దుద్దెడ సుగుణమ్మ
దుద్దెడ సుగుణమ్మ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | ప్రజా గాయని |
దుద్దెడ సుగుణమ్మ శ్రీవరిసాగు అత్యధిక దిగుబడినిచ్చిందని నిరూపించిన మహిళ.[1] ఈవిడ 2017 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[2]
జీవిత విశేషాలు
[మార్చు]సుగుణమ్మ వరంగల్ జిల్లా, బచ్చన్నపేట మండలం కట్కూరు గ్రామానికి చెందిన మహిళ. ఆమె కుటుంబం కూలి పని మీదే ఆధారపడి జీవిస్తుంది. స్వంత భూమి లేకపోవడంతో కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసినా, ఆర్థికంగా నష్టపోవడంతో ఆమె కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనతో ఆమె కుటుంబ సభ్యులు మానసికంగా కుంగిపోయారు. ఈ దశలో క్రాప్స్ సంస్థ వారిచ్చిన సూచనల మేరకు శ్రీవరి సాగు చేసి ఎకరానికి 65 బస్తాలు పండించారు.
శ్రీవరి సాగు
[మార్చు]తన 4 ఎకరాల భూమిలో శ్రీవరిసాగు చేసి అధిక దిగుబడిని సాధించింది. దీంతో అమెరికాలో అక్టోబరు 12 2010 వ తేదీ నుండి అక్టోబరు 16 2010 జరిగే వరల్డ్ ఫుడ్ ప్రైజ్ సదస్సులో పాల్గొనేందుకు ఆమెను సెం టర్ ఫర్ ప్రైరీ స్టడీస్ అండ్ దా సెంటర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్, ఆప్కా ఫాం అమెరికా సంస్థ సదసుసలో పాల్గొనేందుకు ఆహ్వానించింది.[3] సుగుణమ్మ వెంట రీవరి సాగు గురించి వివరించేందుకు హైదరాబాద్‌కు చెందిన ఇక్రిసాట్ ప్రతినిధులు మనీషా అగర్వాల్ వెళ్ళారు.[4] అమెరికాలో జరిగిన సదస్సులో ఆమె గ్రామంలో శ్రీవరి సాగుపై వివరించారు.ఆమె తెలుగులో చెబుతుండగా ఇక్రిశాట్ డాక్యుమెంటేషన్ అధికారి మనిషా అగర్వాల్ ఇంగ్లీషులో అనువదించారు. ఆమె చెబుతున్న విషయాలు ప్రపంచ దేశాల నుండి వచ్చిన 60 మంది ప్రతినిధులు, రైతులందరూ శ్రద్ధగా విన్నారు.
క్రాప్స్ సంస్థ ప్రోత్సాహం
[మార్చు]వ్యవసాయం విధానాలపై గత 20 సంవత్సరాలుగా పలు పరిశోధనలు చేస్తున్న సంస్థ కాప్ట్ సంస్థ. వ్యవసాయం లో రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకం తగ్గించి సేంద్రీయ ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి వచ్చే శ్రీవరి సాగుపై వివిధ మండలాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నరు. బిఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ విద్యార్హత ఉన్న వ్యక్తులంతా కలసి స్థాపించిన క్రాప్స్ సంస్థ ఆధ్వర్యంలో నిరంతరం రైతులకు అందుబాటులో ఉంటూ వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు.[5]
బహుమతులు - పురస్కారాలు
[మార్చు]- తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, మార్చి 8, 2017
మూలాలు
[మార్చు]- ↑ Famous Personalities Of Warangal
- ↑ నమస్తే తెలంగాణ. "యత్ర నార్యస్తు పూజ్యంతే." Retrieved 18 April 2017.
- ↑ SYSTEM OF RICE INTENSIFICATION
- ↑ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ సదస్సుకు సుగుణమ్మ[permanent dead link]
- ↑ సూర్య పత్రికలో ఆర్టికల్[permanent dead link]