డైక్లోరిన్ హెక్సాక్సైడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డైక్లోరిన్ హెక్సాక్సైడ్
Dichlorine hexoxide.svg
Space-filling model of the dichlorine hexoxide molecule
Space-filling model of the component ions of dichlorine hexoxide
పేర్లు
IUPAC నామము
Dichlorine hexoxide
ఇతర పేర్లు
Chlorine trioxide; Chloryl perchlorate; Chlorine(V,VII) oxide
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [12442-63-6]
ధర్మములు
Cl2O6
మోలార్ ద్రవ్యరాశి 166.901 g/mol
స్వరూపం red liquid
సాంద్రత 1.65 g/cm3
ద్రవీభవన స్థానం 3.5 °C (38.3 °F; 276.6 K)
బాష్పీభవన స్థానం 200 °C (392 °F; 473 K)
Reacts
ప్రమాదాలు
ప్రధానమైన ప్రమాదాలు oxidizer
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☑Y verify (what is ☑Y

☒N ?)

Infobox references

డైక్లోరిన్ హెక్సాక్సైడ్ ఒక రసాయన సమ్మేళన పదార్థం. ఇది ఒక అకర్బన సంయోగపదార్థం.ఈ సంయోగపదార్థం యొక్క అణుసంకేత పదం/సూత్రం Cl2O6.ఈ సంయోగపదార్థం వాయుస్థితిలో ఉన్నప్పుడు, ఈ అణుఫార్ములా సరిగ్గా సరిపోతుంది. అయినప్పటికీ ద్రవరూపంలో లేదా ఘనస్థితిలో ఉన్నప్పుడు డైక్లోరిన్ హెక్సాక్సైడ్ ఆయనీకరణ వలన ముదురు లేదా చిక్కని ఎరుపు వర్ణపు అయోనిక్ సంయోగపదార్థం క్లోరైల్ పెర్క్లోరేట్([ClO2]+[ClO4]గా అయనీకరణ చెందును.

ఉత్పత్తి[మార్చు]

క్లోరిన్ డయాక్సైడ్, అధిక పరిమాణంలోఉన్న ఓజోన్ తో రసాయనచర్య జరపడం వలన డైక్లోరిన్ హెక్సాక్సైడ్ ఏర్పడును.

2 ClO2 + 2 O3 → 2 ClO3 + 2 O2 → Cl2O6 + 2 O2

అణు సౌష్టవం[మార్చు]

వాయువుగా ఇది మొనోమెరిక్ క్లోరిన్ ట్రైఆక్సైడ్(ClO3)గా ఉండునని భావించబడినది.ఇది బాష్పీకరణ తరువాత తాపవియోగం వలన క్లోరిన్ పెర్క్లోరేట్, క్లోరిన్ టెట్రాఆక్సైడ్ (Cl2O4), ఆక్సిజన్ గా విడిపోవు వరకు ఆక్సిజన్‌తో బందితమైన ద్వ్యణుకం(oxygen-bridged dimer)గా ఉండునని తెలుస్తున్నది

భౌతిక లక్షణాలు[మార్చు]

ఎర్రటి పొగలు వెలువరిస్తూ, ద్రవరూపంలో ఉండును.ఎర్రనిరంగుగల క్లోరైల్ పెర్క్లోరేట్ ([ClO2]+[ClO4])అయోనిక్ సమ్మేళనంగా స్పటికరణచెందును. సంయోగపదార్థానికి ఉన్న ఎరుపురంగు అందులో క్లోరిన్ అయానుల ఉనికిని తెలుపుతున్నది.డైక్లోరిన్ హెక్సాక్సైడ్ అణుభారం 166.901 గ్రాములు/మోల్.ఈ సంయోగపదార్థం యొక్క సాంద్రత 1.65 గ్రాములు/సెం.మీ3.డైక్లోరిన్ హెక్సాక్సైడ్ యొక్క ద్రవీభవన స్థానం 3.5 °C (38.3 °F; 276.6K), ఈ సమ్మేళనపదార్థం యొక్క బాష్పీభవన స్థానం200°C (392 °F; 473K).నీటితో చర్య జరుపును.డైక్లోరిన్ హెక్సాక్సైడ్ బలమైన ఆక్సీకరణకారకం, డయామాగ్నటిక్(ప్రయోగించిన అయస్కాంతతత్వనికి వ్యరితరేక దిషలో అయస్కాంత తత్వాని ప్రేరెపింఛునది) పదార్థం.

రసాయన ధర్మాలు[మార్చు]

గది ఉష్ణోగ్రత వద్ద డైక్లోరిన్ హెక్సాక్సైడ్ స్థిరమైనపదార్థం అయినప్పటికీ, సేంద్రియ సంయోగపదార్థాలతో చర్యవలన తీవ్రస్థాయిలో విస్పొటనం చెందును.

బంగారంతో చర్యవల క్లోరైల్ లవణం [ClO2]+[Au(ClO4)4]ఏర్పడును.

డైక్లోరిన్ హెక్సాక్సైడ్ ఈక్రింది అయోనికచర్యలను జరుపును.

NO2F + Cl2O6 → NO2ClO4 + ClO2F
NO + Cl2O6 → NOClO4 + ClO2
2V2O5 + 12Cl2O6 → 4VO(ClO4)3 + 12ClO2 + 3O2
SnCl4 + 6Cl2O6 → [ClO2]2[Sn(ClO4)6] + 4ClO2 + 2Cl2
2Au + 6Cl2O6 → 2[ClO2]+[Au(ClO4)4]− + Cl2

డైక్లోరిన్ హెక్సాక్సైడ్ అంతియే కాకుండా క్లోరోట్రైఆక్సైడ్ రాడికల్ వనరు(source)గా కుడా ప్రవరిస్తుంది.

2 AsF5 + Cl2O6 → 2ClO3AsF5

మూలాలు[మార్చు]