Jump to content

డైవర్టిక్యులోసిస్

వికీపీడియా నుండి

డైవర్టిక్యులోసిస్ అనేది పెద్దప్రేగులో బహుళ తిత్తులు (డైవర్టికులా) కలిగి ఉండి, నొప్పి లేని శరీర పరిస్థితి.

డైవర్టిక్యులోసిస్‌

డైవర్టిక్యులోసిస్ అనేది పెద్దప్రేగులో బహుళ తిత్తులు (డైవర్టికులా) కలిగి ఉండే శరీర పరిస్థితి. దీర్ఘకాలిక మలబద్ధకం వలన డైవర్టిక్యులోసిస్‌ అనే ఈ పరిస్థితికి కారణమవుతుంది. ఏళ్ల కొద్దీ మలబద్ధకం కొనసాగటం వల్ల పెద్ద ప్రేగు గోడలు ఉబ్బిపోయి, బలహీనంగా మారినచోట్ల చిన్నచిన్న తిత్తులు ఏర్పడతాయి. ఈ డైవర్టికులాలు చాలా మంది వ్యక్తులలో వ్యాధి లక్షణాలను కలిగించదు. ఈ పరిస్థితినే 'డైవర్టిక్యులోసిస్‌' అంటారు. ఈ తిత్తుల్లో వాపు కూడా వచ్చి మంట తో ఏర్పడిన వ్యాధిని డైవర్టిక్యులైటిస్‌ అంటారు.[1]

డైవర్టికులా సాధారణంగా సిగ్మోయిడ్ కోలన్‌లో సంభవిస్తుంది. కెనడా, యునైటెడ్ స్టేట్స్‌ వంటి పాశ్చాత్య దేశాలలో 60 ఏళ్లు పైబడిన వారిలో సగం మందిలో ఇది సాధారణం. ఆఫ్రికాలో తక్కువ.[2] దీనికి గల కారణాలు అస్పష్టంగానే ఉన్నాయి, అయితే అనేక పాశ్చాత్య జనాభాల ఆహారంలో పీచు పదార్ధాలు తక్కువ తక్కువ తీసుకునే లక్షణానికి భిన్నంగా అధిక పీచు పదార్ధాలు ఉండడం ఎక్కువ ప్రాబల్యం ఉండవచ్చు.[3] అమెరికా లోని వ్యాధిగ్రస్తులలో పెద్దప్రేగు ఎడమ వైపు ఎక్కువగా ప్రభావితమవుతుంది, అయితే ఆసియాలో కుడి వైపు ఎక్కువగా ప్రభావితమవుతుంది.[4] డైవర్టికులా 40 సంవత్సరాల లోపల వారిలో సాధారణంగా కనపడదు, అయితే వయస్సు పెరుగుతున్న కొలది దీని సంభవం పెరుగుతుంది.[2]

ఈ పరిస్థితి సాధారణంగా కొలనోస్కోపీ సమయంలో లేదా CT స్కాన్ సమయంలో యాదృచ్ఛికంగా కనుగొంటారు.[4]

లక్షణాలు

[మార్చు]

డైవర్టిక్యులోసిస్ ఉన్న కొందరు వ్యక్తులు తిమ్మిరి, ఉబ్బరం, అపానవాయువు, మలబద్ధకం వంటి లక్షణాల చెపుతారు, అపుడు, ఈ లక్షణాలు అంతర్లీన డైవర్టిక్యులోసిస్‌కు కారణమా లేదా ప్రకోప ప్రేగు సిండ్రోమ్‌ (IBS) వలనా అనేది అస్పష్టం.[5] డైవర్టిక్యులర్ వ్యాధి నొప్పి లేకుండా ఉండి మలద్వారంలో రక్తస్రావంతో ప్రతి ఉంటుంది. డైవర్టిక్యులర్ రక్తస్రావం వలన దిగువ జీర్ణశయాంతర రక్తస్రావం అత్యంత సాధారణ కారణం.[6] అయినప్పటికీ, ఈ రోగులలో 80% వరకు స్వయంగా నియంత్రిచుకోగల అవకాశం ఉంటుందని, నిర్దిష్ట చికిత్స అవసరం లేదని అంచనా వేసారు.[7]

అయితే డైవర్టికులంలో సంక్రమణం వలన డైవర్టికులిటిస్‌కు అనే వ్యాధికి దారి తీస్తుంది. పెద్దప్రేగులో పొరలలో చిరుగులు లేదా చిల్లులు సంభవించి రక్త స్రావం కావచ్చు. చీము ఏర్పడటం, రెట్రోపెరిటోనియల్ ఫైబ్రోసిస్, సెప్సిస్, ఫిస్టులా ఏర్పడటం వంటివి కూడా జరుగుతుంది. [8] పొత్తికడుపు నొప్పి, ఉదరం ఎడమ దిగువ భాగంలో పొత్తికడుపు నొప్పి, వికారం, వాంతులు, మలబద్ధకం లేదా అతిసారం, జ్వరం ల్యూకోసైటోసిస్ వంటివి కూడా ఉన్నాయి.[1]

డైవర్టిక్యులోసిస్ తో సంబంధం ఉన్న సెగ్మెంటల్ కొలైటిస్ (SCAD-Segmental colitis associated with diverticulosis) అనేది పెద్దప్రేగు వాపు SCAD కడుపు నొప్పికి దారితీయవచ్చు, ముఖ్యంగా ఎడమ దిగువ భాగంలో, అడపాదడపా మల రక్తస్రావం, దీర్ఘకాలిక విరేచనాలు తో బాధపడుతుంటారు. పెద్దప్రేగు డైవర్టిక్యులోసిస్ ఉన్నప్పటికిని చాలా మందికి అక్కడ ఏర్పడుతున్న మార్పు గురించి తెలియదు. 40 ఏళ్లు పైబడిన వ్యక్తిలో లక్షణాలు కనిపించినప్పుడు వైద్య సలహాను పొందడం, పెద్దప్రేగు లేదా రెక్టల్ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన పరిస్థితులను అంచనా తీసుకోవడం చాలా అవసరం.[9][10][11]

డైవర్టిక్యులర్ వ్యాధి వలన ఎడమ వైపు పెద్దప్రేగు క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు.[12]

కారణాలు

[మార్చు]

పెరుగుతున్న వయస్సు; మలబద్ధకం; పీచు పదార్ధాలు తక్కువ ఉన్న ఆహారం (U.S. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైవర్టిక్యులోసిస్ పీచు పదార్ధాలు తక్కువ ఉన్న ఆహారంతో వస్తుందనే సిద్ధాంతానికి ఆధారం లేదని పేర్కొంది [13]) వంటివి ముఖ్య కారణాలు.

మరొక సిద్ధాంతం ప్రకారం మల బద్ధకం పెద్దప్రేగు గోడపై ఒత్తిడిని పెంచుతుంది, ఫలితంగా డైవర్టికులా ఏర్పడుతుంది.

పెద్దప్రేగు గోడలో బలహీనతకు కారణమయ్యే బంధన కణజాల రుగ్మతలు (మార్ఫాన్ సిండ్రోమ్ మరియు ఎహ్లర్స్-డాన్లోస్ సిండ్రోమ్ వంటివి) వంశపారంపర్య లేదా జన్యు సిద్ధత, తీవ్రంగా బరువు తగ్గడం, మాంసం ఎక్కువగా తినడం వంటివి కారణాలుగా పేర్కొన్నారు. [14]

నివారణ

[మార్చు]
ఈ విషయంలో ముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. ఈ సమస్య తలెత్తకుండా చూసుకోవచ్చు. ఎందుకంటే.. ఎక్కువగా అరవై ఏళ్ల వయసులో కనిపించే ఈ సమస్య చాలా బాధాకరంగా పరిణమిస్తుంది.
  • రోజూ పీచు పదార్థాలను బాగా తినటం, ఫాస్ట్‌ఫుడ్‌ మానెయ్యటం దీనికి మేలైన పరిష్కారం.
  • గోధుమలు, ఓట్స్‌, పచ్చి కూరగాయలు, తాజా పండ్లు, మొలకెత్తిన గింజలు తినటం మంచిది. వీటితోపాటు రోజూ 10-12 గ్లాసుల మంచినీరు తాగుతుండాలి. ఈ రెండింటి సమ్మేళనంతో పేగుల్ని, జీర్ణాశయాన్ని శుభ్రంగా ఉంచుకోవచ్చు.
  • డాక్టర్‌ సలహాతో కొన్ని వ్యాయామాలు సైతం చేయవచ్చు. రోజూ పొట్ట వ్యాయామాలు (అబ్డామినల్‌ క్రంచెస్‌) 50 దాకా చేయాలి. ఇవెలా చేయాలంటే.. వెల్లకిలా నేలపై పడుకోవాలి. మోకాళ్ల దగ్గర కాళ్లని మడవాలి. రెండుచేతుల్నీ తల కిందుగా ఉంచాలి. అరిచేతులతో తలను ఏమాత్రం నొక్కకుండా నడుము దగ్గర్నించి పైకి లేవాలి. వెన్నెముక నిటారుగా ఉంచాలి. గడ్డం ఛాతీవైపు వంగకూడదు. అబ్డామినల్‌ క్రంచెస్‌ కారణంగా- పొట్టలోని కండరాలు, పెద్దపేగు చుట్టూఉండే కండరాలు బలిష్టంగా మారి అక్కడ బలహీనం కాకుండా నిరోధిస్తాయి.
  • స్వీట్లకు బదులుగా తాజాపండ్లను తినాలి.
  • పీచు పదార్థాల్ని ఎక్కువగా తినటానికి వీలుకాని సందర్భంలో చెంచాడు సబ్జా గింజల పొట్టు ను (ఇసాబ్‌గోల్‌) రాత్రి పడుకునే ముందు నీటితో తీసుకోవచ్చు.
  • పొట్ట దిగువ ఎడమవైపు నొప్పిగా అనిపిస్తే డాక్టర్ని సంప్రదించాలి. అలాగే టమాటాలు, మిరపకాయలు వంటి గింజలుండే ఆహార పదార్థాల్ని మానెయ్యాల

ఇది కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Tursi A, Papa A, Danese S (September 2015). "Review article: the pathophysiology and medical management of diverticulosis and diverticular disease of the colon". Alimentary Pharmacology & Therapeutics. 42 (6): 664–84. doi:10.1111/apt.13322. PMID 26202723. S2CID 24568867.
  2. 2.0 2.1 Comparato G, Pilotto A, Franzè A, Franceschi M, Di Mario F (2007). "Diverticular disease in the elderly". Digestive Diseases. 25 (2): 151–9. doi:10.1159/000099480. PMID 17468551.
  3. Painter NS, Burkitt DP (May 1971). "Diverticular disease of the colon: a deficiency disease of Western civilization". British Medical Journal. 2 (5759): 450–4. doi:10.1136/bmj.2.5759.450. PMC 1796198. PMID 4930390.
  4. 4.0 4.1 Tursi, A (March 2016). "Diverticulosis today: unfashionable and still under-researched". Therapeutic Advances in Gastroenterology. 9 (2): 213–28. doi:10.1177/1756283X15621228. PMC 4749857. PMID 26929783.
  5. "Clinical manifestations and diagnosis of colonic diverticular disease". Literature review.
  6. Acute lower gastrointestinal bleeding in 1,112 patients admitted to an urban emergency medical center. Gayer C1, Chino A, Lucas C, Tokioka S, Yamasaki T, Edelman DA, Sugawa C. http://www.surgjournal.com/article/S0039-6060(09)00481-4/pdf
  7. Barnert J, Messmann H (2008). "Management of lower gastrointestinal tract bleeding". Best Practice & Research. Clinical Gastroenterology. 22 (2): 295–312. doi:10.1016/j.bpg.2007.10.024. PMID 18346685.
  8. Peery, Anne F.; Sandler, Robert S. (2013). "Diverticular Disease: Reconsidering Conventional Wisdom". Clinical Gastroenterology and Hepatology. 11 (12): 1532–1537. doi:10.1016/j.cgh.2013.04.048. PMC 3785555. PMID 23669306.
  9. Shepherd NA (1992) Diverticular disease. In Oxford Textbook of Pathology, pp. 1256–1258 [J O'D McGee, PG Isaacson, and NA Wright, editors]. Oxford: Oxford University Press.
  10. West, AB (2008). "The pathology of diverticulitis". J Clin Gastroenterol. 42 (10): 1137–8. doi:10.1097/MCG.0b013e3181862a9f. PMID 18936652.
  11. Drummond, H (1916). "Sacculi of the large intestine with special reference to their relation to the blood vessels of the bowel wall". British Journal of Surgery. 4 (15): 407–413. doi:10.1002/bjs.1800041505. S2CID 72222598.
  12. Stefánsson T, Ekbom A, Sparèn P, Påhlman L (Aug 2004). "Association between sigmoid diverticulitis and left-sided colon cancer: a nested, population-based, case control study". Scand J Gastroenterol. 39 (8): 743–7. doi:10.1080/00365520410003272. PMID 15513359. S2CID 21100705.
  13. "Understanding Diverticulosis and Diverticulitis - NIH MedicinePlus". Nlm.nih.gov. 27 August 2012. Retrieved 4 October 2013.
  14. Feuerstein, JD; Falchuk, KR (August 2016). "Diverticulosis and Diverticulitis". Mayo Clinic Proceedings (Review). 91 (8): 1094–1104. doi:10.1016/j.mayocp.2016.03.012. PMID 27156370.