తప్పాడ్
థప్పడ్ | |
---|---|
దర్శకత్వం | అనుభవ్ సిన్హా |
రచన | అనుభవ్ సిన్హా మృణ్మయీ లాగూ వైకుల్ |
నిర్మాత | భూషణ్‌కుమార్ కృష్ణన్ కుమార్ అనుభవ్ సిన్హా |
తారాగణం | తాప్సీ పన్ను దియా మీర్జా కుముద్ మిశ్రా రత్న పాఠక్ షా |
ఛాయాగ్రహణం | సౌమిక్ ముఖేర్జీ |
కూర్పు | యషా రాంచందని |
సంగీతం | బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ : మంగేశ్ థాకడే పాటలు: అనురాగ్ సాకియా |
నిర్మాణ సంస్థలు | బెనారస్ మీడియా వర్క్స్ టీ-సిరీస్ |
పంపిణీదార్లు | ఎఎ ఫిలిమ్స్ |
విడుదల తేదీ | 28 ఫిబ్రవరి 2020 |
సినిమా నిడివి | 142 నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | ₹21–24 కోట్లు[2] |
బాక్సాఫీసు | ₹43.77 కోట్లు[3] |
తప్పాడ్ 2020లో విడుదలైన హిందీ సినిమా. బెనారస్ మీడియా వర్క్స్, టీ - సిరీస్ బ్యానర్‌లపై భూషణ్‌కుమార్, కృష్ణన్ కుమార్, అనుభవ్ సిన్హా నిర్మించిన ఈ సినిమాకి అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించాడు. తాప్సీ పన్ను, దియా మీర్జా, కముద్ మిశ్రా, రత్నా పాఠక్ షా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 28న విడుదలైంది. ఈ సినిమా 2021లో ఏడు ఫిలింఫేర్ అవార్డులను అందుకుంది.[4]
కథ
[మార్చు]తాప్సి, పావిల్ గులాటిలు భార్యాభర్తలు. పావిల్ సామాన్య జీవితం అందరిలాగానే ఇంట్లో తన మాటే నెగ్గాలి అనుకునే రకం. పావిల్ కు ప్రమోషన్ వస్తుంది. అలా ప్రమోషన్ వచ్చినపుడు ఫారెన్ వెళ్లి అక్కడే సెటిల్ అవ్వాలని అనుకుంటారు. అదే సమయంలో అనుకోకుండా వీరు ఓ ఇంటికి శుభకార్యానికి వెళ్తారు. అక్కడ భార్య తాప్సి పై చేయి చేసుకుంటాడు , తాప్సి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కావడంతో భర్తకు విడాకులివ్వాలనే నిర్ణయం తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో సమాజం నుండి ఆమె ఎదుర్కున్న అనుభవాలేమిటి? అమృత తన పోరాటంలో ఎదురైన సవాళ్ళను ఏ విధంగా ఎదుర్కొంది అనేదే మిగతా సినిమా కథ.[5][6]
నటీనటులు
[మార్చు]- తాప్సీ పన్ను - అమృతా సబర్వాల్
- పావైల్ గులాటీ - విక్రమ్ సబర్వాల్, అమృత భర్త
- దియా మీర్జా - శివాని ఫోన్సెకాగా, అమృత స్నేహితురాలు
- మాయా సరావ్ - న్యాయవాది నేత్రా జైసింగ్
- గీతిక విద్యా ఓహ్లాన్ - సునీత
- కుముద్ మిశ్రా - సచిన్ సేథి, అమృత తండ్రి
- రత్న పాఠక్ షా - సంధ్యా సేథి, అమృత తల్లి
- తన్వి అజ్మీ - సులక్షణ సబర్వాల్, విక్రమ్ తల్లి
- రామ్ కపూర్ - ప్రమోద్ గుజ్రాల్, న్యాయవాది
- నైలా గ్రేవాల్ - స్వాతి సంధు
- అంకుర్ రాథీ - కరణ్ సేథి , అమృత సోదరుడు
- సుశీల్ దహియా - రోమేష్ సబర్వాల్, విక్రమ్ తండ్రి
- నిధి ఉత్తమ్ - కవితా సబర్వాల్, విక్రమ్ కోడలు
- సిద్ధాంత్ కర్నిక్ - విరాజ్ సబర్వాల్, విక్రమ్ సోదరుడు
- మానవ్ కౌల్ - రోహిత్ జైసింగ్, నేత్ర భర్త
- గ్రేసీ గోస్వామి - సానియా ఫోన్సెకా
- రోహన్ ఖురానా - ప్రియన్
- శంతను ఘటక్ - సుబోధ్
- హర్ష్ ఎ. సింగ్ - రాజహన్స్ జెట్లీ
- పూర్ణేందు భట్టాచార్య - థాపర్
- అనిల్ రస్తోగి - జస్టిస్ జైసింగ్, నేత్ర మామ
- మృతుంజయ్ దేవ్ నాథ్
మూలాలు
[మార్చు]- ↑ "Thappad (2020)". British Board of Film Classification. Retrieved 24 February 2020.
- ↑ "Thappad Box Office Collection Day 5". Amar Ujala. Retrieved 19 May 2020.
- ↑ "Thappad Box Office". Bollywood Hungama. Retrieved 20 March 2020.
- ↑ TV9 Telugu (28 March 2021). "రికార్డు క్రియేట్ చేసిన 'తప్పాడ్'.. మరోసారి ఉత్తమ నటిగా తాప్సీ." Archived from the original on 6 May 2022. Retrieved 6 May 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (28 February 2020). "తాప్సీ 'థప్పడ్' మూవీ రివ్యూ". Archived from the original on 6 May 2022. Retrieved 6 May 2022.
- ↑ Eenadu. "రివ్యూ: థప్పడ్". Archived from the original on 6 May 2022. Retrieved 6 May 2022.