Jump to content

డైవర్టిక్యులైటిస్

వికీపీడియా నుండి
(డైవర్టిక్యులైటిస్‌ నుండి దారిమార్పు చెందింది)
డైవర్టిక్యులైటిస్
ఇతర పేర్లుపెద్ద ప్రేగు డైవర్టిక్యులైటిస్
పెద్ద ప్రేగు విభాగం (సిగ్మోయిడ్ కోలన్) బహుళ తిత్తులు (డైవర్టికులా) చూపిస్తుంది.
ప్రత్యేకతజీర్ణకోశ వ్యాధి
లక్షణాలుకడుపు నొప్పి, జ్వరం, వికారం, విరేచనాలు, మలబద్ధకం, మలంలో రక్తం
సంక్లిష్టతలుఅబ్సెస్, ఫిస్టులా, పేగు చిల్లులు
సాధారణ ప్రారంభంఆకస్మికంగా, వయస్సు > 50
కారణాలుఅనిశ్చితం
ప్రమాద కారకములుస్థూలకాయం, వ్యాయామం లేకపోవడం, ధూమపానం, కుటుంబ చరిత్ర, నాన్‌స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందుల వాడకం
రోగనిర్ధారణ పద్ధతిరక్త పరీక్షలు, CT స్కాన్, కొలనోస్కోపీ
భేదాత్మక రోగనిర్థారణ పద్ధతిప్రకోప ప్రేగు సిండ్రోమ్
నివారణMesalazine, rifaximin
చికిత్సయాంటీబయాటిక్స్, ద్రవ ఆహారం, ఆసుపత్రిలో చేరిక
తరుచుదనము3.3%

డైవర్టికులిటిస్ అనేది జీర్ణశయాంతర వ్యాధి అంటే ప్రత్యేకంగా పెద్దప్రేగుకు సంబంధించిన వ్యాధి. పెద్దప్రేగు గోడలలో అభివృద్ధి చెందే అసాధారణమైన తిత్తులని డైవర్టికులే అంటారు. అయితే పెద్ద ప్రేగు లో తిత్తులు ఉన్నప్పటికీ, వాపు వంటి సమస్యలు లేకపోతే ఆ వైద్య పరిస్థితిని డైవర్టిక్యులోసిస్ అని పిలుస్తారు. పెద్ద ప్రేగు గోడలలో ఉంది అవి వాచినప్పుడు డైవర్టిక్యూలైటిస్ వ్యాధి సంభవిస్తుంది.[1]

లక్షణాలు

[మార్చు]

సాధారణంగా లక్షణాలు అకస్మాత్తుగా ప్రారంభమై పొత్తికడుపు నొప్పి తక్కువ ఉంటుంది, కానీ కొన్ని రోజులలో వికారం, అతిసారం లేదా మలబద్ధకం కూడా ప్రారంభమవుతుంది. జ్వరం లేదా మలంలో రక్తం వంటివి సమస్య లో తీవ్రతను సూచిస్తుంది. ఈ సమస్య పునరావృతమవుతుండవచ్చు. డైవర్టిక్యులిటిస్ కారణాలు అనిశ్చితం.[1]

కారకాలలో ఊబకాయం, వ్యాయామం లేకపోవడం, ధూమపానం, కుటుంబ చరిత్ర, నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు (NSAIDs) వాడకం వంటివి ఉండవచ్చు. ఆహారంలో పీచు పదార్ధం పాత్ర అస్పష్టంగా ఉంది. ఏదో ఒక సమయంలో బ్యాక్టీరియా సంక్రమణ కారణంగా వాపు 10%-25% మధ్య సంభవిస్తుంది.[2]

రోగనిర్ధారణకు సిటి స్కాన్, రక్త పరీక్షలు, కొలొనోస్కోపీ సహాయపడతాయి. రోగనిర్ధారణలలో ప్రకోప ప్రేగు లక్షణాలను (IBS irritable bowel syndrome) కూడా పరిగణిస్తారు.[3]

నివారణ/చికిత్స

[మార్చు]

నివారణ చర్యలలో ఊబకాయం తగ్గించుకోవడం, నిష్క్రియాత్మకతను దూరం చేయడం అంటే చురుకుగా ఉండడం, ధూమపానం వంటి ప్రమాదకరమైన అలవాట్లు మానడం వంటివి చాలా ముఖ్యం. డైవర్టికులాలో గింజలు, విత్తనాలు వాపు కలిగిస్తాయనే ఆధారాలు లేనందున వాటిని మానమని సిఫారసు చేయరు.

డైవర్టిక్యులోసిస్ ఉన్నవారిలో వాపు పునరావృతం కావడాన్ని నివారించడానికి మెసలాజైన్, రిఫాక్సిమిన్ వంటి మందులు వాడుతారు. డైవర్టిక్యులిటిస్ ఉదృతం తగ్గించడంకోసం నోటి ద్వారా యాంటీబయాటిక్ మందులు, ద్రవ ఆహారం సిఫార్సు చేస్తారు. తీవ్రమైన సందర్భాల్లో, ఇంట్రావీనస్ యాంటీబయాటిక్స్ (సిరల లోనికి నేరుగా పంపే మందులు), ఆసుపత్రిలో చేరడం, పూర్తి ప్రేగు విశ్రాంతి సిఫార్సు చేయవచ్చు. ప్రోబయోటిక్స్ వాడకం వలన కలిగే ప్రయోజనం గురించిన సమాచారం కూడా అస్పష్టంగానే ఉంది. చీము ఏర్పడటం, ఫిస్టులా ఏర్పడటం, పెద్దప్రేగు రంధ్రం వంటి తీవ్ర సమస్యలకు శస్త్రచికిత్స అవసరం కావచ్చు.[1]

వ్యాధి వ్యాప్తి

[మార్చు]

పాశ్చాత్య ప్రపంచంలో ఈ వ్యాధి సాధారణం, అయితే ఆఫ్రికా, ఆసియాలో సాధారణంగా కనపడదు.[1] పాశ్చాత్య ప్రపంచంలో సుమారు 35% మందికి డైవర్టిక్యులోసిస్ ఉంటే, గ్రామీణ ఆఫ్రికాలో 1% కంటే తక్కువ మందిని ఇది ప్రభావితం చేస్తుంది, వారిలో 4 నుండి 15% మందికి డైవర్టిక్యులిటిస్ వ్యాధి పెరుగుతుంది.[2][4] ఉత్తర అమెరికా, ఐరోపాలో కడుపు నొప్పి సాధారణంగా ఎడమ దిగువ భాగంలో ఉంటుంది (సిగ్మాయిడ్ కోలన్), ఆసియాలో ఇది సాధారణంగా కుడి వైపున ఉంటుంది (ఆరోహణ కోలన్).[5] ఈ వ్యాధి వయస్సు బట్టి కూడా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువ కనపడుతుంది. ఇప్పుడు ఇది ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో కూడా సర్వసాధారణంగా మారింది. 2003లో ఐరోపాలో దీని వలన సుమారు 13,000 మంది మరణించారు. డైవర్టిక్యులర్ వ్యాధి వలన 2013 లో అమెరికా లో సంవత్సరానికి అయిన ఖర్చు US $2.4 బిలియన్లు. [3]

ఇది కూడా చూడండి

[మార్చు]

సూచనలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 "Diverticular Disease". www.niddk.nih.gov. September 2013. Archived from the original on 13 June 2016. Retrieved 12 June 2016.
  2. 2.0 2.1 Mandell, Douglas, and Bennett's Principles and Practice of Infectious Diseases. Churchill Livingstone. 2014. p. 986. ISBN 9781455748013. Archived from the original on 2016-08-08.
  3. 3.0 3.1 Tursi, A (March 2016). "Diverticulosis today: unfashionable and still under-researched". Therapeutic Advances in Gastroenterology. 9 (2): 213–28. doi:10.1177/1756283x15621228. PMC 4749857. PMID 26929783.
  4. Pemberton, John H (16 June 2016). "Colonic diverticulosis and diverticular disease: Epidemiology, risk factors, and pathogenesis". UpToDate. Archived from the original on 2017-03-14. Retrieved 13 March 2017.
  5. Feldman, Mark (2010). Sleisenger & Fordtran's Gastrointestinal and liver disease pathophysiology, diagnosis, management (9th ed.). [S.l.]: MD Consult. p. 2084. ISBN 9781437727678. Archived from the original on 2016-08-08.