)
రావల్పిండి, బ్రిటీష్ పంజాబ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్-బ్రేక్
పాత్రబ్యాట్స్‌మన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 32)1959 నవంబరు 13 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1959 డిసెంబరు 9 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1957/58Punjab A
1958/59Pakistan రైల్వేస్
1959/60–1960/61లాహోర్
1961/62–1965/66సౌత్ ఆస్ట్రేలియా
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు {{{column2}}}
మ్యాచ్‌లు 3 37
చేసిన పరుగులు 134 1,531
బ్యాటింగు సగటు 22.33 27.33
100లు/50లు 0/1 2/7
అత్యధిక స్కోరు 56 118
వేసిన బంతులు 154
వికెట్లు 1
బౌలింగు సగటు 100.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/35
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 41/13
మూలం: CricketArchive, 2009 జనవరి 28

డంకన్ ఆల్బర్ట్ షార్ప్ (జననం 1937, ఆగస్టు 3) పాకిస్తాన్ మాజీ క్రికెటర్.1959-60లో మూడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఇతడు ఆంగ్లో-ఇండియన్ వారసత్వానికి చెందినవాడు, పాకిస్తాన్ తరపున టెస్ట్ క్రికెట్ ఆడిన మూడవ క్రైస్తవుడు.[1][2]

జీవిత విశేషాలు

[మార్చు]

రావల్పిండిలో జన్మించిన షార్ప్, లాహోర్‌లో పెరిగాడు. ఇతని తల్లి అక్కడ నర్సుగా పనిచేసేది.[1] ముగ్గురు సోదరులలో ఇతను ఒకడు. తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత అందరూ లాహోర్‌లోని సెయింట్ ఆంథోనీ హైస్కూల్ చేరారు.[3] డంకన్ షార్ప్ తన 17వ ఏట పాకిస్తాన్ రైల్వేస్‌లో క్లర్క్‌గా ఉద్యోగంలో చేరాడు.[3] షార్ప్ అప్పుడప్పుడు లాహోర్ ఆధారిత సివిల్ అండ్ మిలిటరీ గెజిట్‌కి వ్యాసాలు రాసేవాడు.[1]

పాకిస్థాన్‌లో కెరీర్

[మార్చు]

షార్ప్ 1955-56లో ముల్తాన్‌లో పర్యటించే ఎంసిసి జట్టుతో రైల్వేస్, బలూచిస్తాన్ జట్టుకు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా తన మొదటి ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడాడు.[4] తర్వాతి మ్యాచ్‌లో, 1957-58 క్వాయిడ్-ఎ-ఆజం ట్రోఫీలో పంజాబ్ ఎ తరపున బహవల్‌పూర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు.

1958-59లో వెస్టిండీస్ పాకిస్థాన్‌లో పర్యటించినప్పుడు రెండు టెస్టులకు పన్నెండవ ఆటగాడిగా ఉన్నాడు. 1959లో యువ ఆటగాళ్ళతో కూడిన పాకిస్థాన్ ఈగలెట్స్‌తో కలిసి ఇంగ్లాండ్‌లో పర్యటించాడు, మూడు నెలల నాన్-ఫస్ట్ టూర్‌లో 1608 పరుగులు చేశాడు.[5]

ఆ సీజన్ తర్వాత తన మొదటి ఫస్ట్-క్లాస్ సెంచరీని, లాహోర్‌లో పర్యటిస్తున్న ఇండియన్ స్టార్‌లెట్స్‌పై కంబైన్డ్ XI కోసం 118 పరుగులు చేశాడు.[6] 1960-61లో లాహోర్‌లో జరిగిన అయూబ్ ట్రోఫీ సెమీ-ఫైనల్‌లో రావల్పిండి, పెషావర్‌లపై లాహోర్ తరపున 109 పరుగులు చేశాడు.[7]

ఆస్ట్రేలియాలో కెరీర్

[మార్చు]

పాకిస్థాన్ 1960–61 భారత పర్యటనకు ఎంపిక కాకపోవడంతో నిరాశ చెందాడు. ఆస్ట్రేలియాకు వలస వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. బారీ జర్మాన్ చేత స్పాన్సర్ చేయబడి 1961లో అడిలైడ్‌కు మారాడు.[8] 1961-62 నుండి 1965-66 వరకు గ్యారీ సోబర్స్, జర్మాన్ వంటి వారితో కలిసి సౌత్ ఆస్ట్రేలియాతో షెఫీల్డ్ షీల్డ్ క్రికెట్ ఆడాడు. 1961-62లో వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన సీజన్‌లోని మొదటి షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో 50 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. దక్షిణ ఆస్ట్రేలియా తరపున 1965-66 సీజన్‌లో విక్టోరియాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో 72 పరుగుల వ్యక్తిగత అత్యధిక స్కోరు సాధించాడు.

అడిలైడ్ ఓవల్‌లో గ్రౌండ్స్‌మ్యాన్‌కి సహాయం చేసే ఉద్యోగాన్ని డాన్ బ్రాడ్‌మాన్ ఇతనికి సూచించాడు. తన నైపుణ్యాలు, అర్హతలను అభివృద్ధి చేసుకొని మెల్‌బోర్న్‌లోని పార్కులు, గార్డెన్స్‌లో ఫోర్‌మెన్ అయ్యాడు.[3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

షార్ప్ తన భార్య గిలియన్‌తో కలిసి మెల్‌బోర్న్‌లో నివసిస్తున్నాడు. వీరికి ఆరుగురు పిల్లలు.[9] ఇతనికి పాకిస్తాన్‌లో అంతకుముందు వివాహం జరిగింది, ఒక కుమారుడు కూడా ఉన్నాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Non-Muslims to play international cricket for Pakistan". The News International. 20 September 2020. Archived from the original on 27 December 2020. Retrieved 11 April 2021.
  2. Youhana's leap of faith
  3. 3.0 3.1 3.2 3.3 Richard Heller and Peter Oborne, White on Green: Celebrating the Drama of Pakistan Cricket, Simon & Schuster, London, 2016, pp. 102–11.
  4. "Railways and Baluchistan v MCC 1955–56". CricketArchive. Retrieved 18 June 2017.
  5. Gideon Haigh, Silent Revolutions, Black Inc, Melbourne, 2006, p. 286.
  6. "Combined XI v Indian Starlets 1959-60". CricketArchive. Retrieved 30 September 2017.
  7. "Lahore v Rawalpindi and Peshawar 1960-61". CricketArchive. Retrieved 30 September 2017.
  8. Gideon Haigh, The Summer Game, Text, Melbourne, 1997, p. 137.
  9. Haigh, Silent Revolutions, p. 284.

బాహ్య లింకులు

[మార్చు]