Jump to content

డైనైట్రోజన్ ట్రైయాక్సైడ్

వికీపీడియా నుండి
డైనైట్రోజన్ ట్రైయాక్సైడ్
Dinitrogen trioxide
పేర్లు
ఇతర పేర్లు
Nitrous anhydride, nitrogen sesquioxide
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [10544-73-7]
పబ్ కెమ్ 61526
యూరోపియన్ కమిషన్ సంఖ్య 234-128-5
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:29799
SMILES [O-][N+](=O)N=O
ధర్మములు
N2O3[1]
మోలార్ ద్రవ్యరాశి 76.01 g/mol[1]
స్వరూపం deep blue liquid
సాంద్రత 1.447 g/cm3,[2] liquid
1.783 g/cm3 (gas)
ద్రవీభవన స్థానం −100.7 °C (−149.3 °F; 172.5 K)
బాష్పీభవన స్థానం 3.5 °C (38.3 °F; 276.6 K)
very soluble
ద్రావణీయత soluble in ether
నిర్మాణం
planar, Cs
ద్విధృవ చలనం
2.122 D
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
+91.20 kJ/mol
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
314.63 J K−1 mol−1
విశిష్టోష్ణ సామర్థ్యం, C 65.3 J/mol K
ప్రమాదాలు
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
జ్వలన స్థానం {{{value}}}
సంబంధిత సమ్మేళనాలు
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

డైనైట్రోజన్ ట్రైయాక్సైడ్ ఒక రసాయనసమ్మేళనం. ఇది ఒక ఆకర్బన రసాయన సంయోగపదార్ధం.ఈ సంయోగపదార్ధం యొక్క రసాయన సంకేతపదం N2O3.ముదురు నీలవర్ణపు ఘనపదార్థం[3][2]. నైట్రిక్ ఆమ్లం, నైట్రోజన్ డయాక్సైడులను రెండు సమానభాగాలుగా తీసుకోని మిశ్రమం చేసి,(మైనస్)-25°C(−6°F)కు తక్కువ ఉష్ణోగ్రత వద్ద చల్లబరచిన డైనైట్రోజన్ ట్రైయాక్సైడ్ ఏర్పడును:[4] NO + NO2 is in equilibrium with N2O3 డైనైట్రోజన్ ట్రైయాక్సైడ్‌ను తక్కువ ఉష్ణోగ్రతవద్ద మాత్రమే వేరుపరచగలరు(ద్రవ లేదా ఘనస్థితులు). ఎక్కువ ఉషోగ్రతవద్ద Kdiss = 193 kPa (25 °C)[5]తో వాయు సమతుల్యత కలిగిఉండును.అణువులో నైట్రోజన్ శాతం36.854 %;ఆక్సిజన్ శాతం 63.145 %.CAS No:10544-73-7.[6]

అణుసౌష్టవం-బంధం

[మార్చు]

సాధారణంగా N–N పరమాణువు ల మధ్య బంధదూరం హైడ్రాజీన్(145 pm)లో ఉన్నవిధంగానే ఉండును.అయితే డైనైట్రోజన్ ట్రైయాక్సైడ్‌లో N–N పరమాణువుల మధ్య బంధదూరం 186 pm.మరికొన్ని నైట్రోజన్ ఆక్సైడులు, డైనైట్రోజన్ టెట్రాక్సైడ్(175 pm)తో సహా,N–N పరమాణువుల మధ్యపొడవైన బంధదూరం కలిగిఉన్నాయి.డైనైట్రోజన్ ట్రైయాక్సైడ్ అణువు సమతలం(planar)గాఉండి, Cs సౌష్టవం ప్రదర్శించును.తక్కువ ఉష్ణోగ్రతవద్ద మైక్రోవేవ్ స్పెక్ట్రోస్కోపి(microwave spectroscopy)ఉపయోగించి తీసిన అణుబంధ కొలతలను దిగువన ఇవ్వడమైనది.

The bond lengths and angles of dinitrogen trioxide.

అస్థిరమైన నైట్రోస్ ఆమ్లం(HNO2), యొక్క నిర్జలరూపమే డైనైట్రోజన్ ట్రైయాక్సైడ్.నైట్రస్ఆమ్లాన్ని నీటిలో కలపడంవలన డైనైట్రోజన్ ట్రైయాక్సైడ్ ఉత్పత్తిఅగును.ఒక ప్రత్యామ్నాయ నిర్మాణం నిజమైననిర్జల O=N–O–N=O,కాని ఈ మారురూపాన్ని(isomer)ఇంతవరకు గుర్తించలేదు.

కొన్ని సందర్భాలలో క్షారద్రవాలకు డైనైట్రోజన్ ట్రైయాక్సైడ్ కలపడంవలన నైట్రైట్ లవణాలు ఏర్పడును.

N2O3 + 2 NaOH → 2 NaNO2 + H2O

ఆరోగ్యం పై ప్రభావం

[మార్చు]

చర్మం,కళ్లు, మ్యుకస్ పొరలపై ప్రభావంచూపును.శ్వాసపీల్చిన విషప్రభావం చూపును.[2]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Dinitrogen trioxide". chemspider.com. Retrieved 2015-09-15.
  2. 2.0 2.1 2.2 "Dinitrogen Trioxide". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2015-09-15.
  3. Greenwood, Norman N.; Earnshaw, Alan (1997). Chemistry of the Elements (2nd ed.). Butterworth-Heinemann. p. 444. ISBN 0080379419.
  4. "Dinitrogen trioxide". britannica.com. Retrieved 2015-09-15.
  5. మూస:Holleman&Wiberg
  6. "DINITROGEN TRIOXIDE". chemistry-reference.com. Archived from the original on 2016-03-04. Retrieved 2015-09-15.