అక్షాంశ రేఖాంశాలు: 32°32′N 75°59′E / 32.53°N 75.98°E / 32.53; 75.98

డల్హౌసీ (హిమాచల్ ప్రదేశ్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డల్హౌసీ
హిల్ స్టేషన్
చంబా జిల్లా, హిమాచల్ ప్రదేశ్, భారతదేశంలోని డల్హౌసీ హిల్ స్టేషన్
డల్హౌసీ is located in Himachal Pradesh
డల్హౌసీ
డల్హౌసీ
డల్హౌసీ is located in India
డల్హౌసీ
డల్హౌసీ
Coordinates: 32°32′N 75°59′E / 32.53°N 75.98°E / 32.53; 75.98
దేశంభారతదేశం India
రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్
జిల్లాచంబా జిల్లా
Named forలార్డ్ డల్హౌసీ
Elevation
1,970 మీ (6,460 అ.)
జనాభా
 (2011)
 • Total7,051
 • Rankహిమాచల్ ప్రదేశ్ లో 25వ స్థానం
Time zoneUTC+5:30 (IST)
PIN
176304
టెలిఫోన్ కోడ్+91 1899
Vehicle registrationHP-47

డల్హౌసీ భారతదేశం, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, చంబా జిల్లాలోని గ్రామం, హిల్ స్టేషన్. ఇది సముద్ర మట్టానికి 1,970 మీ (6,460 అడుగులు) ఎత్తులో ఉంది.[1] బ్రిటీష్ గవర్నర్ జనరల్‌ డల్హౌసీ ఎక్కువగా ఈ ప్రదేశానికి వేసవి విడిది కోసం వచ్చేవాడు అందువలన దీనికి డల్హౌసీ అనే పేరు వచ్చింది.[2]

వాతావరణం

[మార్చు]

డల్హౌసీ తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణాన్ని కలిగి ఉంటుంది. వేసవి చివరిలో వర్షపాతం ఎక్కువగా  ఉంటుంది .ఇక్కడ  సగటు రాత్రి ఉష్ణోగ్రత 4 °C (39 °F), గరిష్టంగా 11 °C (52 °F)కి దగ్గరగా ఉంటుంది.[3] 

స్థానం

[మార్చు]

ఈ గ్రామం హిమాచల్ ప్రదేశ్‌లోని చంపా జిల్లా ఉత్తర భాగంలో ఉంది, దీని  చుట్టూ ఐదు కొండలు ఉన్నాయి. ఇది హిమాలయాల పశ్చిమ సరిహద్దులో మంచుతో కప్పబడిన దౌలతర్ పర్వతం మీద ఉంది.[4] 

విద్య

[మార్చు]

ఇది హిల్ స్టేషన్ కావడంతో చాలా బోర్డింగ్ స్కూల్స్ ఇక్కడ ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన బోర్డింగ్ పాఠశాలలు:

 • డల్హౌసీ పబ్లిక్ స్కూల్
 • సేక్రేడ్ హార్ట్ పబ్లిక్ స్కూల్[5]
 • హిల్ టాప్ పబ్లిక్ స్కూల్
 • గురునానక్ పబ్లిక్ స్కూల్

ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమ

[మార్చు]

పర్యాటక కేంద్రంగా ఉన్న డల్హౌసీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇక్కడ ప్రధాన పరిశ్రమ పర్యాటకం. ఇక్కడ సుమారు 600 హోటళ్లు ఉన్నాయి, ఇవి సుమారు 5-8 వేల మందికి ఉపాధి కల్పిస్తాయి. ఈ ప్రదేశం రాష్ట్ర జిడిపిలో 3% వాటాను కలిగి ఉంది.[6] 

పర్యాటక ప్రదేశాలు

[మార్చు]
 1. అల్లా
 2. కరేలను: సుభాష్ చంద్రబోస్ ఇక్కడి నీటిని తాగడం వల్ల క్షయ వ్యాధి నయమైందని చెబుతారు.
 3. గాంధీ చౌక్
 4. దైన్‌కుండ్
 5. బక్రోటా కొండలు
 6. డల్హౌసీ కంటోన్మెంట్
 7. సదర్ బజార్
 8. టిబెటన్ మార్కెట్
 9. పంచపూల[7]
 10. కలాతోప్ వన్యప్రాణుల అభయారణ్యం
 11. లక్ష్మీనారాయణ దేవాలయం
 12. మణిమహేష్ యాత్ర
 13. సెయింట్ పాట్రిక్స్ చర్చి

మూలాలు

[మార్చు]
 1. Gopal, Madan (1990). K.S. Gautam (ed.). India through the ages. Publication Division, Ministry of Information and Broadcasting, Government of India. p. 177.
 2. "Dalhousie: perfect summer getaway". Bangalore Mirror. 4 March 2010. Archived from the original on 6 March 2010. Retrieved 1 May 2013.
 3. "Maps, Weather, and Airports for Dalhousie, India". www.fallingrain.com. Retrieved 2023-07-10.
 4. him_admin. "Dalhousie". Himachal Tourism Official Website. Retrieved 2023-07-10.
 5. "Sacred Heart Senior Secondary School, Dalhousie". web.archive.org. 2011-08-27. Archived from the original on 2011-08-27. Retrieved 2023-07-10.
 6. "Himachal Pradesh Tourism Development Corporation". web.archive.org. 2010-10-20. Archived from the original on 2010-10-20. Retrieved 2023-07-10.
 7. "Himachal Tourism | Dalhousie". web.archive.org. 2010-09-20. Archived from the original on 2010-09-20. Retrieved 2023-07-10.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)