డి. రాజా
దొరైసామి రాజా (జననం 3 జూన్ 1949) ఒక భారతీయ రాజకీయ నాయకుడు జూలై 2019 నుండి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. అతను తమిళనాడు నుండి మాజీ రాజ్యసభ సభ్యుడు. [1] [2] అతను 1994 నుండి 2019 వరకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. [1] [3] [4]
జననం
[మార్చు]రాజా తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని చిత్తత్తూరులో దళిత కుటుంబంలో జన్మించారు. [1] [5] అతని తండ్రి పి. దొరైసామి, తల్లి నాయకం వ్యవసాయ రైతులు. [1]
వ్యక్తిగత జీవితం
[మార్చు]1990 జనవరి 7న రాజా అన్నే రాజాను వివాహం చేసుకున్నారు . డి రాజా దంపతులకు ఒక కూతురు అపరాజిత రాజా ఉంది.
రాజకీయ జీవితం
[మార్చు]కళాశాల రోజుల్లోనే ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్‌లో చేరాడు. తరువాత రాజా ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ నాయకుడయ్యాడు 1975 నుండి 1980 వరకు తమిళనాడు యూనిట్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు, ఆపై 1985 నుండి 1990 వరకు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1994లో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ కార్యదర్శిగా 2019 వరకు పనిచేశారు. 21 జూలై 2019న, సీపీఐ జాతీయ కౌన్సిల్ ఆయనను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. [6]
రాజా మొదటిసారిగా జులై 2007లో తమిళనాడు నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు 2013లో రెండవసారి ఎన్నికయ్యారు. [1]
కమ్యూనిస్టు పార్టీలో స్థానం పొందిన దళితుడు రాజా.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "Detailed Profile: Shri D. Raja". National Portal of India. Archived from the original on 10 May 2020. Retrieved 13 January 2018.
- ↑ "D. Raja". prsindia.org.
- ↑ "Tamil Nadu News : Doraisamy Raja, CPI candidate for RS polls". The Hindu. 2007-05-24. Archived from the original on 2007-05-25. Retrieved 2012-08-26.
- ↑ "CPI re-nominates D. Raja for Rajya Sabha". The Hindu (in Indian English). 16 June 2013.
- ↑ "D. Raja: Age, Biography, Education". One India (in ఇంగ్లీష్).
- ↑ "D. Raja takes over as CPI general secretary". The Hindu (in Indian English). 21 July 2019.