డూప్లే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జోసెఫ్ ఫాంకోయిస్ డూప్లే
Joseph François Dupleix
Governor-General of French India
In office
14 జనవరి 1742 – 15 అక్టోబరు 1754
చక్రవర్తిలూయీ XV
అంతకు ముందు వారుPierre Benoît Dumas
తరువాత వారుCharles Godeheu
As Acting Governor-General
వ్యక్తిగత వివరాలు
జననం1 జనవరి 1697
Landrecies, ఫ్రాన్స్
మరణం10 నవంబర్ 1763 (aged 66)
పారిస్, ఫ్రాన్స్

వ్యాపారంకోసం 17 వ శతాబ్దములో వచ్చిన ఫ్రెంచి వ్యాపార సంస్ధ కూడా అంతకు ముందుగానే వచ్చిన ఆంగ్లేయ, డచ్చి ఈస్టిండియా కంపెనీ లలాగనే ఫ్రెంచి ఈస్ట్ ఇండియా కంపెనీగా సా.శ. 1668 లో స్థాపింపబడింది. 18వ శతాబ్దమునాటి దేశ పరిస్థితులలో మొగల్ చక్రవర్తి సామ్రాజ్య పరిపాలన పట్టుసడలుతుండగా, వివిధ రాజ్యములలో అంతఃకలహములు, చక్రవర్తికి సుబేదారులైన నవాబులే కాక, అనేక ప్రాంతీయ సామంతరాజులక్రిందనున్న చిన్న చిన్న రాజులుకూడా స్వతంత్రులగుటకు ప్రయత్నించుట, వైషమ్యాలతో ఒకరిపైనొకరు యుధ్ధములకు దిగటం మొదలగు విఛ్ఛిన పరిస్థితులలో వ్యాపారంకన్నా ప్రాముఖ్యమైనది రాజ్య ఆక్రమణ, వలసరాజ్యస్థాపనే అని తలచి బ్రిటిష్ వారికన్నా ముందే ప్రయత్నించినది ఫ్రెంచి కంపెని అధిపతి, డూప్లే దొర ( పూర్తిపేరు జోసెఫ్ ఫాంకోయిస్ డూప్లే : Joseph Francois Dupleix). ఆ మార్గమునే అవలంబించిన బ్రిటిష్ వారు ప్రతిపక్షము వహించటంవల్ల వీరికీ ఫ్రెంచివారికీ వారి వారి పక్షముల తరఫుననే కాక ఆధిపత్యకాంక్షతో సరాసరి యుద్ధములు కూడా జరిగినవి. అయితే డూప్లే తలపెట్టిన రాజ్యాక్రమణ, వలసరాజ్యస్థాపన సైనికి బలపరాక్రమముల ప్రయేగముతోనూ అధిక ధనవ్యయముతో కూడి తత్కాలఫలితమిచ్చెదై యుండగా అదే లక్ష్యములు తలపోసిన బ్రిటిష్ వారి రాజతంత్రముల ప్రయోగం క్రమేణ ఫలితమిచ్చెడిదైనది. చివరకు పైచేయి బ్రిటిష్ వారిదైనది. సా.శ. 1754 లో డూప్లే దొర ఇండియాను వదలిపెట్టి వెళ్ళడంతో ఫ్రెంచి ఇండియా క్రమేణా క్షీణించి బ్రిటిష్ ఇండియా బలపడి 1948 దాకా జరిగినదే బ్రిటిష్ ఇండియా చరిత్ర.[1].

డూప్లే జీవిత కాలం 1697-1763[మార్చు]

ఫ్రెంచి వారి ఈస్ట్ ఇండియా వర్తక సంఘమునకు సభ్యుడుగా 1720 లో నియమించబడ్డ డూప్లే 1730 లో గవర్నరుగాను, ఆ తదుపరి 1742 నుండీ1754 వరకూ గవర్నరు జనరల్ గా నుండెను (10 వ గవర్నర్ జనరల్). ఇండియాలో ఫ్రెంచి వారి వలసరాజ్య విస్థారణ కార్యకలాపల్లో చాల ప్రముఖ పాత్రవహించాడు. ఫ్రెంచి ఈస్టుఇండియా కంపెనీకి కూడా తూర్పు సముద్రతీర కేంద్రమైన వంగరాష్ట్రములోని కలకత్తా ముఖ్యకేంద్రముగానుండెను. కానీ దక్షిణభారతదేశం డూప్లేదొర కర్మభూమిగా చెప్పవచ్చు. ముఖ్యంగా 1730 దశాబ్దములో ఆయన ఫ్రెంచిఇండియా గవర్నరుగా పనిచేసిన ఫ్రెంచి ఇండియావారి రాజధానిగానుండిన పుదుచ్చెరి, ఇండియాలో ఫ్రెంచి వారి వర్తక స్తావరములు ముఖ్యమైనవి పుదుచ్చెరీ, చంద్రనగర్, మచిలీపట్టణం, ఢాకా, పాట్నా, కాసీం బజారు.

వ్యక్తిగత జీవితచరిత్ర[మార్చు]

ఉత్తర ఫ్రాన్సుదేశంలోని లాండెర్సీస్ (Landercies) లో 1697జనేవరి 1 తారీఖున జన్మించెను. అధికార హోదాలోకి రాకముందే ఫ్రెంచి ఈస్టు ఇండియా కంపెనీ వారి ఓడలలో 1715 లోనే భారతదేశమువచ్చి 1720 దాకా స్వంతగా వ్యాపారము చేసినట్లు తెలియుచున్నది. 1720 లో ఫ్రెంచి ఇండియా సంస్థవారి పుదుచ్చేరీ కౌన్సిల్లో సభ్యునిగా నియమింపబడ్డాడు. తరువాత 1730 నుంచీ (వంగరాష్ట్రమున ఫ్రెంచి సంస్థలకు ) చంద్రనాగోరులో గవర్నరుగా నున్న రోజులలో 1741 లో జోన్ ఆల్బర్టు ( Ms. Jeanne Albert) ను వివాహమాడెను. 1720 నుండి 34 ఏండ్లు నిర్వహించిన పదవీ బాధ్యతలు, కార్యసాధనాలు, కౌశల్యం, నిపుణత, కార్యకకలాపాలు గుర్తింపు కాక పోగా పైపెచ్చు ఫ్రాన్సు దేశములోని తన పై ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురై, చివరకు 1754 పదవీ విరమణచేయబడినాడు. డూప్లే ఫ్రెంచి దేశంకోసం చేసిన విలువైన కృషి ఆయన జీవితకాలంలో గుర్తింపుకు నోచుకోలేదు. చనిపోయిన చాలాకాలానికి గాని గుర్తింపబడలేదు.[2]

మరణానంతరం వచ్చిన గుర్తింపులు, స్మారక చిహ్నములు[మార్చు]

పుదుచ్చేరిలో డూప్లే నిలువెత్తు విగ్రహం.

డూప్లే చనిపోయిన 100 సంవత్సరాల తరువాత 1870 నాటికి భారతదేశములో ఫ్రెంచివారి ఆధిపత్యం పోయి బ్రిటిష్ ప్రభుత్వము సాగుతున్నప్పుడు పుదుచ్చేరి (ఇప్పటి పాండిచ్చేరి ) at Goubert Avenue ప్రొమనేడ్ బీచ్ ( Promenade Beach) చివరలో డూప్లేదొర విగ్రహం నెలకొల్పబడింది. కొత్త ఢిల్లీలో వారి పేరున ఒక వీధి ఇప్పటికీ ఉంది. ఆలాగే వారి స్వదేశమైన ఫ్రాన్సులో కూడా డూప్లే దొర చనిపోయిన చాలా కాలానికి గానీ ఆయనకు గుర్తింపు రాలేదు. అక్కడ కూడా వారి జ్ఞాపకార్ధము ఒక విగ్రహము నెలకొల్పబడింది. ఫ్రెంచి ఫ్రభుత్వమువారు కొన్ని యుధ్ధ నౌకలు డూప్లే పేరున నామకరణం చేశారు.

డూప్లే కార్యకాలంలో ఇండియా దక్షిణాపధములో ఫ్రెంచివారికి బ్రిటిష్ వారికి మధ్య యుధ్ధాలు[మార్చు]

డూప్లే ఇండియాలో ఫ్రెంచివారి స్ధావరాలకు గవర్నర్ జనరల్ గానున్న కార్యకాలం (1742-1754) లో ప్రపంచస్థాయిలో యూరోప్ దేశాలమధ్య మూడు యుధ్ధములు జరిగినవి. రెండు సైలేశ్యన్ యుధ్ధాలు (Silesian 1740-1742, 1744-1745) మూడోది ఆస్ట్రియా రాజ్య వారసత్వ యుధ్ధం (War of Austrian Succession 1742-1748). ఆందులో పాత్రవహించిన వివిధ యూరోప్ దేశాలు కొన్నివక పక్షము మరికొన్ని ప్రతి పక్షముగా నిలిచిపోరాడాయి. ఆ మూడు యుధ్ధాలలోనూ ఫ్రాన్సుకు ప్రతిపక్షముగా బ్రిటన్ నుండటముచేత ఆ శత్రుత్వ మబ్బులు ఈ రెండుదేశాలు వారి స్వదేశములలోనే కాకుండా వ్యాపారంకోసం వలసవెళ్ళిన వలసదేశాలలోకి కూడా వ్యాపించాయి. ఇండియా దక్షిణాపధములో ఫ్రెంచి వారి రాజధాని పుదుచ్చెరీ బ్రిటిష్ వారి రాజధాని చెన్నపట్నం లోనూ ఇంకా ఉత్తర సర్కారులు లోనూ ఈ రెండుదేశాల మధ్య యుధ్ధములు జరిగినవి.[3].

కర్నాటక యుధ్ధాలు[మార్చు]

కర్నాటక రాజ్యములో 1746-1748, 1749-1754, 1758-1763 మధ్య పుదుచ్చెరీ, చెన్నపట్నం, ఆర్కాటులో జరిగిన మూడు యుధ్ధములును కర్నాటక యుధ్ధములుగా ప్రసిధ్ధి చెందినవి. (చూడు కర్ణాటక యుద్ధాలు). ఈ మూడు యుధ్ధాలలో రెండుపక్షాలు. (1) ఫ్రెంచివారి సంస్థతరఫున డూప్లే + మిత్రపక్షాలు (ALLIED FORCES) గానున్న హైదరాబాదు నవాబుగా ఒక దావాదారుడైన ముజఫర్, కర్నాటకనవాబుగా దావాదారుడైన చందాసాహెబు, అతని కుమారుడు రజాసాహిబ్. (2) బ్రిటిష్ వారి సంస్థ తరఫున రాబర్టు క్లైవు + మిత్రపక్షాలు (ALLIED FORCES) హైదరాబాదు నవాబుగా ఇంకో దావాదారుడైన నాజర్ జంగ్, కర్నాటకనవాబుగా దావాదారుడైన మహమ్మద్ అలీ. ఈ రెండు పక్షాలమథ్య మూడుచోట్ల జరిగిన యుధ్ధాలు కర్నాటక యుధ్ధాలు. ఫ్రెంచి వారి సంస్థ పుదుచ్చెరి (ఇప్పటి పాండిచెరీ) లో నుండేది.పులిక్కాట్ ( ప్రళయకావేరీ) లో డచ్చివారు, ప్రళయకావేరీకి కొంచం దూరములో నెల్లూజిల్లాలోనుండే ఆర్మగానులో 1626 లో ఇంగ్లీషువారి సంస్థ, మైలాపూరులో పోర్చుగీసువారి సంస్థా వుండేవి. మద్రాసుకు దాదాపు 160 కి.మీ లోనున్న కడ్డలూరులో బ్రిటిష్ వారు ఒకానొక పాత కోటనొకదానిని ( అచ్చటి పరిపాలకుదగ్గరనుండి కొనుకుని ఫోర్టు సెంట్ డేవిడ్ ( Fort Saint David) అని నామకరణం చేసి అక్కడ సిబ్బందితో నుండేవారు. ఈ కోటనే దేవీకోట అని చరిత్రలో ఉల్లేఖించబడింది.. తరువాతి కాలంలోఇంగ్లీషువారు 1639 లో పట్టాపొంది చెన్నపట్నం పట్టణంలోనే 1641 లోఫోర్టు సెంట్ జార్జి కోట (Fort Saint George) అనే ఇంకో కోట కట్టుకున్నారు. 1645 లో చంద్రగిరి రాజైన శ్రీ రంగరాయల నాశ్రయించి ఆపట్టా ధ్రువరచుచూ రాజశాసనంకూడా పొందారు.[4], [5].[6]. 1745 లో బ్రిటిష్ వారు పెద్దపెట్టున నౌకాదళానొకదానిని పంపించి ఫ్రెంచి వారికి రాజధానిగానున్న పుదుచ్చెరీని ముట్టడించటానికి సన్నాహాలు చేయటం వల్ల ఫ్రెంచివారు కూడా వారి పెద్దనౌకాధళాన్ని కదిలించి పంపించారు. 1746 లో ఆకస్మికంగా డూప్లే బ్రిటిష్ వారి మద్రాసు పై దండయాత్రచేసి విజయవంతంగా బ్రిటిష్ సంస్థ సిబ్బందిని బంధనలో పెట్టి మద్రాసు పట్ణాన్ని కైవశంచేసుకున్నాడు. యుధ్ధ సైనికాధిపతుల స్థాయిలో జరిగిన సంధి 'ఎయిక్సు లా ఛాపెల్' అనే రాజీ (Treaty of Aix-la-Chappelle) ప్రకారం బ్రిటిష్ వారు ఉత్తర అమెరికాలోని ఫ్రెంచివారి వలసస్థావరమును కైవశంచేసుకున్న లూబరో (Louisbourg) విడిచిపెట్టేట్లు ఇండియాలో ఫ్రెంచివారు కైవశంచేసుకున్న మద్రాసును విడిచిపెట్టెట్లు. ఆ సంధి ప్రకారం మద్రాసును తిరిగి బ్రిటిష్ వారికి వెనక్కిచ్చేశారు. ఫ్రెంచి వారి నౌకా దళాధిపతి కమాండర్ Comte de La Bourdonnais, బ్రిటిష్ నౌకాదళాధిపతి (Admiral Edward Peyton) మధ్యన జరిగిన ఆ సంది ఫ్రెంచి గవర్నరు జనరల్ డూప్లే దొరకి ఇష్టములేకపోయింది. డూప్లే 1846 సెప్టెంబరులో మద్రాసుపై చేసిన మొదటి దండయాత్ర 'అడయారు యుధ్దం' మళ్పీ రెండోసారి చేసినది 'మద్రాసు యుధ్ధం' మని ప్రసిధ్ది గాంచినవి. మొదటిసారి మద్రాసును కైవశంచేసుకున్నాక ఫోర్టు సెంట్ జార్జిని అనుకున్నట్లు కర్ణాటక నవాబు కివ్వనందున కర్ణాట నవాబు అన్వరుద్దీన్ మద్రాసులో నున్న డూప్లే సైన్యముపై పెద్దపెట్టున వేలకొలదికల తన సైన్యాన్ని దండయాత్రకి పంపాడు. డూప్లే చాలతక్కువమంది ఫ్రెంచి సైన్యముతోనే అన్వరుద్దీన్ సైన్యాన్ని తిరగత్రోలేశాడు. కానీ డూప్లే రెండోసారి 1746 డిసెంబరులో కడ్డలూరులోని ఫోర్టు సెంట్ డేవిడ్ ను పట్టుకొనుటకు మద్రాసు పై దండయాత్రచేసిన యుద్ధములో దారిలోనే అన్వరుద్దీన్ తన కుమారుడు మహమ్మదాలీని పెద్ద సైన్యముతో పంపి డూప్లేని దారిలోనే ఆపి బ్రిటిష్ వారి ఫోర్టు సేంట్ డేవిడ్ ను కాపాడాడు.

రాబర్టు క్లైవు రంగప్రవేశం[మార్చు]

1746 లో డూప్లె సైనికులు మద్రాసును ముట్టడించి బ్రిటిష్ సిబ్బందిని బందీగా చేసినప్పుడు మారువేషములో తప్పించుకుపోయిన కొంతమంది బ్రిటిష్ సిబ్బందిలో ఒక చిన్నవుద్యోగస్తుడుగానున్నరాబర్టు క్లైవు చాల త్వరలోనే ఉన్నత పదోన్నతులతో బ్రిటిష్ సంస్థలో 1755లో గవర్నరైనాడు.

కర్నాటకరాజ్యం చరిత్ర[మార్చు]

కర్నాటక నవాబు గారి నే ఆర్కాటు నవాబు అనికూడా అనేవారు. ఆయన రాజధాని ఆర్కాటు. అలనాటి కర్నాటక కృష్ణానది మొదలు కావేరీ నదివరకునూ గల సముద్రతీర భూభాగం మరియూ పడమర కడప, సేలం, దిండిగల్లు సరిహద్దులవర వరకూ కర్నాటకమనేవారు. కర్ణాటకను 1646లో చంద్రగిరి రాజుల దగ్గరనుండి గోల్కోండ సుల్తాను జయించాడు. 1692 లో గోల్కోండసుల్తానులనుండి మొగల్ చక్రవర్తి జయించాడు. అప్పటినుండి ఔరంగజీబు మరణం చేవరకూ (సా.శ.1707) కర్ణాటక నవాబు హైదరాబాదు నిజాంగారికి లోబడి రాజ్యపాలనచేసే వాడు. (చూడుకర్నాటక నవాబు) కొద్దికాలంలో కర్నాటక నవాబు దోస్త్ అలీఖాన్ స్వతంత్రపాలన చేశాడు అతని తరువాత అన్వ రుద్దీన్ కర్నాటక నవాబైనాడు. 1748 లో హైదరాబాదు నిజాం గారి మరణించటంతో ఆక్కడ వారసత్వపు తగాదాలు వచ్చినవి. 1749 లో కర్నాటక నవాబు అన్వరుద్దీన్ మరణించటంతో ఇక్కడ కర్నాటకలో కూడా నవాబు వారసత్వం తగాదాలు తలఎత్తి అతని వాలజా అనే మహమ్మదాలీ (అన్వరుద్దీన్ కుమారుడు) వారసత్వుడైయుండగా, అల్లుడు చందాసాహెబ్ కూడా దావాదారుడైనాడు. దాంతో ఆక్కడ హైదరాబాదు నిజాంకు వారసత్వ తగాదా ఇక్కడ కర్నాటక నవాబు వారసత్వ తగాదాలు వచ్చాయి. అలాంటి అవకాశలాకే వేచియున్న ఆంగ్లేయ, ఫ్రెంచి సంస్థలు రక్షణసహాయపేరట చెరోపక్షం చేరాయి. డూప్లే కుశాగ్రబుధిబలముచే దక్షిణాపధములోనున్న మహమ్మదీయ పరిపాలకులు నవాబులు (మొగలాయి సుబేదారులు) తో ఒకరుకాకపోతే నింకొకరన్నటుల ఒకసారి హైదరాబాదు నవాబు మరోకసారి కర్నాటక నవాబు తోనూ అనుగ్రహపాత్రుడేయుండి వారికి సైనిక సహాయమందజేసేవాడు. మైసూరు నవాబుగారైన హైదర్ అలీ ఖాన్ కు డూప్లే సైనిక అసరానివ్వటమేకాక అతనికి సైనిక తరఫీదుకూడా నిచ్చేవాడు. అందుచేత హేదర్ అలీ ఫ్రెంచివారికి మిత్రపక్షములోనుండేవాడు. హైదరాబాదు నిజాం సలాబత్ జంగ్, అతని తరువాత వచ్చిన ముజఫర్ జంగు కూడా డూప్లేకి మిత్రపక్షమువాళ్ళే అయిననూ ముజఫర్ జంగు కొలదికాలమునే రాజ్యమేలాడు. నిజాం వారసత్వదావాదారు నాజిర్ జంగ్ ఇంగ్లీషు వారినాశ్రయించాడు. వారసత్వం తగాదాలతో కర్నాటకలో 1750నుంచీ కొన్నాళ్ళు ఫ్రెంచివారి డూప్లే పరిపాలన నచింది. 1752 లో చందాసాహెబ్ ఉరితీయబడ్డాడు. బ్రిటిష్ వారు రాబర్టు క్లైవు సారథ్యంలో 1754 లో ఫ్రెంచి వారితో యుధ్ధము చేసి కర్నాటకను మహమ్మదాలీకి పట్టము కట్టారు.[1], ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; తప్పు పేర్లు, ఉదాహరణకు మరీ ఎక్కువ

  1. 1.0 1.1 “THE BRITISH RULE IN INDIA” D.V. SIVA RAO(1938). ఆంధ్ర గ్రంథాలయ ముద్రాక్షర శాల, బెజవాడ ప్రధమ ముద్రణము02-10-1938
  2. The Encyclopedia Britannica 14th Edition(1929), Volume7, pp747
  3. “Austrian Succession, war of the” Encyclopedia Britannica 14th Edition (1929), Volume2, pp776-781
  4. మన చెన్నపట్నం దాని పూర్వచరిత్ర దిగవల్లి వేంకట శివరావు (1941) ఆంధ్రపత్రిక వృషభనామ సంవత్సరాది సంచిక
  5. ఆర్కాటు నవాబు బాకీలు.దిగవల్లి వేంకట శివరావు(1943) ఆంధ్రపత్రిక 26-12-1943
  6. "Manual of the Administration of the MADRAS PRESIDENCY Volume 3 Glossary of the Madras Presidency" C.D. MACLEAN(1893) Reprinted in 1985 by Asian Educational Services, New Delhi-110016. pp296
"https://te.wikipedia.org/w/index.php?title=డూప్లే&oldid=3849119" నుండి వెలికితీశారు