తలుపులమ్మ లోవ
తలుపలమ్మ లోవ ఆలయం | |
---|---|
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 17°22′26″N 82°29′44″E / 17.3739°N 82.4955°E |
దేశం | భారత దేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కాకినాడ జిల్లా |
స్థలం | లోవ, |
సంస్కృతి | |
దైవం | తలుపలమ్మ తల్లి |
ముఖ్యమైన పర్వాలు | వార్షిక జాతర ఆషాడ మాస ఉత్సవాలు |
వాస్తుశైలి | |
నిర్మాణ శైలులు | ద్రావిడ శిల్పశైలి |
తలుపులమ్మ లోవ కాకినాడ జిల్లా, తుని మండలానికి చెందిన పుణ్యక్షేత్రం. [1][2] తునికి 5 కి.మీ దూరంలో పశ్చిమ దిశలో లోవకొత్తూరు దగ్గర ఉంది. ఇక్కడగల తలుపులమ్మ దేవాలయం, వృక్షసంపద కారణంగా ప్రముఖ పర్యాటక ఆకర్షణ.
రవాణా సౌకర్యాలు
[మార్చు]తుని నుండి సమీప గ్రామం లోవకొత్తూరు వరకూ బస్సు సౌకర్యం ఉంది. అక్కడి నుండి దేవాలయం వరకూ ఆటోలు, జీపులు, టాక్సీల సౌకర్యం కలదు.
తలుపులమ్మ దేవాలయం
[మార్చు]అమ్మవారు 'తలుపులమ్మ' గా ఆవిర్భవించిన క్షేత్రమే 'లోవ'. ఈ ప్రదేశం తలుపులమ్మ లోవగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు దట్టమైన అరణ్యంగా చెప్పబడుతోన్న ఈ ప్రాంతంలో ఎటుచూసినా కొండలు దర్శనమిస్తుంటాయి. ఈ కొండలలో ఒకదానిని 'ధారకొండ' గానూ మరొక దానిని 'తీగకొండ' గా స్థానికులు పిలుస్తుంటారు. ఈ రెండు కొండల మధ్య 'తలుపులమ్మ' అమ్మవారు దర్శనమిస్తూ వుంటుంది. తలపులను నెరవేర్చు అమ్మవారు కనుక తలుపులమ్మగా ప్రసిద్ధి చెందినట్టు స్థల పురాణం చెబుతోంది.
పురాణ గాథ
[మార్చు]కృతయుగంలో ఈ ప్రాంతానికి చేరుకున్న అగస్త్య మహర్షి, సంధ్యావందనం చేసుకోవాలనుకోగా ఎక్కడా నీటిజాడ కనిపించలేదు. దాంతో ఆయన జగన్మాతను ప్రార్థించగా, కొండపైన పాతాళగంగ పొంగింది. సంధ్యా వందనం పూర్తి చేసుకున్న అగస్త్యుడు, ఈ ప్రాంతంలోనే కొలువై ఉండమని అమ్మవారిని కోరడంతో, ఆయన అభ్యర్ధనమేరకు అమ్మవారు ఇక్కడి కొండగుహలో కొలువుదీరింది. కాలక్రమంలో అమ్మవారు భక్తుల కోరికలను నెరవేరుస్తూ తలుపులమ్మగా పూజాభిషేకాలు అందుకుంటోంది. ఇక్కడి అమ్మవారు సకల శుభాలను ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు.
చిత్రమాలిక
[మార్చు]-
తలుపులమ్మ లోవ ఆలయం ప్రవేశ ద్వారం
-
తలుపలమ్మ లోవ కొండ రహదారి
మూలాలు
[మార్చు]- ↑ Sacred and Protected Groves of Andhra Pradesh (in ఇంగ్లీష్). World Wide Fund for Nature--India, A.P. State Office. 1996.
- ↑ Hemingway, F. R. (2000). Godavari District Gazetteer (in ఇంగ్లీష్). Asian Educational Services. ISBN 978-81-206-1461-1.