Jump to content

తను నేను

వికీపీడియా నుండి
తను నేను
దర్శకత్వంపి.రామ్మోహన్
కథసాయి సుకుమార్
నిర్మాతపి.రామ్మోహన్
తారాగణంసంతోష్ శోభన్, అవికా గోర్, రవిబాబు, సత్యకృష్ణ
ఛాయాగ్రహణంసురేష్
సంగీతంసన్నీ ఎం.ఆర్
నిర్మాణ
సంస్థలు
సన్ షైన్ సినిమాస్
వయాకామ్ 18 పిక్చర్స్
విడుదల తేదీ
27 నవంబరు 2015 (2015-11-27)
దేశంభారతదేశం
భాషతెలుగు

తను నేను 2015లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం. సన్ షైన్ సినిమాస్ - వయాకామ్ 18 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి పి. రామ్మోహన్[1] దర్శకత్వం వహించాడు. సంతోష్‌ శోభన్[2], అవికా గోర్, రవిబాబు, సత్య కృష్ణన్ ముఖ్య పాత్రల్లో నటించారు.

కిరణ్ (సంతోష్ శోభన్) కాల్ సెంటర్ జాబ్ చేస్తూ సరదాగా జీవితాన్ని గడిపేసే కుర్రాడు. అతడికి అమెరికా అన్నా అక్కడుండే మన ఎన్నారైలన్నా అసహ్యం. అలాంటి వాడికి అమెరికా వెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్న కీర్తి (అవికా గోర్) పరిచయమవుతుంది. ఆమెను ప్రేమిస్తాడు. తనూ అతణ్ని ప్రేమిస్తుంది. ఐతే తన అమెరికా కలకు అడ్డం పడుతున్నాడన్న కారణంతో కిరణ్ పై పగబడతాడు కీర్తి తండ్రి బండ్రెడ్డి సర్వేశ్వరరావు (రవిబాబు). మరి కీర్తి తండ్రి కోరిక ప్రకారం అమెరికా వెళ్లిందా? లేక కిరణ్ కోసం ఇక్కడే ఉండిపోయిందా? ఇంతకీ బండ్రెడ్డి పరిస్థితి ఏంటి? అన్నదే ఈ చిత్ర కథ.[3]

నటీనటులు\ సినిమాలో పాత్ర పేరు

[మార్చు]
  • సంతోష్‌ శోభన్ - కిరణ్
  • అవికా గోర్ - కీర్తి
  • రవిబాబు - బండ్రెడ్డి సర్వేశ్వరరావు, కీర్తి తండ్రి
  • అభిషేక్ - నరేష్, కిరణ్ స్నేహితుడు
  • కిరీటి దమ్మరాజు
  • ఆర్‌.కె. మామ
  • రాజశ్రీనాయుడు

సాంకేతిక వర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Deccan Chronicle (18 November 2015). "Suresh Babu supports small film Thanu Nenu". Archived from the original on 23 ఏప్రిల్ 2021. Retrieved 23 April 2021.
  2. Mana Telangana (26 November 2015). "ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తను నేను". Archived from the original on 23 ఏప్రిల్ 2021. Retrieved 23 April 2021.
  3. The Times of India. "Thanu Nenu Movie Review {2/5}: Critic Review of Thanu Nenu by Times of India". Archived from the original on 23 April 2021. Retrieved 23 April 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=తను_నేను&oldid=4212342" నుండి వెలికితీశారు