ఫిఫా ప్రపంచ కప్
స్థాపితము | 1930 |
---|---|
జట్ల సంఖ్య | 32 (కడపటి పోటీలు) 204 (2010 లో మొత్తం పాల్గొన్న జట్లు) |
ప్రస్తుత ఛాంపియన్లు | ![]() |
అత్యంత విజయవంతమైన జట్టు (లు) | ![]() |
వెబ్సైట్ | అధికారిక జాలపుట |
![]() |
![]() 2014 ఫీఫా ప్రపంచ కప్ ప్రారంభోత్సవం. | |
ఆటలపోటీలు | |
---|---|
ఫీఫా ప్రపంచ కప్ (FIFA World Cup), లేదా క్లుప్తంగా ప్రపంచ కప్ (World Cup), అని పేరొందిన కాల్బంతి (Football) పోటీ ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడా పోటీ అని చెప్పవచ్చు. ఈ పోటీలో కాల్బంతి ఆటలో వాసికెక్కిన జాతీయ జట్లు, తమ దేశాలకి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ ఆటలపోటీలు 1930 లో మొదలయ్యి, నాలుగేళ్ళకోసారి (1942,46 లో ద్వితీయ ప్రపంచ యుద్ధం మూలాన తప్ప) కొనసాగుతూ వస్తున్నాయి. ప్రస్తుత విజేత జర్మనీ, బ్రెజిల్లో జరిగిన 2014 ఫీఫా ప్రపంచ కప్ లో అర్జెంటీనాను ఓడించి, కప్పును స్వంతం చేసుకుంది.
దాదాపు మూడేళ్ళ పాటు ప్రాథమిక పోటీలు నిర్వహించి ఎంపికచేసిన 32 అత్యుత్తమ జట్ల మధ్య నెల్లాళ్ళపాటు అంతిమ పోటీల లో బలాబల నిర్ణయం జరుగుతుంది. కొన్ని గుంపులుగా విభజించిన ఈ జట్లమధ్య పరస్పర పోటీలలో గెలిచిన విజేతలు, ముందుకెళ్ళి ఇతరవిజేతలతో తలబడతాయి. ఆతిథ్యమిచ్చే జట్టు వీటిలో ఒక జట్టు అవడం కద్దు.
ఇంతవరకూ జరిగిన 19 ప్రపంచ కప్ ఆటలపోటీల్లో 8 జట్లే చివరికి విజేతలుగా రావడం విశేషం. ప్రతి సారీ పోటీలో పాల్గొన్న ఏకైక జట్టు బ్రెజిల్ 5 సార్లు గెలవగా, ఇటలీ,జర్మనీలు నాలుగు సార్లు,అర్జెంటీనా, ఉరుగ్వేలు రెండేసి సార్లు నెగ్గాయి. ఇంగ్లాండ్, ఫ్రాన్స్,స్పెయిన్లు ఒకొక్కసారి గెలిచాయి.
2014 జూలైలో బ్రెజిల్లో జరిగిన ప్రపంచ కప్, ఆ తరువాత 2018 లో రష్యా లోనూ అటుపిమ్మట 2022 లో కతార్ లోనూ జరపాలని ఫీఫా నిశ్చయించింది. ప్రపంచంలోనే అత్యధికులు వీక్షించే ఆటలపోటీలు ఈ ఫీఫా ప్రపంచ కప్ వే.
చరిత్ర[మార్చు]
మునుపటి అంతర్జాతీయ పోటీలు[మార్చు]
ఫీఫా 1904 లో స్థాపించబడ్డాక మొదటిసారి ఒలింపిక్స్ కి బయట స్విట్జర్లాండులో 1906లో అంతర్జాతీయ కాల్బంతి క్రీడా పోటీలను నిర్వహించజూసింది, కానీ అది ఆశించినంతగా విజయం సాధించలేక పోయింది. 1908 లండన్ లో జరిగిన వేసవి ఒలింపిక్స్ లో మొట్టమొదటి అంతర్జాతీయ కాల్బంతి పోటీలు జరిగాయని చెప్పవచ్చు. దీనిలోనూ తరువాతి 1912 స్టాక్ హోమ్ లో జరిగిన ఒలింపిక్స్ లోనూ కూడా బ్రిటన్ బంగారు పతకాలను గెలుచుకుంది. ఇవన్నీ కూడా అభిలాషకుల (అమెచ్యూర్) క్రీడలుగానే పరిగణిస్తారు.
1914 లో, ఫీఫా వేసవి ఒలింపిక్స్ ని అభిలాషకుల ఆటగా గుర్తించింది. తద్వారా 1920 లో తొలిసారి ప్రపంచ వ్యాప్తంగా 14 దేశాలు (13 యూరోపియన్ దేశాలూ, ఈజిప్ట్ తో పాటు) పోటీ పడ్డ ఒలింపిక్ పోటీలో బెల్జియం విజేతగా నిల్చింది. తదుపిమ్మటి రెండు ఒలింపిక్స్ 1924, 1928 లోనూ ఉరుగ్వే విజయకేతనం ఎగుఱవేసింది. 1924లోనే ఫీఫా ఆధ్వర్యంలో వృత్తిపరమైన క్రీడాకారుల శకం కూడా ప్రారంభమైంది..
రెండొ ప్రపంచ యుద్ధానికి ముందఱి ప్రపంచకప్[మార్చు]
కాల్బంతి ఆట ఒలింపిక్స్ లో సంతరించుకున్న ప్రాధాన్యత దృష్ట్యా 1928 నుండి ఫీఫా వృత్తిపరమైన ఆటలపోటీల పై కృషిచేసింది. తమ స్వాతంత్ర్య శతాబ్ది జరుపుకుంటూన్న సందర్భంలో రెండుసార్లు ఒలింపిక్స్ కాల్బంతి బంగారు పతకాలను అప్పటికే అందుకున్న ఉరుగ్వే 1930లో తొలి ప్రపంచ కప్ పోటీలకు ఆతిథ్యమిచ్చింది. కానీ అంతదూర ప్రయాణమైన అమెరికా ఖండానికి జట్టుని పంపించడాన్ని, ఉరుగ్వేని తొలిసారి ఎంపిక చేయడాన్ని కూడా అంతగా నచ్చుకోని (ముఖ్యంగా యూరోపియన్) సభ్యదేశాలు పెద్దగా సుముఖత చూపలేదు. చివరికి పోటీలు 2 నెలల్లో ఉన్నాయనగా ఫీఫా అధ్యక్షుడు రిమెట్ తీసుకున్న చొఱవవల్ల బెల్జియం, ఫ్రాన్స్, రొమేనియా, యుగోస్లేవియాలు మాత్రం తమ జట్లను ఈ పోటీలకు పంపించాయి. మొత్తం పాల్గొన్న 13 దేశాలలో 7 దక్షిణ అమెరికా దేశాలు, 4 యూరోపియన్ దేశాలు, మిగిలిన రెండూ ఉత్తర అమెరికా నుండి వచ్చినవి.93,000 మంది ప్రత్యక్ష ప్రేక్షకుల సమక్షంలో పొరుగుదేశం అర్జెంటీనాను ఓడించి, ఉరుగ్వే ఈ మొట్టమొదటి బహుమానాన్ని కైవశం చేసుకుంది.[1]
1932లో లాస్ ఏంజెల్స్ లో జరిగిన ఒలింపిక్స్ లో కాల్బంతి ఆటను చేర్చలేదు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోలో ఈ ఆటకు అంతగా ప్రజాదరణ లేకపోవడమే దీనికి కారణం. అటుతరువాతి సంవత్సరాలలో యుద్ధవాతావరణం నెలకొనడం వల్ల, 1938, 1946 సంవత్సరాలలో యూరోప్ కి వెళ్ళిన ఏకైక దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్ మాత్రమే. 1942 లో నాజీ జర్మనీ ఆతిథ్యమీయ తలపెట్టిన ఒలింపిక్స్ రద్దయ్యాయి.
రెండో ప్రపంచ యుద్ధం తరువాతి ప్రపంచ కప్[మార్చు]
బ్రెజిల్ లో 1950లో జరిగిన ప్రపంచ కప్ పోటీలలో తొలిసారి బ్రిటన్, దాని సామంత దేశాలు పాల్గొన్నాయి. ఈ పోటీలో అంతిమ సమరంలో బ్రెజిల్ ను ఓడించి, ఉరుగ్వే మరలా ప్రపంచ కప్ ను స్వంతం చేసుకుంది.
1934 నుండి and 1978 వరకూ జరిగిన అన్ని ప్రపంచకప్ పోటీలలోనూ, 16 జట్లు పోటీ పడవలసింది.. కానీ 1938 లో మాత్రం ఆస్ట్రియా నాజీ జర్మనీలో కలిసిపోయినందువల్ల 15 జట్లే ఆడాయి.. 1950 లో భారత, స్కాట్లాండ్, టర్కీ జట్లు పోటీలకు ఎంపికైన పిమ్మట వైదొలగడంతో 13 జట్లే పోటీలో మిగిలాయి. రాశిలోనే కాక వాసిలో కూడా దక్షిణ అమెరికా/యూరోపియన్ దేశాలదే పై చేయిగా ఉండేది.
32 జట్లకు వ్యాపించడం[మార్చు]
1982 నుండి 24 జట్లకూ, 1998 తరువాత 32 జట్లకూ ఫీఫా ప్రపంచకప్ లో చోటు కల్పించడంతో పాటు ఆఫ్రికా, ఆసియా, ఉత్తరమెరికా లకూ పాల్గొనే వీలు కల్పించారు. వేర్వేరు సంవత్సరాలలో - మెక్సికో, కొరియా సెనెగల్, యూఎస్ఏ, ఘనా వంటి జట్లు స్పర్థాపాదస్థాయి (క్వార్టర్ ఫైనల్స్) వరకూ చేరుకున్నాయి. కానైతే, ఇప్పటికీ యూరోపియన్, దక్షిణమెరికా జట్లే కాల్బంతి ఆటలో బలోపేతమైన శక్తులని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
అంతర్జాతీయంగా అత్యంత ఆదరణనందుకునే క్రీడగా కాల్బంతి చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్న నేపథ్యంలో 2002 ప్రపంచ కప్ లో పాల్గొనడానికి 200 దేశాలు, 2006 లో 198 దేశాలు బరొలోకి దిగితే, 2010 పోటీలకు ముందెన్నడూ లేనన్ని 204 దేశాలు ఆసక్తి కనబరచాయి.[2]
బహుమతి[మార్చు]
1930 నుండి 1970 వరకూ ప్రపంచ కాల్బంతి విజేతలకు చేతులు మారే కప్పు ఇచ్చేవారు - 1946లో మొదటి ఫీఫా అధ్యక్షుని గౌరవార్థం దీనినిజూల్స్ రిమెట్ బహుమతి అని పేరు మార్చారు. 1970లో మూడవ సారి వెజేతలైన బ్రెజిల్ ఈ జ్ఞాపికను శాశ్వతంగా చేజిక్కించుకుంది కాని అది 1983లో దొంగలపాలైంది.[3]
1970 లో మొదలుపెట్టి, ఏడు దేశాల ఫీఫా సభ్య నిపుణులు- 53 నమూనాలను బేరీజువేసి, ఇటాలియన్ రూపకర్త సిల్వియో గజానిగా ప్రతిపాదించిన కొత్త ఫీఫా ప్రపంచ కప్ బహుమతికి ఆమోదముద్ర వేశారు. 36 సెం.మీ (14.2 అంగుళాలు) ఎత్తైన 18 కారట్ల (75%) బంగారు జ్ఞాపిక బరువు 6.175 కిలోలుంటుంది. ప్రతీ నాలుగేళ్ళకీ ఇదే జ్ఞాపిక చేతులు మారుతూ ఉంటుంది. మునుపటి విజేతలకి బంగారు తాపడం చేసిన నకలు ఉంచుకునేలా నిర్ణయంచేసారు.[4]
మొదటి మూడు స్థానాలలో నిలిచిన జట్ల ఆటగాళ్ళు, శిక్షకులు, యజమానులందరికీ ప్రపంచ కప్ బహుమతి చిఱునమూనాలు గల పతకాలను అంద జేస్తారు. వారి జట్ల స్థానాలను బట్టి ఈ పతకాలు బంగారం, వెండి, లేదా కంచులో బహూకరించబడతాయి. 2002 లో నాల్గవస్థానపు పతకాలను ఆతిథ్యమిచ్చిన దక్షిణ కొరియాకు అందజేయడం జరిగింది.
క్రీడల నిర్వహణ[మార్చు]
ఉత్తీర్ణతా పోటీలు[మార్చు]
1934 నుంచీ అంతిమ క్రీడాస్పర్థను కుంచించే ఉద్దేశంతో ఉత్తీర్ణతా పోటీలు నిర్వహించడం పరిపాటి అయింది. (ప్రతీ ఖండాన్నించీ ఎన్నేసి జట్లను ఎంపిక చేయాలో ఆయా జట్ల బలాబలాననుసరించి ఫీఫా ముందే నిర్ణయిస్తుంది). కడపటి ఆటల ముహూర్తానికి రమారమి మూడేళ్ళ ముందే ఈ ఉత్తీర్ణతా పోటీలు మొదలవుతాయి. ఒకో గుంపులోను కొన్ని జట్లు తమ మునుపటి పాటవం మూలంగా స్వతహాగా కొన్ని స్థాయిల పై మెట్టుమీదకి (ఆడనక్కర లేకుండా). మరికొన్ని ఆ ఉత్తీర్ణతా పోటీలలో పోరాడి ఆస్థానాన్ని చేరుకునే జట్లూ ఉంటాయి.. ఒక్కో ఉపసంఘానికి (కాన్ఫెడరేషన్) నియమాలలో చిన్నచిన్న భేదాలూ ఉంటాయి. 1938-2002 మధ్య ఏర్పరిచిన గతవిజేతల చేర్పు హక్కును ఆ పిమ్మట రద్దు చేసారు. 2006 లో గతవిజేతలైన బ్రెజిల్ మఱలా ఉత్తీర్ణతా పోటీల ద్వారా ప్రవేశించవలసి రావడం ఈ నియమానికి ప్రారంభం.[5]
కడపటి పోటీలు[మార్చు]
ఏదో ఒక పోటీ చేస్తున్న దేశం ఆతిథ్యమిస్తూన్న ప్రస్తుత ప్రపంచ కప్ కాల్బంతి పోటీలు 32 జట్ల మధ్య నెల్లాళ్ళ పాటు జరుగుతాయి. వీటిలో 8 గుంపుల్లో నాలుగేసి చొప్పున జట్లు తమ గుంపులోని అన్ని ఇతర జట్లతోనూ ఆడతాయి. ఇక్కడ సాధించిన గుణాల ఆధారంగా ప్రతి గుంపు నుండి రెండేసి ఉత్తమ జట్లు తరువాతి స్థాయికి చేరుతాయి. ఇతర క్రీడలలోలాగే ఈ స్థాయిలో ఓడించి ముందుకు సాగే పద్ధతి (knockout)లో ఆటలు సాగుతాయి. [6]
ప్రతి గుంపులోనూ రెండింటికన్నా ఎక్కువ యూరోపియన్ జట్లుగాని, మరే ఇతర ప్రాంతంనుండి ఒకటి కన్నా ఎక్కువ జట్టుగాని లేకుండా సమ ఉజ్జీలను బరిలోకి దింపడం కూడా ఆనవాయితీగా వస్తోంది. గుంపులో జట్ల గుణగణాలని ఈ క్రింది ప్రాతిపదికలపై (ఇచ్చిన వరుసలో) నిర్ధారిస్తారు:[7]
- అత్యధిక గుణాలు సంపాదించిన జట్టు
- సాధించిన/వదిలేసిన లక్ష్యాల (గోల్స్) సంఖ్యలో అత్యధిక భేదం కనబరచిన జట్టు
- అత్యధిక సంఖ్యలో లక్ష్యాలు సాధించిన జట్టు
- పై విషయాలననుసరించినా ఒకటి కన్న ఎక్కువ జట్లు సమాన తూకంలో ఉంటేగనుక ఇవే ప్రాతిపదికలను ఇదే వరుసలో అలా సమతూకంలో ఉన్న జట్లమధ్య పరస్పర పోటిలలో అన్వయించి, విజేతలను నిర్ణయిస్తారు. అప్పటికీ సరిసమానంగా ఉన్నచో చీటీలు తీసి ఒకరిని తరువాతి స్థాయికి పంపటం జరుగుతుంది.
గెలుపో,బయిటికో అన్నట్టుగా సాగే తరువాతి స్థాయిలో ఆట ఆటకీ ఒకొక్క జట్టు నిష్క్రమించితీరాల్సిందే. అవసరమైతే అధిక కాలావధి, ఆ పై పరిహార నిర్ణయం (penalty shootout) ద్వారా విజేతలను నిర్ణయిస్తారు. ఒకొక్క గుంపులో విజేత మరో గుంపులో మలివిజేతలతో 16 జట్ల మధ్య 8 పోటీలు మొదట జరుగుతాయి. ఇలా వచ్చిన 8 విజేతల మధ్య జరిగే తరువాతి ఆవృతాన్ని స్పర్థాపాద స్థాయి (quarter-finals) అనీ, అటుతర్వాతి 4 జట్ల మధ్య జరిగే పోటీలను స్పర్థార్ధస్థాయి (semi-finals) అనీ అంటారు. చివరికి జరిగే స్పర్థాంతిమ స్థాయి (final) పోటీకి ముందు, ఓడిన అర్ధవిజేతల మధ్య 3వ స్థానానికి కూడా పోటీ జరుగుతుంది.
ఆతిథ్య దేశాలు[మార్చు]
ఎంపిక పద్ధతి[మార్చు]
1930 లో ఉరుగ్వేలోనూ తరువాతి రెండు మార్లూ యూరోప్ లోనూ ఈ ప్రపంచ కప్ పోటీలను నిర్వహించడం వాదోపవాదాలకూ, అనేక దేశాలు ఫీఫా ఇష్టానుసార నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఆటలను బహిష్కరించడానికీ దారితీసాయి.
1958 తరువాత ఇలాటి అపోహలకు తావీయకుండా, ఏకాంతరంగా అమెరికా, ఐరోపా ల మధ్య ఈ పోటీలను నిర్వహించే సంప్రదాయాన్ని ఫీఫా పాటిస్తూ వచ్చింది. 2002 లో జపాన్, కొరియాలు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్ కాల్బంతి పోటీలు ఆసియాలో ప్రప్రథమమే కాక, వేర్వేరు దేశాలు సంయుక్తంగా నిర్వహించడానికి కూడా శ్రీకారం చుట్టాయి.[8] 2010 లో ఆతిథ్యమిచ్చిన దక్షిణాఫ్రికా ఆఫ్రికాలో ఈ హోదా పొందిన మొదటి దేశం. 2014 లో బ్రెజిల్ లో జరుగుతున్న ప్రపంచ కప్ 1978 తరువాత దక్షిణమెరికాలో 36 యేళ్ల తరువాత జరుగుతున్నవి. 3 సార్లు యూరోప్ బయట ఈ పోటీలు వరుసగా జరగడం కూడా ఇదే మొదటిసారి.
ఆతిథ్యమిచ్చే దేశాన్ని ఫీఫా కార్యనిర్వాహక సమితి ఎన్నికల ద్వారా ఎంపిక చేయడం ప్రస్తుతం పాటిస్తున్న పద్ధతి. ఈ ఆసక్తి కల దేశాలు ఫీఫా నియమ నిబంధనలు, ముందస్తు ఏర్పాట్లు పాటించగలమని హామీ ఇచ్చి, పిమ్మట నిరూపించుకోవలసి ఉంటుంది.ఆరేడేళ్ళ ముందే ఈ దేశాలను నిర్ణయించడం కద్దు. కొన్ని సార్లు తరువాతిదే కాక అటు తర్వాతి వేదికలను కూడా ముందుగానే ఫీఫా నిర్ణయిస్తుంది. 2018, 2022 ప్రపంచ కప్పులు, రష్యా,కతార్ ల వేదికలకు ఇలాగే నిశ్చయించారు.
పాటవ ప్రదర్శన[మార్చు]
ఇంత వరకూ కాల్బంతి ప్రపంచ కప్ గెలిచిన 8 దేశాలలో 6 దేశాలు తమ స్వంత గడ్డ మీదే గెలవడం విశేషం. ఇంగ్లాండ్ (1966) లోనూ ఫ్రాన్స్ (1998) గెలిచిన ప్రపంచ కప్పులు ఈ రెండుదేశాలకూ స్వదేశాలలో చిక్కినవే. ఇందుకు భిన్నంగా 1950 లో ఉరుగ్వే చేతిలో అంతిమ పోటీలో ఆతిథ్యమిస్తున్నబ్రెజిల్ ఓడిపోగా, 1982 లోస్పెయిన్, తమ దేశంలో పోటీలకు ఆతిథ్యమిస్తూ రెండవ చుట్టు పోటీలే దాటలేక పోయింది.ఉరుగ్వే (1930) లోనూ, ఇటలీ (1934) లోనూ అర్జెంటీనా (1978) లోనూ ఆతిథ్యమిస్తూ తమ తొలి ప్రపంచ కప్పులు సాధించినా, అటు పిమ్మట బయట కూడా గెలిచి తమ సత్తా చాటుకున్నాయి. జర్మనీ (1974) లో స్వంత గడ్డ మీద రెండవసారి ప్రపంచ కప్ గెలుచుకుంది.
అంతిమ విజేతలు కాలేక పోయినా స్వీడన్ (1958) లో మలి విజేత గానూ, చిలీ (1962) లో మూడవ స్థానంలోనూ, దక్షిణ కొరియా (2002), బ్రెజిల్ (2014) లలో నాల్గవ స్థానంలోనూ, మెక్సికో 1970, 1986 లలో ఆతిథ్యమిస్తూ పాదవిజేతల స్థాయి లోనూ నిలిచి, ఆతిథ్యమిస్తున్న దేశాల ప్రాభవాన్ని, స్థానబలిమిని నిరూపించాయి. 2010 లోదక్షిణాఫ్రికా ఒక్కటే ప్రపంచ కప్ కాల్బంతిలో మొదటిచుట్టు దాటలేక పోయిన ఆతిథ్య దేశం.
నిర్వహణ, మాధ్యమ ప్రసారణం[మార్చు]
కాల్బంతి ప్రపంచ కప్ ఆటలపోటీలను దూరదర్శినిలో చూపడం 1954 నించే ఆచారంగా వస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్ ని మించి, అత్యధికులు చూస్తున్న ఒకే ఒక ఆటలపోటీ ఫీఫా ప్రపంచ కప్. 2006 లోని ప్రపంచ కప్ అన్ని ఆటలూ కలిపి 2600 కోట్ల ప్రేక్షకులు చూసి ఉంటారని అంచనా.[9] 715.1 million individuals watched the final match of this tournament (a ninth of the entire population of the planet). కోకా కోలా, మెక్ డోనాల్డ్స్, అడిడాస్ లాంటి అనేక అంతర్జాతీయ కంపెనీలకి తమ ముద్రాచిహ్నాలకి గుర్తింపు పెంచుకునే గొప్ప సదవకాశం, ప్రపంచ కప్ కాల్బంతి పోటీలు. ఆతిథ్యమిస్తున్న దేశాలు ఈ నెల్లాళ్ళ ఆటల పండుగల్లో తమ పర్యాటనా రంగ ఆదాయాన్ని కూడా ఆకాశ స్థాయికి ఎదగడం చూస్తాయనడంలో సందేహం లేదు. 2014 ప్రపంచ కప్ నిర్వహిస్తున్న బ్రెజిల్ 1100 కోట్ల డాలర్ల ఆదాయాన్ని గడిస్తుందని అంచనా.
1966 నుండి ప్రతి ఫీఫా ప్రపంచ కప్ కీ తమ తమ ముద్ర గానీ or చిహ్నం గానీ ఉండటం ఆనవాయితీగా వస్తోంది.
హాజరయిన ప్రజల సంఖ్య[మార్చు]
ఆతిథ్యదేశం & యేడాది | మొత్తం హాజరు | ఆటల సంఖ్య | సగటు హాజరు, ఆటకి. |
---|---|---|---|
ఉరుగ్వే 1930 | 590,549 | 18 | 32,808 |
ఇటలీ 1934 | 363,000 | 17 | 21,353 |
ఫ్రాన్స్ 1938 | 375,700 | 18 | 20,872 |
బ్రెజిల్ 1950 | 1,045,246 | 22 | 47,511 |
స్విట్జర్లాండ్ 1954 | 768,607 | 26 | 29,562 |
స్వీడన్ 1958 | 819,810 | 35 | 23,423 |
చిలీ 1962 | 893,172 | 32 | 27,912 |
ఇంగ్లాండ్ 1966 | 1,563,135 | 32 | 48,848 |
మెక్సికో 1970 | 1,603,975 | 32 | 50,124 |
జర్మనీ 1974 | 1,865,753 | 38 | 49,099 |
అర్జెంటీనా 1978 | 1,545,791 | 38 | 40,679 |
స్పెయిన్ 1982 | 2,109,723 | 52 | 40,572 |
మెక్సికో 1986 | 2,394,031 | 52 | 46,039 |
ఇటలీ 1990 | 2,516,215 | 52 | 48,389 |
అమెరికా 1994 | 3,587,538 | 52 | 68,991 |
ఫ్రాన్స్ 1998 | 2,785,100 | 64 | 43,517 |
మూస:Country data దక్షిణ కొరియా![]() |
2,705,197 | 64 | 42,269 |
![]() |
3,359,439 | 64 | 52,491 |
మూస:Country data దక్షిణాఫ్రికా 2010 | 3,178,856 | 64 | 49,670 |
- Source:[10]
ఫలితాలు[మార్చు]
ప్రపంచ కప్ లో వివిధ దేశాల స్థానం[మార్చు]
దేశం | విజేత | మలివిజేత | మూడవ స్థానం | నాల్గవ స్థానం |
---|---|---|---|---|
![]() |
5 (1958, 1962, 1970, 1994, 2002) | 2 (1950*, 1998) | 2 (1938, 1978) | 2 (1974, 2014) |
![]() |
4 (1954, 1974, 1990, 2014) | 4 (1966, 1982, 1986, 2002) | 4 (1934, 1970, 2006,2010) | 1 (1958) |
![]() |
4 (1934, 1938, 1982, 2006) | 2 (1970, 1994) | 1 (1990) | 1 (1978) |
![]() |
2 (1978, 1986) | 3 (1930, 1990, 2014) | .. | .. |
మూస:Country data URUఉరుగ్వే | 2 (1930, 1950) | .. | .. | 3 (1954, 1970,2010) |
![]() |
1 (1998,2018) | 1 (2006) | 2 (1958, 1986) | 1 (1952) |
![]() |
1 (1966) | .. | .. | 1 (1990) |
![]() |
1 (2010) | .. | .. | 1 (1950) |
![]() |
.. | 3 (1974, 1978,2010) | 1 (2014) | 1 (1998) |
మూస:Country data TCHచెకోస్లోవేకియా | .. | 2 (1934, 1962) | .. | .. |
![]() |
.. | 2 (1938, 1954) | .. | .. |
![]() |
.. | 1 (1958*) | 2 (1950, 1984) | 1 (1938) |
![]() |
.. | .. | 2 (1974, 1982) | .. |
![]() |
.. | .. | 1 (1954) | 1 (1934) |
![]() |
.. | .. | 1 (1966) | 1 (2006) |
మూస:Country data YUGయుగోస్లావియా | .. | .. | 1 (1930) | 1 (1962) |
![]() |
.. | .. | 1 (1930) | .. |
![]() |
.. | .. | 1 (1962) | .. |
![]() |
.. | .. | 1 (1998) | .. |
![]() |
.. | .. | 1 (2002) | .. |
మూస:Country data URSసోవియట్ యూనియన్ లేదా ![]() |
.. | .. | .. | 1 (1966) |
![]() |
.. | .. | .. | 1 (1986) |
![]() |
.. | .. | .. | 1 (1994) |
![]() |
.. | .. | .. | 1 (2002*) |
బిరుదులు[మార్చు]
ప్రతి విడత ప్రపంచ కప్ పోటీల అనంతరం, జట్లకీ, ఆటగాళ్ళకీ కొన్ని బిరుదులు ప్రదానం చేస్తారు. ప్రస్తుతం ఇలాటి 6 బిరుదులు ఉన్నాయి:[11]
- బంగారు బంతి ప్రసార మాధ్యమాల ప్రతినిధులు ఎన్నుకున్న అత్యుత్తమ ఆటగానికి (1982 నుండి); వెండి బంతి, కంచు బంతి రెండవ, మూడవ స్థానాలలో నిలిచిన అటగాళ్ళకు;[12]
- బంగారు పాదరక్ష అత్యధిక లక్ష్యాలు (గోల్స్) సాధించిన ఆటగానికి ; అలాగే రజత పాదరక్ష, కాంశ్య పాదరక్ష రెండు, మూడు స్థానాలలో నిలిచిన లక్ష్య సాధకులకి;[13]
- బంగారు చేయి అత్యుత్తమ లక్ష్య రక్షకుడికి (గోల్ కీపర్), ఫీఫా సాంకేతిక అధ్యయనా మండలి నిర్ణయం మేఱకు (1994 నుండి ప్రారంభం);[14]
- ఉత్తమ పిన్నవయస్కుడైన ఆటగాడు 21 యేళ్ళకు పై బడని ఆటగానికి (ఫీఫా సాంకేతిక అధ్యయనా మండలి నిర్ణయం మేఱకు) (2006 లో మొదలయినది).[15]
- ఫీఫా నైతిక స్పూర్తి (ఫెయిర్ ప్లే) బిరుదు క్రీడా నైతిక స్ఫూర్తిని ప్రదర్శించిన అత్యుత్తమ జట్టుకు (1978 నుండి);[15]
- వినోదదాయక జట్టు బిరుదు, జనబాహుళ్యం ఎన్నుకున్న- జనాన్ని వినోదపఱచిన అత్యుత్తమ జట్టుకు (1994 నుండి);[15]
సర్వ శ్రేయ జట్టు పాల్గొన్న అందరు ఆటగాళ్ళలోనూ ఎన్నుకునే అత్యుత్తమ ఊహాజనిత జట్టుకు (1998 నుండి).
రికార్డులు, నమోదులు[మార్చు]
మెక్సికోకు చెందిన ఆంటోనియో కార్బజోల్ (1950–1966) మఱియు జర్మనీ ఆటగాడు లోథార్ మథేయస్ (1982–1998) ఇద్దరూ ఐదేసి ప్రపంచ కప్ క్రీడా స్పర్థల్లో పాల్గొని, అత్యధిక సార్లు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్ళుగా నమోదయ్యారు.[16] 25 ప్రపంచ కప్ ఆటలో ఆడిన మథేయస్ ఆటల సంఖ్యలో అత్యధికుడిగా నమోదయ్యాడు..[17] పశ్చిమ జర్మనీకి చెందిన ఫ్రాంక్ బెకెన్ బాయర్ (1966–1974) మూడు అంతిమ పోటీలలో ఆడిన ఏకైక ఆటగాడు.
(1998–2006) మధ్య 15 ప్రపంచ కప్ ఆటల గోల్స్ ఛేదించిన ఆటగాడు బ్రెజిల్ కి చెందిన రోనాల్డో మొత్తం మీద అత్యధిక లక్ష్యాలు. జర్మనీకి చెందిన మిరోస్లావ్ క్లోస్ (2002–2010), పశ్చిమ జర్మనీకి ఆడినగెర్డ్ మ్యూలర్ (1970–1974) 15 గోల్స్ తో రెండవస్థానంలో ఉన్నారు.[18] నాలుగవ స్థానంలో తన ఏకైక 1958 ప్రపంచ కప్ లో 13 గోల్స్ సాధించిన ఘనత వహించిన ఆటగాడు ఫ్రాన్స్ దేశస్థుడైన జస్ట్ ఫోన్టైన్.[19]
ఆటగాని గానే కాక, అటు పిమ్మటి విడతల్లో శిక్షకుని పాత్రలో కూడా ప్రపంచ కప్ సంపాదించిన గౌరవం బ్రెజిల్ కు చెందిన మారియో చగల్లో, పశ్చిమ జర్మనీకి చెందిన ఫ్రాంక్ బెకెన్ బాయర్ లకు మాత్రమే దక్కింది.
జాతీయ జట్లలో అత్యధిక ప్రపంచ కప్ కాల్బంతి ఆటలు 99 ఆడినది జర్మనీ దేశమే..[20] 210 అత్యధిక లక్ష్యాలను ఛేదించినది మాత్రం బ్రెజిల్.[21] ఈ రెండు దేశాలూ కేవలం2002 చివరి పోటీ లో ఒకే ఒకసారి ముఖాముఖి తలపడడం నిజంగా ఆశ్చర్యమే.
ఉటంకింపులు[మార్చు]
- ↑ "FIFA World Cup Origin" (PDF). FIFA.com. Fédération Internationale de Football Association. Retrieved 19 November 2007.
- ↑ "204 దేశాలు పాల్గొంటున్న ప్రపంచ కప్". FIFA.com. Fédération Internationale de Football Association. 30 March 2007. Archived from the original on 1 ఫిబ్రవరి 2014. Retrieved 19 November 2007. Check date values in:
|archive-date=
(help) - ↑ "Jules Rimet Trophy". FIFA.com. Fédération Internationale de Football Association. Archived from the original on 18 మార్చి 2013. Retrieved 19 November 2007. Check date values in:
|archive-date=
(help) - ↑ "FIFA Assets – Trophy". FIFA.com. Fédération Internationale de Football Association. Archived from the original on 4 నవంబర్ 2007. Retrieved 19 November 2007. Check date values in:
|archivedate=
(help) - ↑ "History of the FIFA World Cup Preliminary Competition (by year)" (PDF). FIFA.com. Fédération Internationale de Football Association.
- ↑ "Formats of the FIFA World Cup final competitions 1930–2010" (PDF). FIFA.com. Fédération Internationale de Football Association. Retrieved 1 January 2008.
- ↑ "Regulations of the 2010 FIFA World Cup" (PDF). FIFA.com. Fédération Internationale de Football Association. p. 41. Retrieved 21 June 2010.
- ↑ "Asia takes World Cup center stage". CNN. 3 June 2002. Retrieved 1 January 2008.
- ↑ ఉదహరింపు పొరపాటు: సరైన
<ref>
కాదు;2006coverage
అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "ఫీఫా ప్రపంచ కప్ పోటీ రికార్డులు" (PDF). FIFA.com. Fédération Internationale de Football Association. p. 2. Retrieved 30 January 2013.
- ↑ "FIFA World Cup awards" (PDF). FIFA.com. Fédération Internationale de Football Association. Retrieved 5 March 2009.
- ↑ "Golden Ball for Zinedine Zidane". Soccerway. 10 July 2006. Retrieved 31 December 2007.
- ↑ "adidas Golden Shoe – FIFA World Cup Final". FIFA.com. Fédération Internationale de Football Association. Archived from the original on 2 ఫిబ్రవరి 2009. Retrieved 4 March 2009. Check date values in:
|archive-date=
(help) - ↑ "Kahn named top keeper". BBC Sport. 30 June 2002. Retrieved 31 December 2007.
- ↑ 15.0 15.1 15.2 Pierrend, José Luis (18 May 2007). "FIFA Awards". rec.sport.soccer Statistics Foundation. Retrieved 8 January 2008.
- ↑ Yannis, Alex (10 November 1999). "Matthaus Is the Latest MetroStars Savior". New York Times. Retrieved 23 December 2007.
- ↑ "World Cup Hall of Fame: Lothar Matthaeus". CNN. Retrieved 23 December 2007.
- ↑ Chowdhury, Saj (27 June 2006). "Ronaldo's riposte". BBC Sport. Retrieved 23 December 2007.
- ↑ "Goal machine was Just superb". BBC Sport. 4 April 2002. Retrieved 23 December 2007.
- ↑ "Germany move ahead of Brazil". FIFA.com. Fédération Internationale de Football Association. 6 July 2010. Archived from the original on 30 డిసెంబర్ 2010. Retrieved 6 July 2010. Check date values in:
|archive-date=
(help) - ↑ "Planet World Cup – All time table". Planet World Cup. Retrieved 26 January 2008.
మూలముల పట్టీ=[మార్చు]
Glanville, Brian (2005). The Story of the World Cup. Faber. p. 44. ISBN 0-571-22944-1.
బయటి లింకులు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to FIFA World Cup. |
మూస:FIFA World Cup మూస:FIFA World Cup winners మూస:FIFA మూస:Worldfootball మూస:International Football మూస:National football teams మూస:Main world cups