డిమము
Appearance
దశ రూపాకాలలో ఐదవ రూపకము డిమము. డిమం అనగా సంఘాతం, సమూహం, విద్రవం లేక ఉపద్రవం. ఈ రూపకాలలో యుద్ధం, జల, వాయు, అగ్ని, గజేంద్రోపద్రవముంటాయి.
దశ రూపకాలు
[మార్చు]ఈ దశ రూపకాలు పది రకాలు;[1]
డిమము - విధానం
[మార్చు]ఈ రూపకాలలో దేవ, గంధర్వ, యక్ష, రక్షో, మహూరగ, భూత, విశాచాదుల వంటి 16 మంది నాయకులు, ప్రఖ్యాత ఇతివృత్తం ఉంటాయి. రౌద్రం ప్రధాన రసం. అంకాలు నాలుగు. సాత్త్వతార్భటి వృత్తులు, శాంత, శృంగార, హాస్య రసాలు కాక మిగిలిన ఆరురసాలు ఉంటాయి. విష్కంభ, ప్రవేశకాలు ఉండవు. విమర్శకాక మిగతా నాలుగు సంధులు ఉండాలి. మాయ, ఇంద్రజాలం, యుద్ధం, సూర్య చంద్రగ్రహణాలను వర్ణించాలి. నాటకంలో మాదిరిగానే ప్రస్తావనాది నాట్యధర్మాలు నిబంధించాలి. ఉదా. వృత్తోద్ధరణం, తారకోద్ధరణం, త్రిపురదాహం.
మూలాలు
[మార్చు]- డిమము, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 324.