డీగో మారడోనా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మారడోనా ముండియల్

సాకర్ మాంత్రికుడిగా పేరు పొందిన, అర్జెంటీనాకు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు డీగో మారడోనా. బ్రెజిల్కు చెందిన పీలే తర్వాత సాకర్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడినా డీగో మారడోనానే పరిగణిస్తారు. ఎన్నో పర్యాయాలు ఒంటిచేతితో అర్జెంటీనాను గెలిపించిన క్రీడాయోధుడు ఇతను. 1986లో అర్జెంటీనా జటుకు కెప్టెన్ గా ఉండి ప్రపంచ కప్ ఫుట్‌బాల్ ట్రోఫీని సాధించి పెట్టడమే కాకుండా 1990 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ లో పైనల్ దశకు చేరి రన్నరప్ గా నిల్చడం ఇతని ఘనకీర్తి అని చెప్పవచ్చు. 1990 వరల్డ్ కప్ పైనల్స్ లో జర్మనీ చేతొలో ఓడిపోయాక కంతతడి పెట్టడం అతని యొక్క పోరాట పటీమను తెలియజేస్తుంది. డ్రగ్స్ తో పట్టుబడి 15 మాసములు బహిష్కృతుడై, ఆ తర్వాత మళ్ళీ జట్టును విజయపథంలో నడిపించడం అతనికే చెల్లింది. ఈ విధంగా సాకర్ చరిత్రలోనే అతనిది ఒక సువర్ణాధ్యాయం అని చెప్పవచ్చు.