డి.వి. రమణమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డి.వి.రమణమూర్తి
జననం1930
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల హాస్యనాటక రచయిత

డి.వి. రమణమూర్తి తెలుగు రంగస్థల హాస్యనాటక రచయిత.[1]

జననం - ఉద్యోగం[మార్చు]

రమణమూర్తి 1930, ఆగస్టు 23న విజయనగరం లో జన్మించాడు. కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. 1955లో దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగంలో చేరి, విరమణ పొందాక కాకినాడ లో ఉంటున్నారు.

రంగస్థల ప్రస్థానం[మార్చు]

రమణమార్తి చక్కటి కుటంబ హాస్యాన్ని సృష్టిస్తాడు. కరుణ రసాన్ని కూడా రాసేవాడు. మాటల కూర్పులో పొందిక, చమత్కారం, సంక్షిప్తత, సున్నిత హాస్యం ప్రేక్షకులను గిలిగింతలు పెడతాయి. రేడియో, టీవిలకు అనేక నాటకాలు రాసి ప్రశంసలు అందుకున్నాడు.

రచించిన నాటికలు:

  1. వశీకరణం
  2. ఉత్తరం
  3. వంటమనిషికావాలి
  4. లీల
  5. కళ్లజోడు
  6. క్షణికం

మూలాలు[మార్చు]

  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.487.