డేవిడ్ గోవర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2007 లో సిడ్నీ క్రికెట్ స్టేడియంలో డేవిడ్ గోవర్

1957, ఏప్రిల్ 1న జన్మించిన డేవిడ్ గోవర్ (David Gower) ఇంగ్లాండుకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ప్రస్తుతం క్రికెట్ వ్యాఖ్యాతగా పనిచేస్తున్న గోవర్ 1980 దశకంలో అత్యుత్తమ క్రీడాకారుడిగా వెలుగొందినాడు.

ఎడమచేతి బ్యాట్స్‌మెన్ అయిన గోవర్ 1978లో తొలిసారిగా పాకిస్తాన్ పై ఆడిన ఇంగ్లాండు జాతీయ జట్టుకు వన్డేలలోనూ, టెస్టులలోనూ ప్రాతినిధ్యం వహించాడు. ఆడిన తొలి టెస్టులోనే తొలి బంతికి బౌండరీ కొట్టి రికార్డు సృష్టించిన గోవర్ తాను రిటైర్ అయ్యేనాటికి ఇంగ్లాండు తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాత్స్‌మెన్‌గానూ రికార్డు సృష్టించాడు. 1985 జరిగిన యాసెష్ సీరీస్‌లో 3 సార్లు 150కి పైగా పరుగులు చేసాడు.

టెస్ట్ క్రికెట్ గణాంకాలు[మార్చు]

117 టెస్టులు ఆడిన గోవర్ 44.25 సగటుతో 8231 పరుగులు చేశాడు. అందులో 18 సెంచరీలు, 39 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అతని అత్యధిక స్కోరు 215 పరుగులు. బౌలింగ్‌లో ఒక వికెట్టు కూడా సాధించాడు.

వన్డే క్రికెట్ గణాంకాలు[మార్చు]

గోవర్ 114 వన్డేలలో ప్రాతినిధ్యం వహించి 30.77 సగటుతో 3170 పరుగులు చేసాడు. అందులో 7 సెంచరీలు, 12 అర్థ్సెంచరీలు ఉన్నాయి. వన్డేలలో అతని అత్యధిక స్కోరు 158 పరుగులు.

అవార్డులు[మార్చు]

  • 1979లో డేవిడ్ గోవర్‌ విజ్డెన్ క్రికెటరర్ ఆఫ్ దొ ఇయర్ అవార్డుకు ఎంపికైనాడు.

ప్రపంచ కప్ క్రికెట్[మార్చు]

గోవర్ 1979, 1983 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం వహించాడు.

బయటి లింకులు[మార్చు]