Jump to content

2026 ఫిఫా ప్రపంచ కప్

వికీపీడియా నుండి
2026 ఫిఫా ప్రపంచ కప్
కెనడా/మెక్సికో/అమెరికా 2026
టోర్నమెంటు వివరాలు
ఆతిథ్య దేశాలుకెనడా
మెక్సికో
అమెరికా
తేదీలు2026 జూన్–జూలై
జట్లు48 (6 కాన్ఫెడరేషన్ల నుండి)
వేదిక(లు)16 (16 ఆతిథ్య నగరాల్లో)
2022
2030

2026 లో జరిగే ఫిఫా ప్రపంచ కప్, ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచ కప్ పోటీల్లో 23 వది. ఇది ఫిఫా సభ్య దేశాల జాతీయ జట్లు పోటీ చేసే చతుర్వార్షిక అంతర్జాతీయ పురుషుల ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్. ఈ టోర్నమెంటును ఉత్తర అమెరికా ఖండం లోని మూడు దేశాలు - కెనడా, మెక్సికో, అమెరికా - లోని 16 నగరాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. క్వార్టర్ ఫైనల్స్ నుండి జరిగే మ్యాచ్‌ లన్నీ అమెరికా లోనే జరుగుతాయి. అమెరికా మొత్తం అరవై మ్యాచ్‌లను నిర్వహిస్తుంది. కెనడా, మెక్సికోలు చెరొక 10 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తాయి. మూడు దేశాలు కలిసి ఆతిథ్యం ఇచ్చే తొట్టతొలి ఫుట్‌బాల్ ప్రపంచ కప్పు ఇది. [1] [2] ఈ టోర్నమెంటులో మొత్తం 48 జట్లు పాల్గొంటాయి. 48 జట్లు ఆడే ఫుట్‌బాల్ ప్రపంచ కప్పు పోటీలు కూడా ఇవే. [3] మాస్కోలో జరిగిన 68వ FIFA కాంగ్రెస్‌లో ఈ మూడు దేశాలు మొరాకో ను ఓడించి ఆతిథ్య హక్కును గెలుచుకున్నాయి. 2002 తర్వాత ఒకటి కంటే ఎక్కువ దేశాలు ఆతిథ్యమిస్తున్న తొలి ప్రపంచ కప్పు గాను, రెండు కంటే ఎక్కువ దేశాలు నిర్వహించే తొలి ప్రపంచ కప్పు గానూ ఇది నిలిచింది. 1970, 1986 లలో జరిగిన టోర్నమెంటులకు ఆతిథ్యమివ్వడంతో, మెక్సికో మూడుసార్లు పురుషుల ప్రపంచ కప్‌కు ఆతిథ్యమిచ్చిన లేదా సహ-ఆతిథ్యం ఇచ్చిన మొదటి దేశంగా అవతరించింది. అమెరికా ఆతిథ్యమిచ్చిన చివరి ప్రపంచ కప్‌ 1994 లో జరిగింది. కెనడా, పురుషుల టోర్నమెంటుకు ఆతిథ్యమివ్వడం ఇదే మొదటిసారి.

టోర్నమెంటు తీరు

[మార్చు]

2013 అక్టోబరులో అప్పటి UEFA అధ్యక్షుడిగా ఉన్న మిచెల్ ప్లాటిని, టోర్నమెంటును 40 జట్లకు విస్తరించాలని సూచించాడు. [4] [5] [6] ఇదే అభిప్రాయాన్ని 2016 మార్చిలో నాటి FIFA అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో కూడా చెప్పాడు. మునుపటి 32 టీమ్ ఫార్మాట్ నుండి టోర్నమెంటులో పాల్గొనేవారి సంఖ్యను పెంచుతున్నామని 2016 అక్టోబరు 4 న ప్రకటించారు. విస్తరణ ఎలా జరపాలనే దానికి నాలుగు పద్ధతులను పరిగణించారు: [7] [8] [9] [10]

  • 40 జట్లకు విస్తరించడం (5 జట్ల 8 గ్రూపులు)—88 మ్యాచ్‌లు
  • 40 జట్లకు విస్తరించడం (4 జట్ల 10 గ్రూపులు)—76 మ్యాచ్‌లు
  • 48 జట్లకు విస్తరించడం (32-జట్టు ప్లేఆఫ్ రౌండ్ ప్రారంభం)—80 మ్యాచ్‌లు
  • 48 జట్లకు విస్తరించడం (3 జట్ల 16 గ్రూపులు)—80 మ్యాచ్‌లు

2017 జనవరి 10 న, FIFA కౌన్సిల్, నాల్గవ పద్ధతిని ఎంచుకుంది. 48-జట్ల టోర్నమెంటుగా విస్తరించడానికి ఏకగ్రీవంగా ఓటు వేసింది. [3] టోర్నమెంటు గ్రూపు దశ మూడు జట్లతో కూడిన 16 గ్రూపులతో ప్రారంభమవుతుంది. ప్రతి గ్రూపు లోని మొదటి రెండు జట్లు, 32 జట్లతో ప్రారంభమయ్యే నాకౌట్ దశకు వెళ్తాయి. [11] గతంలో కంటే ఈ నాకౌట్ దశ అదనం. మొత్తంగా ఆడే గేమ్‌ల సంఖ్య 64 నుండి 80కి పెరుగుతుంది. అయితే ఫైనలుకు చేరే జట్లు ఆడే మొత్తం గేముల సంఖ్య మాత్రం మారదు - ఏడు గానే ఉంటుంది. గ్రూపు దశలో మాత్రం ప్రతి జట్టు, గతంలో కంటే ఒక మ్యాచ్ తక్కువ ఆడుతుంది. మునుపటి 32 జట్ల టోర్నమెంటుల మాదిరిగానే ఈ టోర్నమెంటు కూడా 32 రోజుల్లో పూర్తవుతుంది. [12]

విమర్శ

[మార్చు]

గ్రూపు దశలో ప్రతి గ్రూపు లోను ఉండే మూడు జట్లలోంచి రెండు జట్లు నాకౌట్‌ దశకు వెళ్ళే పద్ధతి వలన జట్లు కుమ్మక్కు అయ్యే ప్రమాదం ఉందని విమర్శ వచ్చింది. 1982 ప్రపంచ కప్ పోటీల్లో ఇలాంటిదే జరిగింది. దాన్ని "గిజోన్ తలవంపులు" [నోట్స్ 1]</nowiki> రెండు జట్లూ ఫలితాన్ని ఫిక్సింగ్ చేసుకున్నాయని ప్రేక్షకులు ఆరోపించారు. అయితే ఆ జట్లు, ఆట నిబంధనలను మీరలేదని ఫిఫా చెప్పింది. వారు గుర్తు చేసారు.</ref> అని అంటారు. ఫిఫా చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ మార్కో వాన్ బాస్టెన్, పెనాల్టీ షూటౌట్‌లను ఉపయోగించడం ద్వారా గ్రూప్ దశలో డ్రాలను నిరోధించవచ్చని సూచించాడు. [13] ఇది కుమ్మక్కయ్యే ప్రమాదాన్ని కొంత మేరకే తగ్గిస్తుంది. పెనాల్టీ షూటౌట్‌లో కూడా ఉద్దేశపూర్వకంగా తప్పు చేసి, తద్వారా ప్రత్యర్థిని తొలగించుకునే అవకాశం ఉంది. [14] 2022 ఏప్రిల్ లో ఈ విషయంపై స్పందిస్తూ CONCACAF ప్రెసిడెంట్ విక్టర్ మోంటాగ్లియాని, "ఫిఫా ఒక్కో గ్రూపులో నాలుగేసి జట్లుండే 12 గ్రూపులను [15] పద్ధతిని కూడా పరిశీలిస్తోంద"ని చెప్పాడు.

అతిథి ఎంపిక

[మార్చు]
ఆరు సమాఖ్యలతో ప్రపంచ పటం

ఫిఫా కౌన్సిల్ వివిధ ఖండాంతర సమాఖ్యల మధ్య ఆతిథ్య దేశాన్ని ఎంపిక చెయ్యడంలో రొటేషన్‌ విధానంపై 2013 - 2017 ల మధ్య ఊగిసలాడింది. మునుపటి రెండు టోర్నమెంటులకు ఆతిథ్యమిచ్చిన సమాఖ్యలకు చెందిన దేశాల నుండి ప్రతిపాదనలను తీసుకోమని మొదట్లో నిర్ణయించింది. ఆ తరువాత, మునుపటి టోర్నమెంటుకు ఆతిథ్యమిచ్చిన సమాఖ్యకు చెందిన దేశాలను మాత్రమే తరువాతి టోర్నమెంటుకు ఆతిథ్య మివ్వడానికి వీలు లేకుండా మార్చింది. [16] మళ్ళీ వెంటనే దాన్ని మునుపటి రెండు ప్రపంచ కప్‌లకూ అని మార్చింది. అయితే, ఒకవేళ వచ్చిన ప్రతిపాదనల్లో ఏదీ కూడా కఠినమైన సాంకేతిక, ఆర్థిక నిబంధనలకు అనుగుణంగా లేనట్లైతే, అంతకు ముందరి రెండవ ప్రపంచ కప్పుకు ఆతిథ్యమిచ్చిన సమాఖ్య లోని సభ్య దేశాలు కూడా పోటీ పడవచ్చని ఒక మినహాయింపును ఫిఫా కౌన్సిల్ చేర్చింది. [17] [18] 2017 మార్చిలో, ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో "2018, 2022 లలో వరుసగా రష్యా, ఖతార్‌లు ఆతిథ్యమిచ్చాయి కాబట్టి, యూరోప్ (UEFA), ఆసియా (AFC) లకు పోటీలో పాల్గొనే అర్హత లేదని ధృవీకరించాడు." [19] అందువల్ల, 2026 ప్రపంచ కప్‌ను మిగిలిన నాలుగు సమాఖ్యలలో ఎవరైనా నిర్వహించవచ్చు: CONCACAF (ఉత్తర అమెరికా; చివరిగా 1994 లో ఆతిథ్య మిచ్చింది), CAF (ఆఫ్రికా; చివరిగా 2010 లో ఆతిథ్య మిచ్చింది), CONMEBOL (దక్షిణ అమెరికా; చివరిగా 2014 లో ఆతిథ్య మిచ్చింది) లేదా OFC (ఓషియానియా, ఇంతకు ముందెన్నడూ ఆతిథ్య మివ్వలేదు). ఆ నలుగురి ప్రతిపాదనల్లో నిబంధనలకు అనుగుణంగా ఉన్నవి ఏవీ లేనట్లైతే, ఐరోపా సమాఖ్యకు అర్హత లభిస్తుంది.

2026 నాటి హోస్ట్‌ల ప్రకటన తర్వాత, ప్రపంచ కప్ ఆతిథ్య దేశాల మ్యాప్

2002 టోర్నమెంటు తర్వాత, FIFA ప్రపంచ కప్‌ను ఒకరి కంటే ఎక్కువ దేశాలు కలిసి ఆతిథ్యమివ్వడాన్ని ఫిఫా నిషేధించింది. మళ్ళీ దాన్ని 2026 ప్రపంచ కప్ కోసం సడలించింది. అయితే సహ అతిథులను నిర్దిష్ట సంఖ్యకు మాత్రమే పరిమితం కాకుండా ఒక్కో కేసును బట్టి మూల్యాంకనం చేసింది. అలాగే 2026కి, పోటీని నిర్వహించడానికి కనీస సాంకేతిక అవసరాలు లేని పోటీదార్లను మినహాయించే అధికారాన్ని, పోటీల కమిటీతో సంప్రదింపులు చేసి నిర్ణయించేలా, ఫిఫా ప్రధాన సెక్రటేరియట్‌కు కట్టబెట్టారు. [17]

కెనడా, మెక్సికో, యునైటెడ్ స్టేట్స్ మూడూ టోర్నమెంటు కోసం విడివిడిగా పోటీ పడాళని భావించాయి. అయితే, 2017 ఏప్రిల్ 10 న సంయుక్తంగా పోటీ పడుతున్నట్టు ప్రకటించాయి.

ఓటింగ్

[మార్చు]

మాస్కోలో జరిగిన 68వ FIFA కాంగ్రెస్ సందర్భంగా 2018 జూన్ 13 న ఓటింగ్ జరిగింది. అర్హులైన సభ్యులందరూ వోటింగులో పాల్గొనేలా నిర్వహించారు. [20] సంయుక్త పోటీదారుకు 134 చెల్లుబాటు అయ్యే వోట్లు రాగా, మొరాకోకు 65 చెల్లుబాటు అయ్యే వోట్లు వచ్చాయి. పురుషుల, మహిళల ప్రపంచ కప్‌లు రెండింటికీ ఆతిథ్యమిచ్చిన ఐదవ దేశంగా కెనడా నిలిచింది. మెక్సికో మూడు పురుషుల ప్రపంచ కప్‌లకు ఆతిథ్యమిచ్చిన మొదటి దేశంగా అవతరించింది. అమెరికా, పురుషుల మహిళల ప్రపంచ కప్‌లు రెండింటికీ చెరి రెండుసార్లు ఆతిథ్యం ఇచ్చిన తొలి దేశం అవుతుంది.

దేశం ఓటు
రౌండ్ 1
కెనడా, మెక్సికో, యునైటెడ్ స్టేట్స్ 134
మొరాకో 65
బిడ్‌లు ఏవీ లేవు 1
నిరాకరణలు 3
మొత్తం ఓట్లు 200

వేదికలు

[మార్చు]

బిడ్డింగ్ ప్రక్రియలో పూర్తిగా పనిచేసే దశలో ఉన్న 43 వేదికలు, 2 నిర్మాణంలో ఉన్న వేదికలతో, 41 నగరాలను బిడ్‌లో భాగంగా సమర్పించారు (మెక్సికోలోని మూడు నగరాల్లో మూడు వేదికలు, కెనడాలోని ఏడు నగరాల్లో తొమ్మిది వేదికలు, అమెరికాలో 34 నగరాల్లో 38 వేదికలు). టోర్నమెంటు జరిగే క్రమంలో, మొదటి రౌండు తరువాత తొమ్మిది వేదికలు, తొమ్మిది నగరాలు తగ్గి పోతాయి. రెండవ-రౌండు తరువాత ఆరు నగరాల్లో, మరో తొమ్మిది వేదికలు తగ్గుతాయి. అయితే మూడు నగరాల్లో మూడు వేదికలు (చికాగో, మిన్నియాపాలిస్, వాంకోవర్) ఆర్థిక వివరాలను చర్చించడానికి సుముఖత చూపకపోవడంతో నిష్క్రమించాయి. [21] 2021 జూలైలో మాంట్రియల్ నిష్క్రమించిన తర్వాత, [22] వాంకోవర్ తిరిగి పాల్గొనాలని నిర్ణయం తీసుకుంది. 2022 ఏప్రిల్ లో అభ్యర్థి నగరంగా తిరిగి చేరింది. [23] మొత్తం వేదికల సంఖ్య 24 కు చేరింది.

2022 జూన్ 16 న ఫిఫా, పదహారు అతిధేయ నగరాలను మూడు భౌగోళిక విభాగాలుగా విభజిస్తూ ప్రకటించింది. వాంకోవర్, సియాటెల్, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్, గ్వాడలజారా లు పశ్చిమ విభాగం లోను, కాన్సాస్ సిటీ, డల్లాస్, హ్యూస్టన్, అట్లాంటా, మోంటెర్రే, మెక్సికో సిటీలు మధ్య విభాగం లోను, టొరంటో, బోస్టన్, న్యూయార్క్ నగరం, ఫిలడెల్ఫియా, మయామి లు తూర్పు విభాగం లోనూ (కెనడాలో 2, మెక్సికోలో 3, అమెరికాలో 11) ఉన్నాయి. [24] ఎంచుకున్న పదహారు స్టేడియంలలో ఎనిమిదింటికి శాశ్వత కృత్రిమ టర్ఫ్‌లు ఉన్నాయి,. ఫిఫా, యూనివర్శిటీ ఆఫ్ టేనస్సీ - మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ పరిశోధన బృందాల ఆధ్వర్యంలో వీటిని తీసివేసి, ఆ స్థానంలో గడ్డి పెంచాలని ప్రణాళిక చేసారు. ఐదు వేదికలు ముడుచుకునే పైకప్పు వ్యవస్థలను ఉపయోగిస్తాయి. [25]

కెనడా, అమెరికాల్లో సాకర్-కోసమే నిర్మించిన స్టేడియంలు ఉన్నప్పటికీ, 30,000 సీట్ల సామర్థ్యమున్న నాష్‌విల్లేలోని జియోడిస్ పార్క్ అమెరికా లోని అతిపెద్ద సాకర్ స్టేడియం. ఫిఫా నిర్దేశించే కనిష్ట సామర్థ్యం (40,000) కంటే ఇది తక్కువగా ఉంది. కెనడా, టోరంటో లోని MLS స్టేడియం సామర్థ్యాన్ని ఈ టోర్నమెంటు కోసం 30,000 నుండి 45,500 వరకు విస్తరిస్తారు. [26] అయితే, అట్లాంటాలోని మెర్సిడెస్-బెంజ్ స్టేడియం, ఫాక్స్‌బరోలోని జిల్లెట్ స్టేడియం, సియాటెల్‌లోని లుమెన్ ఫీల్డ్ వంటి కొన్ని స్టేడియంలు ఉన్నాయి, వీటిని NFL, MLS జట్లు ఉపయోగించుకుంటాయి. [27] ప్రధానంగా గ్రిడిరాన్ ఫుట్‌బాల్ కోసం ఉపయోగించినప్పటికీ, అమెరికన్ స్టేడియంలు నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ జట్లకు, కెనడా స్టేడియాలు కెనడియన్ ఫుట్‌బాల్ లీగ్ (CFL)కి ఆతిథ్యమివ్వడంతో, కెనడా, అమెరికా స్టేడియంలన్నిటినీ సాకర్ కోసం అనేక సందర్భాలలో ఉపయోగించారు. [28]

మెక్సికో మెక్సికో నగరం[29] యు.ఎస్.ఏ న్యూ యార్క్/న్యూ జెర్సీ[29] యు.ఎస్.ఏ డల్లాస్[29] యు.ఎస్.ఏ కాన్సాస్ నగరం[29] యు.ఎస్.ఏ హ్యూస్టన్[29]
ఎస్టాడియో అజ్టెకా మెట్‌లైఫ్ స్టేడియం
(న్యూజెర్సీ)
AT&amp;T స్టేడియం‡
(ఆర్లింగ్‌టన్, టెక్సాస్)
యారోహెడ్ స్టేడియం NRG స్టేడియం‡
సామర్థ్యం: 87,523 సామర్థ్యం: 82,500 సామర్థ్యం: 80,000
(105,000 కు పెంచే వీలు)
సామర్థ్యం: 76,416 సామర్థ్యం: 72,220
యు.ఎస్.ఏ అట్లాంటా[29] యు.ఎస్.ఏ లాస్ ఏంజెలిస్[29][30]
మెర్సిడెస్ బెంజ్ స్టేడియం‡ సోఫీ స్టేడియం
(ఇంగిల్‌వుడ్, కాలిఫోర్నియా)
సామర్థ్యం: 71,000
(83,000 కు పెంచే వీలు)
సామర్థ్యం: 70,240
(1,00,240 కు పెంచే వీలు)
యు.ఎస్.ఏ Philadelphia[29] యు.ఎస్.ఏ సియాటిల్[29]
లింకన్ ఫైనాన్షియల్ ఫీల్డ్ లూమెన్ ఫీల్డ్
సామర్థ్యం: 69,796 సామర్థ్యం: 69,000
(72,000 కు పెంచే వీలు)
యు.ఎస్.ఏ శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా[29] యు.ఎస్.ఏ బోస్టమ్[29]
లీవైస్ స్టేడియం
(శాంటా క్లారా, కాలిఫోర్నియా)
జిలెట్ స్టేడియం
(ఫాక్స్‌బరో, మసాచుసెట్స్)
సామర్థ్యం: 68,500
(75,000 కు పెంచే వీలు)
సామర్థ్యం: 65,878
యు.ఎస్.ఏ మియామీ[29] కెనడా వాంకూవర్[23] మెక్సికో మాంటెరే[29] మెక్సికో గ్వాడలజారా[29] కెనడా టోరంటో[29]
హార్డ్ రాక్ స్టేడియం
(మియామీ గార్దెన్స్, ఫ్లారిడా)
BC ప్లేస్‡ ఎస్టాడియో BBVA
(గ్వాడలూప్, న్యూవో లియోన్)
ఎస్టాడియో ఎక్రాన్
(జపోపన్, జాలిస్కో)
BMO ఫీల్డ్
సామర్థ్యం: 64,767 సామర్థ్యం: 54,500 సామర్థ్యం: 53,500 సామర్థ్యం: 49,850 సామర్థ్యం: 30,000
(45,500 కు పెంచుతారు)

ప్రసార హక్కులు

[మార్చు]
  • బ్రెజిల్ – TV Globo, SportTV [31]
  • బల్గేరియా - నోవా [32]
  • బోస్నియా, హెర్జెగోవినా – BHRT, మోజా TV [33]
  • కెనడా – CTV, TSN, RDS [34]
  • డెన్మార్క్ – DR, TV2 [35]
  • ఫిన్లాండ్ – YLE, MTV [36]
  • నార్వే – NRK, TV2 [37]
  • స్వీడన్ – SVT, TV4 [36]
  • యునైటెడ్ స్టేట్స్ – ఫాక్స్, టెలిముండో [38]

2015 ఫిబ్రవరి 12 న ఫాక్స్, టెలిముండో, బెల్ మీడియాలు 2026 పోటీలను కవర్ చేసేలా, వాటి ప్రసార హక్కుల ఒప్పందాన్ని ఇతర బిడ్‌లను అంగీకరించకుండానే పునరుద్ధరించింది. 2022 ప్రపంచ కప్‌ షెడ్యూలును సాంప్రదాయికంగా జరిగే జూన్-జూలై లకు బదులుగా నవంబరు-డిసెంబరులో జరిపేలా రీషెడ్యూలు చేసినందుకు పరిహారంగా ఈ పొడిగింపు మంజూరు చేసారని న్యూయార్క్ టైమ్స్ అభిప్రాయపడింది. ఎందుకంటే, సాధారణంగా ప్రపంచ కప్పు జరిగే సమయం, ఇతర క్రీడా పోటీలేవి జరిగే సమయం కాదు కాబట్టి వాటికి అడ్డుపడదు. కానీ ఈ షెడ్యూలు మార్పు కారణంగా ప్రధాన ప్రొఫెషనల్ స్పోర్ట్స్ లీగ్‌లతో గణనీయమైన వైరుధ్యాలను సృష్టించింది. [39] [40] [41]

మూలాలు

[మార్చు]
  1. "World Cup 2026: Canada, US & Mexico joint bid wins right to host tournament". BBC Sport. June 13, 2018. Archived from the original on January 14, 2021. Retrieved June 13, 2018.
  2. Carlise, Jeff (April 10, 2017). "U.S., neighbors launch 2026 World Cup bid". ESPN. Archived from the original on April 11, 2017.
  3. 3.0 3.1 "Unanimous decision expands FIFA World Cup to 48 teams from 2026". FIFA. January 10, 2017. Archived from the original on January 10, 2017. Retrieved January 10, 2017.
  4. "Michel Platini calls for 40-team World Cup starting with Russia 2018". The Guardian. October 28, 2013. Retrieved January 24, 2015.
  5. "Infantino suggests 40-team World Cup finals". Independent Online. South Africa: IOL. Reuters. March 30, 2016. Archived from the original on December 30, 2016.
  6. "Michel Platini's World Cup expansion plan unlikely – Fifa". BBC Sport. October 29, 2013. Archived from the original on April 21, 2014. Retrieved January 24, 2015.
  7. "New Fifa chief backs 48-team World Cup". HeraldLIVE. October 7, 2016. Archived from the original on October 10, 2016. It's an idea, just as the World Cup with 40 teams is already on the table with groups of four or five teams.
  8. "Fifa's 5 options for a 2026 World Cup of 48, 40 or 32 teams". Yahoo! Sports. Associated Press. December 23, 2016. Archived from the original on January 10, 2017.
  9. "FIFA World Cup format proposals" (PDF). FIFA. December 19, 2016. Archived from the original (PDF) on September 15, 2018. Retrieved January 10, 2017.
  10. "Federations 'overwhelmingly in favour' of 48-team World Cup – Infantino". ESPN. December 28, 2016.
  11. "Fifa approves Infantino's plan to expand World Cup to 48 teams from 2026". The Guardian. January 10, 2017. Archived from the original on January 10, 2017. Retrieved January 10, 2017.
  12. "World Cup: Gianni Infantino defends tournament expansion to 48 teams". BBC Sport. January 10, 2017. Archived from the original on March 31, 2017.
  13. "Penalty shootouts may be used to settle drawn World Cup matches". World Soccer. January 18, 2017.
  14. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; guyon అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  15. Ziegler, Martyn (April 1, 2022). "Format for 2026 World Cup could be revamped amid 'collusion' fears, says Fifa vice-president". The Times. London. Retrieved November 5, 2022.
  16. "Current allocation of FIFA World Cup confederation slots maintained". FIFA. May 30, 2015. Archived from the original on May 30, 2015.
  17. 17.0 17.1 "FIFA Council discusses vision for the future of football". FIFA. October 14, 2016. Archived from the original on October 17, 2016.
  18. "FIFA blocks Europe from hosting 2026 World Cup, lifting Canada's chances". Canadian Broadcasting Corporation. Associated Press. October 14, 2016. Archived from the original on October 14, 2016.
  19. "Trump travel ban could prevent United States hosting World Cup". The Guardian. March 9, 2017.
  20. Graham, Bryan Armen (June 13, 2018). "North America to host 2026 World Cup after winning vote over Morocco – as it happened". The Guardian.
  21. Carlisle, Jeff (March 16, 2018). "United States-led World Cup bid cuts list of potential host cities to 23". ESPN. Retrieved November 25, 2021.
  22. "Montreal withdraws from host city selection process for 2026 World Cup". Sportsnet. July 6, 2021. Retrieved July 6, 2021.
  23. 23.0 23.1 "Update on FIFA World Cup 2026 candidate host city process". FIFA. April 14, 2022. Retrieved April 14, 2022.
  24. "FIFA unveils stellar line-up of FIFA World Cup 2026 Host Cities". FIFA. June 16, 2022. Retrieved June 16, 2022.
  25. Tannenwald, Jonathan (November 2, 2022). "FIFA goes to college to study how to grow grass indoors for the 2026 men's World Cup". The Philadelphia Inquirer. Retrieved November 6, 2022.
  26. Cattry, Pardeep (22 April 2021). "Toronto FC to expand BMO Field to host 2026 World Cup matches". Mlssocer.com. Major League Soccer. Retrieved 24 November 2022.
  27. "World Cup 2026 host cities confirmed: What you need to know about the 16 venues". ESPN. June 16, 2022. Retrieved November 6, 2022.
  28. Jones, J. Sam (June 16, 2022). "Your guide to 2026 World Cup stadiums and locations in the US, Mexico and Canada". MLSsoccer.com. Retrieved November 6, 2022.
  29. 29.00 29.01 29.02 29.03 29.04 29.05 29.06 29.07 29.08 29.09 29.10 29.11 29.12 29.13 29.14 "United 2026 bid book" (PDF). united2026.com. Retrieved April 30, 2018.
  30. "Los Angeles 2026". Archived from the original on 2021-06-29. Retrieved 2022-11-25.
  31. Karter, Jonathan (2022-11-19). "Globo renova contrato com a Fifa até 2026, mas sem exclusividade". Poder360 (in బ్రెజీలియన్ పోర్చుగీస్). Retrieved 2022-11-19.
  32. "Nova Broadcasting Group secures broadcasting rights to UEFA EURO 2024 and UEFA EURO 2028". nova.bg (in bulgarian). Retrieved February 17, 2022.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  33. "BHRT i BH Telecom kupuju tv prava za prenose utakmica fudbalske reprezentacije BiH". sport1.oslobodjenje.ba. January 17, 2022. Retrieved January 17, 2022.
  34. Sandomir, Richard (February 12, 2015). "Fox and Telemundo to Show World Cup Through 2026 as FIFA Extends Contracts"". The New York Times.
  35. Ross, Martin (December 15, 2020). "TV2 and DR continue major event rights drive with 2026 World Cup deal". Sportbusiness. Retrieved December 15, 2020.
  36. 36.0 36.1 "TV4 to show FIFA World Cup 2026 men's contest with SVT in Sweden, with YLE in Finland". Telecompaper. Retrieved December 21, 2020.
  37. "TV2, NRK add to football rights pact with 2026 World Cup deal". SportBusiness. SportBusiness. Retrieved December 3, 2019.
  38. Parker, Ryan (February 13, 2015). "2026 World Cup TV rights awarded without bids; ESPN 'surprised'". Los Angeles Times. Archived from the original on March 3, 2015.
  39. "FIFA grants Fox, Telemundo U.S. TV rights for World Cup through 2026". Sports Illustrated. February 12, 2015.
  40. "Why FIFA Made Deal With Fox for 2026 Cup". The New York Times. February 26, 2015.
  41. "FIFA extending TV deals through 2026 World Cup with CTV, TSN and RDS". The Globe and Mail. February 12, 2015. Archived from the original on April 10, 2016.


ఉల్లేఖన లోపం: "నోట్స్" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="నోట్స్"/> ట్యాగు కనబడలేదు