Jump to content

డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్

వికీపీడియా నుండి
డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్
Intervention
పుర్రె ఎక్స్-రేలో చూపబడిన డిబిఎస్
MeSHD046690
MedlinePlus007453

డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (డిబిఎస్) అనేది ఒక శస్త్రచికిత్సా విధానం. దీనిలో న్యూరోస్టిమ్యులేటర్, ఎలక్ట్రోడ్లను అమర్చుతుంది, మెదడు కదలికల నియంత్రణకు సంబంధించి నిర్దిష్ట లక్ష్యాలకు (టార్గెట్స్) విద్యుత్ ప్రేరణలను పంపుతుంది.

వ్యాధుల చికిత్స

[మార్చు]

శరీరంలోని అసాధారణ కదలికలతో ఇబ్బందులు, నాడీమండల సమస్యలతో బాధ పడేవారికి డిబిఎస్ ప్రక్రియ వలన ఉపశమనం లభిస్తోంది . ఇది ఒక అధునాతన నాడీమండలం శస్త్ర చికిత్సా ప్రక్రియ. ఇందులో ఎలెక్ట్రోడ్స్ ఉన్న చిన్న పరికరాన్ని మెదడులో అమర్చుతారు. ఆ వైర్లు మెదడు బయట ఉన్న బ్యాటరీ ఇతర పరికరాలకు అనుసంధానమై ఉంటాయి. అయితే బ్యాటరీ, వైర్లు బయటకు కనపడకుండా చర్మం క్రింద ఉండేలా శస్త్ర చికిత్స సమయంలో ఏర్పాటు చేస్తారు. అధునాతన సాంకేతికతతో 15 సంవత్సరాలు పనిచేసే బ్యాటరీ పరికరాలు ఉపయోగిస్తున్నారు. బయట నుండి ప్రోగ్రామింగ్ ద్వారా మెదడులోని నిర్దుష్ట ప్రాంతాలకు విద్యుత్ ప్రేరణలు అందేలా చూస్తారు. ఈ విద్యుత్ ప్రేరణలు మెదడు అసాధారణ కార్యకలాపాలు నియంత్రించడంలో సహాయ పడుతాయి. ఫలితంగా రోగికి ఉపశమనం కలిగి రోజువారీ కార్యక్రమాలు చేసుకోగలుగుతారు. రోగి లక్షణాలు బట్టి ప్రేరణలు సర్దుబాటు చేస్తారు.[1]

పార్కిన్సన్స్ వ్యాధి, నాడీ ప్రకంపనలు (ట్రెమర్స్), డిస్టోనియా వంటి అనేక రకాల కదలికలకు సంబంధించిన రుగ్మతలకు, అలాగే అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్ (OCD), మూర్ఛ వంటి కొన్ని నాడీ మండల, మానసిక (న్యూరోసైకియాట్రిక్ ) అనారోగ్య పరిస్థితులకు ఈ ప్రక్రియతో చికిత్సచేస్తారు.[2] ఈ డిబిఎస్ (DBS) కు సంబంధించిన విధానాలు సంక్లిష్టమైనవి, అస్పష్టం, కానీ వీటిని మెదడు కార్యకలాపాలను నిర్మాణాత్మక మార్గంలో సవరించడానికి వినియోగిస్తారు.[3]

చికిత్స గుర్తింపు

[మార్చు]

ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యునైటెడ్ స్టేట్స్ లో హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ వారి విభాగం - FDA) అనే ఫెడరల్ ఏజెన్సీ డిబిఎస్ ను పార్కిన్సోనియన్ ప్రకంపనలకు అత్యవసర చికిత్సగా 1997 నుండి గుర్తించారు, పార్కిన్సన్స్ వ్యాధికి చికిత్సగా 2002 నుండి ఆమోదించారు.[4] 2003లో డిస్టోనియా చికిత్స కోసం పరికరాల మినహాయింపులుగా ఈ శస్త్ర ప్రక్రియ ఆమోదించబడింది, 2009లో అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్ (OCD)కు, 2018లో మూర్ఛ సమస్య విషయంలో ఆమోదించబడింది.[5][6][7] దీర్ఘకాలిక నొప్పి, ఇతర మెదడు రుగ్మతలతో పాటు మతిమరపు (అల్జీమర్స్) వ్యాధికి , మాదకద్రవ్య వ్యసనంలో, కుంగుబాటు వంటి వివిధ రుగ్మతలకు దీనిని చికిత్సగా పరిగణిస్తున్నారు. ఈ క్రింది పట్టిక లో FDA ఆమోదాలను పేర్కొనడం జరిగింది.

వ్యాధి ఆమోదం తేదీ వివరాలు డిబిఎస్

లక్ష్యం

సాక్ష్యం
అత్యవసర ప్రకంపనలు

(లేదా పార్కిన్సోనియన్ ప్రకంపనలు)

జూలై 31,1997 అత్యవసర ప్రకంపనలు ఉన్న

రోగులలో నియంత్రించడానికి

వెన్ట్రల్ ఇంటర్మీడియట్ న్యూక్లియస్

ఆఫ్ థాలమస్ (VIM)

థాలమిక్ డిబిఎస్ గణనీయమైన ప్రకంపన

తగ్గింపును చూపించే క్లినికల్ ట్రయల్స్

ఆధారంగా ఈ ఆమోదం ఉంది. [8]

పార్కిన్సన్స్ వ్యాధి జనవరి 14,2002 మందుల ద్వారా తగినంతగా

నియంత్రించబడని రోగులలో

ఈ చికిత్స ఆమోదించబడింది.

సబ్థాలమిక్ న్యూక్లియస్ (STN) లేదా

అంతర్గత గ్లోబస్ పాలిడస్ (GPI)

సబ్థాలమిక్ న్యూక్లియస్లో DBS ప్రభావం

కనపడింది. ఇది మోటార్ పనితీరు,

జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది.[9][10]

డిస్టోనియా ఏప్రిల్ 15,2003 7 సంవత్సరాలు పైగా వయస్సు

రోగులలోమానవతా పరికరం

మినహాయింపు (HDE) కింద

మంజూరు చేయబడింది.

అంతర్గత గ్లోబస్ పాలిడస్ (GPI) హ్యుమానిటేరియన్ డివైస్ ఎక్సెంప్షన్ కింద

చిన్న క్లినికల్ ట్రయల్స్ కీలక ఆధారం.

ప్రాధమిక డిస్టోనియా ఉన్న రోగులలో

మోటార్ పనితీరును గణనీయంగా

మెరుగుపరిచింది. [11][12]

అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్ ఫిబ్రవరి 19,2009 తీవ్రమైన, OCD అనుబంధ

చికిత్స కోసం

న్యూక్లియస్ అకుంబెన్స్ (ఎన్ఎసి) తీవ్రమైన OCD లక్షణాల తగ్గుదలను చూపించే

చిన్న, ఓపెన్-లేబుల్ ట్రయల్స్ ఆధారంగా

ఆమోదం వచ్చింది.[13]

మూర్ఛ వ్యాధి ఏప్రిల్ 27,2018 థాలమస్ పూర్వ కేంద్రకం ద్వైపాక్షిక

ఉద్దీపనకు ఆమోదించబడింది

థాలమస్ యొక్క పూర్వ కేంద్రకం (ANT) DBS ను స్వీకరించే రోగులలో మూర్ఛ

ఫ్రీక్వెన్సీలో గణనీయమైన తగ్గుదల కనపడింది [14]

డిబిఎస్ కోసం తయారీలో ఉన్న ఒక వ్యక్తి
శస్త్రచికిత్స సమయంలో స్టీరియోటాక్టిక్ ఫ్రేమ్ ఉపయోగించి ఎలక్ట్రోడ్ను చొప్పించడం

ప్రతికూల ప్రభావాలు

[మార్చు]
డిబిఎస్ ఇంప్లాంటేషన్ సమయంలో రక్తస్రావం చేయగల ధమనుల సరఫరాకు సంబంధించిన ఆర్టెరియోగ్రామ్

ఈ డీబీఎస్ కు ముఖ్యమైన పెద్ద శస్త్రచికిత్సలలో ఉన్న సంక్లిష్టత, ప్రమాదాలు ఉంటాయి. ప్రధాన సమస్యలలో రక్తస్రావం (హెమరేజ్ 1-2%), సంక్రమణ (3-5%) వంటివి ఉంటాయి.[15]

హైదరాబాద్ లోని నిమ్స్ (నిజాం వైద్య విజ్ఞాన సంస్థ ) ఈ అధునాతన డిబిఎస్ విధానం లో రోగులకు మెరుగయిన జీవితాన్ని అందిస్తున్నారు . ఈ ప్రకియ సురక్షితమైనదని వైద్యులు భావిస్తున్నారు . [1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 డా.యర్రమనేని, వంశీకృష్ణ (2024-10-28). "అసాధారణ రోగులకు డిబిఎస్ తో కొత్త జీవితం". ఈనాడు.
  2. (August 2007). "Translational principles of deep brain stimulation".
  3. (16 September 2013). "A slow axon antidromic blockade hypothesis for tremor reduction via deep brain stimulation".
  4. "FDA approves brain implant to help reduce Parkinson's disease and essential tremor symptoms". FDA. Retrieved May 23, 2016. The first device, Medtronic's Activa Deep Brain Stimulation Therapy System, was approved in 1997 for tremor associated with essential tremor and Parkinson's disease.
  5. "'Brain pacemaker' for a rare disorder". NBC News. 17 June 2007. Archived from the original on April 28, 2021.
  6. "Medtronic Receives FDA Approval for Deep Brain Stimulation Therapy for Medically Refractory Epilepsy" (Press release). Medtronic. 1 May 2018.
  7. "FDA Approves Humanitarian Device Exemption for Deep Brain Stimulator for Severe Obsessive-Compulsive Disorder". FDA.
  8. (February 1991). "Long-term suppression of tremor by chronic stimulation of the ventral intermediate thalamic nucleus".
  9. (2001-09-27). "Deep-Brain Stimulation of the Subthalamic Nucleus or the Pars Interna of the Globus Pallidus in Parkinson's Disease".
  10. (2006-08-31). "A Randomized Trial of Deep-Brain Stimulation for Parkinson's Disease".
  11. (2005-02-03). "Bilateral Deep-Brain Stimulation of the Globus Pallidus in Primary Generalized Dystonia".
  12. (2006-11-09). "Pallidal Deep-Brain Stimulation in Primary Generalized or Segmental Dystonia".
  13. (June 2003). "Long-term Electrical Capsular Stimulation in Patients with Obsessive-Compulsive Disorder".
  14. (May 2010). "Electrical stimulation of the anterior nucleus of thalamus for treatment of refractory epilepsy".
  15. (April 2011). "Long-term surgical and hardware-related complications of deep brain stimulation".
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

బాహ్య లింకులు

[మార్చు]