లోవకొత్తూరు
స్వరూపం
లోవకొత్తూరు | |
|---|---|
గ్రామం | |
![]() | |
| అక్షాంశ రేఖాంశాలు: 17°21′25″N 82°30′18″E / 17.35694°N 82.50500°E | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | కాకినాడ |
| మండలం | తుని |
| అదనపు జనాభాగణాంకాలు | |
| • లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
| ప్రాంతపు కోడ్ | +91 ( ) |
లోవకొత్తూరు, కాకినాడ జిల్లా, తుని మండలానికి చెందిన గ్రామం. దీనికి సమీపంలో ప్రముఖ పర్యాటక క్షేత్రం తలుపులమ్మ లోవ ఉంది.
తలుపులమ్మ దేవాలయం
[మార్చు]అమ్మవారు 'తలుపులమ్మ' గా ఆవిర్భవించిన క్షేత్రమే 'లోవ'. ఈ ప్రదేశం తలుపులమ్మ లోవగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు దట్టమైన అరణ్యంగా చెప్పబడుతోన్న ఈ ప్రాంతంలో ఎటుచూసినా కొండలు దర్శనమిస్తుంటాయి. ఈ కొండలలో ఒకదానిని 'ధారకొండ' గానూ మరొక దానిని 'తీగకొండ' గా స్థానికులు పిలుస్తుంటారు. ఈ రెండు కొండల మధ్య 'తలుపులమ్మ' అమ్మవారు దర్శనమిస్తూ వుంటుంది. తలపులను నెరవేర్చు అమ్మవారు కనుక తలుపులమ్మగా ప్రసిద్ధి చెందినట్టు స్థల పురాణం చెబుతోంది.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ Sacred and Protected Groves of Andhra Pradesh (in ఇంగ్లీష్). World Wide Fund for Nature--India, A.P. State Office. 1996.
- ↑ "SRI TALUPULAMMATALLI AMMAVARU , LOVA , TUNI ,ANDHRA PRADESH | Commissioner and Director of Municipal Administration". cdma.ap.gov.in. Archived from the original on 2018-05-25. Retrieved 2025-05-05.
