Jump to content

డొమైన్ నేమ్ సిస్టమ్

వికీపీడియా నుండి

డొమైన్ నేమ్ సిస్టమ్ (DNS) అనేది అంతర్జాలంలోనూ, ఇతర ఐపి నెట్‌వర్క్ లో భాగమైన కంప్యూటర్లు, సంబంధిత సేవలు, ఇతర వనరులకు పేర్లు పెట్టడానికి ఉద్దేశించిన విస్తృతమైన (కేంద్రీకృతం కాని), క్రమానుగత వ్యవస్థ. ఇందులో ప్రతి అంశానికీ ఒక డొమైన్ నేమ్, దాని సంబంధిత సమాచారం ఉంటుంది. ముఖ్యంగా ఈ వ్యవస్థలో గుర్తుంచుకోదగిన డొమైన్ నేమ్, సంఖ్యల రూపంలో ఉన్న ఐ పీ అడ్రసుకు అనుసంధానించి ఉంటుంది. దీని వల్ల కంప్యూటర్లు, అనుబంధ సేవలు నెట్‌వర్క్ లో ఎక్కడ ఉన్నాయో తెలుస్తుంది.[1] డొమైన్ నేమ్ సిస్టమ్ అనేది 1985 నుంచి అంతర్జాలంలో విడదీయరాని భాగంగా ఉంది.

పని తీరు

[మార్చు]

డొమైన్ నేమ్ సిస్టమ్ పనితీరు వివరించడానికి తరచుగా దీనిని అంతర్జాలపు ఫోన్ బుక్ (టెలిఫోన్ డైరెక్టరీ) గా పేర్కొంటారు. ఇది మనుషులకు అనుకూలమైన హోస్ట్ పేర్లను ఐ పీ అడ్రసులుగా మారుస్తుంది. ఉదాహరణకు example.com అనే డొమైన్ లో ఉండే www.example.com అనే హోస్ట్ పేరు 93.184.216.34 (IPv4), 2606:2800:220:1:248:1893:25c8:1946 (IPv6) అనే ఐపీ అడ్రసుల కింద మారుస్తుంది. DNS త్వరితంగా, పారదర్శకంగా మార్పు చెందవచ్చు. ఒకే హోస్ట్ పేరును ఉపయోగించడం కొనసాగించే వినియోగదారులను ప్రభావితం చేయకుండా నెట్‌వర్క్‌లోని సేవ యొక్క స్థానాన్ని మార్చడానికి వీలుకల్పిస్తుంది. కంప్యూటర్ వాస్తవానికి సేవలను ఎలా గుర్తిస్తుందో తెలియకుండానే అర్థవంతమైన యూనిఫాం రిసోర్స్ లొకేటర్‌లు (URLలు), ఈ-మెయిల్ చిరునామాలను ఉపయోగించినప్పుడు వినియోగదారులు దీని ప్రయోజనాన్ని పొందుతారు.

మూలాలు

[మార్చు]
  1. Wu, Hao; Dang, Xianglei; Wang, Lidong; He, Longtao (2016). "Information fusion-based method for distributed domain name system cache poisoning attack detection and identification". IET Information Security (in ఇంగ్లీష్). 10 (1): 37–44. doi:10.1049/iet-ifs.2014.0386. ISSN 1751-8717. S2CID 45091791.