Jump to content

అట్లూరి సత్యనాథం

వికీపీడియా నుండి
(డా. అట్లూరి సత్యనాధం నుండి దారిమార్పు చెందింది)
అట్లూరి సత్యనాధం
జననంఅక్టోబర్ 7, 1945
భారత దేశం
పౌరసత్వంఅమెరికా సంయుక్త రాష్ట్రాలు
రంగములుఏరోస్పేస్ ఇంజనీరింగ్
మెష్లెస్ మెథడ్
వృత్తిసంస్థలుజార్జియా ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజలెస్
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, ఇర్విన్
చదువుకున్న సంస్థలుఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగుళూరు
ప్రసిద్ధికాంప్యుటేషనల్ మెకానిక్స్
మెష్లెస్ మెథడ్
ముఖ్యమైన పురస్కారాలుExcellence in Aviation Award (FAA) (1998)
Outstanding Achievement Award, U.S. National Academy of Engineering (1995)
The Hilbert Medal (2003)

విలక్షణమైన కాంప్యుటేషనల్ ఇంజనీరింగ్ (సంగణక సాంకేతిక శాస్త్రం)లో విశిష్టాచార్యునిగా పనిచేసిన అట్లూరి సత్యనాథం బహుముఖ ప్రజ్ఞాశాలి. భారతదేశంలో మూలాలు కలిగిన ఆయన ప్రస్తుతం సంయుక్త అమెరికా రాష్ట్రాల పౌరుడు. ఇర్విన్ లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో యూసీఐ డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్ గా మెకానికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నారు. ఆయన ఏరోస్పేస్, మెకానికల్ రంగాలలో పరిశోధనలు చేస్తున్నారు. ఏరోస్పేస్, మెకానికల్ ఇంజనీరింగ్ లో ఆయనకు విశేష రుచి ఉంది. ఈయన యూనివర్సిటీలో చదివించే, పరిశోధనలు చేసే రంగాలు : కాంప్యుటేషనల్ మాథ్మేటిక్స్, థీరిటికల్, అప్లైడ్ అండ్ కాంప్యుటేషనల్ మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ అండ్ ఫ్లుయిడ్స్ అట్ వేరియస్ లెన్త్ అండ్ టైం స్కేల్స్; కంప్యూటర్ మోడలింగ్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్;మెష్లెస్ అండ్ అదర్ నోవల్ కంప్యుటేషనల్ మెథడ్స్; స్ట్రక్చరల్ లాంగెవిటీ, ఫైల్యూర్ ప్రివెన్షన్, అండ్ హెల్త్ మేనేజ్మెంట్.

బాల్యం

[మార్చు]

అక్టోబర్ 7 1945న గుడివాడలో ఒక మామూలు కుటుంబంలో జన్మించాడు.[1]

చదువు

[మార్చు]

తణుకు, నెల్లూరు, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి నగరాలలో బాల్యాన్ని గడుపుతూ, చదువుకుంటూ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఆర్ట్స్ కాలేజీ, రాజమండ్రి నుండి డిగ్రీ పూర్తి చేసి తిరిగి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1964 సంవత్సరం వి.కె.మూర్తి స్వర్ణపతకం, 1965లో లాజరస్ పురస్కారం పొంది, ఇండియన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగుళూరు నుండి అత్యుత్తమ స్థాయిలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసుకున్నారు. మరింత చదవాలనే కాంక్షతో 1966లో మస్సాచ్యుసెట్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), అమెరికాకు వెళ్ళారు. ఎంఐటీ నుండి డాక్టర్ ఆఫ్ సైన్స్ ను 1969లో అందుకున్నారు. 1988లో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఐర్లాండ్ (హానారిస్ కాస) నుండి, 2005లో స్లొవక్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ (హానారిస్ కాస) నుండి, 2007లో గ్రీసులోని యూనివర్సిటీ ఆఫ్ పత్రాస్ (హానారిస్ కాసా) నుండి, 2009లో స్లొవేనియాలోని యూనివర్సిటీ ఆఫ్ నోవా గార్సియా (హొనొరిస్ కౌసా) నుండి గౌరవ డాక్టరేట్ పొందారు.

ఉపాధ్యాయ వృత్తి

[మార్చు]

ఉపాధ్యాయుడిగా సత్య అనుభవం:

  • యూనీవర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజెలిస్ వద్ద డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్
  • జార్జియా టెక్ వద్ద ఇంస్టిట్యూట్ ప్రొఫెసర్ గా, రీజెంట్స్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంజనీరింగ్ గా, హై టవర్ చెయిర్ ఇన్ ఇంజనీరింగ్ గా
  • ఎంఐటీ వద్ద 1990-91 జేసీ హుంసాకర్ ప్రొఫెసర్
  • యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ - అసిస్టెంట్ ప్రొఫెసర్

మూలములు

[మార్చు]
  1. కృష్ణా జిల్లా తేజోమూర్తులు, గుత్తికొండ జవహర్లాల్, సాహితి ప్రచురణలు. పేజీ 20