డి.ఎల్. రవీంద్రా రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డి.ఎల్. రవీంద్రా రెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1978 - 1985
1989 - 1999
2004 - 2014
నియోజకవర్గం మైదుకూరు నియోజకవర్గం

ఆర్ధిక, ఆరోగ్య, చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009 - 2013

వ్యక్తిగత వివరాలు

జననం 1950 డిసెంబర్ 07
ఖాజీపేట, ఖాజీపేట మండలం, వైఎస్‌ఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ Hand INC.svg కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు వెంకటస్వామి రెడ్డి, సుబ్బాయమ్మ
జీవిత భాగస్వామి సుభద్ర
సంతానం నిర్మల, శిరీష
వృత్తి రాజకీయ నాయకుడు

దుగ్గిరెడ్డి లక్ష్మి రెడ్డి రవీంద్రా రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆర్ధిక, ఆరోగ్య, చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

డి.ఎల్. రవీంద్రా రెడ్డి 1978లో స్వతంత్ర అభ్యర్థిగా మైదుకూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి 1978 నుంచి 2009 వరకు శాస‌న‌స‌భ‌కు ఎనిమిది ప‌ర్యాయాలు పోటీ చేసి ఆరుసార్లు విజ‌యం సాధించాడు. ఆయన వ‌రుస‌గా 1978, 1983లో గెలిచి, 1985లో ఓడిపోయి మ‌ళ్లీ 1989, 1994లో గెలిచి, 1999లో ఓడిపోయి తిరిగి 2004, 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2012లో కడప పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయాడు.[1]

డి.ఎల్. రవీంద్రా రెడ్డి 1991 నుంచి 1994 మ‌ధ్య నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి ల మంత్రివ‌ర్గంలో చిన్ననీటిపారుద‌ల‌, విద్యుత్తు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ‌ల‌ మంత్రిగా పని చేశాడు. ఆయన 2010లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివ‌ర్గంలో వైద్య, ఆరోగ్య, విద్య, రాజీవ్ ఆరోగ్య శ్రీ, 108, 104, కుటుంబ‌ సంక్షేమ, ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ మండ‌లి శాఖ‌ల మంత్రిగా పని చేశాడు.[2]

మూలాలు[మార్చు]

  1. Sakshi (20 January 2014). "డిఎల్ రాజకీయ వైరాగ్యం!". Retrieved 3 June 2022.
  2. Rediff (1 June 2013). "AP Health Minister D L Ravindra Reddy removed from cabinet" (in ఇంగ్లీష్). Retrieved 8 June 2022.