తమిళ్ రాకర్స్ (వెబ్‌సిరీస్)
తమిళ్ రాకర్స్ 2022లో విడుదలైన వెబ్‌సిరీస్. ఏవిఏం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ గుహన్, అపర్ణ గుహన్ శ్యామ్ నిర్మించిన ఈ వెబ్‌సిరీస్ కు అరివఝుగన్ దర్శకత్వం వహించాడు.[1] అరుణ్ విజయ్, వాణి భోజన్, ఐశ్వర్య మీనన్, అళగమ్ పెరుమాళ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్‌సిరీస్ ఆగష్టు 19న సోని లివ్ ఓటీటీలో విడుదలైంది.[2]
కథ
[మార్చు]యాక్షన్ స్టార్ ఆదిత్య కథానాయకుడిగా నిర్మాత మది (అజగమ్ పెరుమాళ్) 300 కోట్లతో 'గరుడ' సినిమాను నిర్మిస్తాడు. ఈ సినిమా విడుదలతున్న సమయంలో తమిళ రాకర్స్ ఆ చిత్రంలోని కొన్ని వీడియో క్లిప్స్‌ను విడుదల చేసి అక్కడితో ఆగాక పూర్తి సినిమాను విడుదల చేస్తామని బెదిరిస్తారు. దింతో మది పోలీసులను ఆశ్రయిస్తాడు. ఈ కేసును పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని స్పెషల్ ఆఫీసర్ రుద్ర (అరుణ్ విజయ్) కి అప్పగిస్తారు. ఈ కేసుకు లింక్‌గా ఉండే సైబర్ క్రైమ్ టీమ్ సంధ్య (వాణి భోజన్)తో కలిసి రుద్ర తమిళ్ రాకర్స్ నెట్‌వర్క్‌ను పట్టుకున్నాడా ? లేదా అనేదే మిగతా కథ.[3]
నటీనటులు
[మార్చు]- అరుణ్ విజయ్[4]
- వాణి భోజన్
- ఐశ్వర్య మీనన్
- అళగమ్ పెరుమాళ్
- వినోదిని
- జి.మరిముత్తు
- తరుణ్ కుమార్
- వినోద్ సాగర్
- శరత్ రవి
- కాక్కముట్టై రమేష్
- కాక్కముట్టై విగ్నేష్
- అజిత్ జోషి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్:ఏవిఏం ప్రొడక్షన్స్
- నిర్మాత: అరుణ గుహన్, అపర్ణ గుహన్ శ్యామ్
- కథ: మనోజ్ కుమార్ కలైవానన్
- స్క్రీన్‌ప్లే & డైలాగ్స్ : మనోజ్ కుమార్ కలైవానన్, రాజేష్ మంజునాథ్
- దర్శకత్వం: అరివఝుగన్
- సంగీతం: వికాస్ బాడిస
- సినిమాటోగ్రఫీ: బి.రాజశేఖర్
- యాక్షన్ డైరెక్టర్ : స్టంట్ సిల్వా
- ఆర్ట్ డైరెక్టర్ : పిపి.శరవణన్
- ఎడిటర్: వీ.జ్.సాబు జోసెఫ్
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (14 August 2022). "పైరసీ వెబ్‌సైట్ కహానీ". Archived from the original on 20 August 2022. Retrieved 20 August 2022.
- ↑ Andhra Jyothy (13 August 2022). "తమిళ్ రాకర్స్ వస్తున్నారు" (in ఇంగ్లీష్). Archived from the original on 20 August 2022. Retrieved 20 August 2022.
- ↑ Eenadu (19 August 2022). "రివ్యూ: తమిళ్ రాకర్స్". Archived from the original on 20 August 2022. Retrieved 20 August 2022.
- ↑ Sakshi (12 August 2022). "పైరసీ సినిమాలు చూడకూడదు: హీరో అరుణ్ విజయ్". Archived from the original on 20 August 2022. Retrieved 20 August 2022.