డిప్ గొగోయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డిప్ గొగోయ్

పదవీ కాలం
2002 – 15 మే 2014
ముందు తరుణ్ గొగోయ్
తరువాత గౌరవ్ గొగోయ్
నియోజకవర్గం కలియాబోర్

శాసనసభ్యుడు
పదవీ కాలం
2001 – 2001
ముందు హేమంత కలిత
తరువాత తరుణ్ గొగోయ్
నియోజకవర్గం తితబార్

వ్యక్తిగత వివరాలు

జననం (1951-12-17) 1951 డిసెంబరు 17 (వయసు 72)
రంగమాటి, జోర్హాట్, అస్సాం, భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు కామేలేశ్వర్ గొగోయ్, ఉష
జీవిత భాగస్వామి మిటాలి గొగోయ్
పూర్వ విద్యార్థి డిబ్రూఘర్ విశ్వవిద్యాలయం
మూలం [1]

డిప్ గొగోయ్ ( అస్సామీ : দীপ গগৈ ; జననం 17 డిసెంబర్ 1951) (జననం 1 మార్చి 1969) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒకసారి శాసనసభ్యుడిగా, మూడుసార్లు కలియాబోర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3] డిప్ గొగోయ్ అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ సోదరుడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

డిప్ గొగోయ్ 1951 డిసెంబరు 17న అస్సాం రాష్ట్రం, జోర్హాట్ లో జన్మించాడు. ఆయన డిబ్రూగర్ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ పూర్తి చేశాడు. డిప్ గొగోయ్ మితాలీ గొగోయ్‌ని వివాహం చేసుకున్నాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

డిప్ గొగోయ్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి తితబార్ శాసనసభ నియోజకవర్గం నుండి 2001లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2002లో కలియాబోర్ నియోజకవర్గంకు జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2004, 2009లో వరుసగా మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. "Dip Gogoi to relinquish his Titabar seat for brother Tarun". The Sentinel. 15 మే 2001. Archived from the original on 27 April 2005. Retrieved 30 August 2012.
  2. "Shri Dip Gogoi". Government of India. Retrieved 30 August 2012.
  3. "Dip Gogoi". Netapedia. Archived from the original on 3 March 2016. Retrieved 30 August 2012.