Jump to content

తల్బినా

వికీపీడియా నుండి
తల్బినా

తల్బినా బార్లీ పిండికి పాలు, తేనె కలిపి చేసే అరబ్బీ వంటకం. ఇస్లామీయ సాంప్రదాయంలో మహమ్మద్ ప్రవక్తచే ప్రాముఖ్యం పొందింది. రోగి విచారాన్ని పోగొట్టే ఒక వంటకం. అయిషా (ప్రవక్త గారి భార్య ) బంధువుల్లో ఎవరైనా చనిపోతే స్త్రీలు చూడటానికి వచ్చితిరిగి ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళిపోయేవారు. ఆమె దగ్గరి బంధువులు,స్నేహితులు మాత్రమే ఉండిపోయేవారు.అప్పుడామె ఒక కుండడు తల్బినా వండించేవారు.గోధుమలు మాంసంతో తయారుచేసిన తరీద్ ను తల్బినా పై పోసేవారు."ఇక తినండి.తల్బినా రోగి విచారాన్ని పోగొడుతుంది మనసును ప్రశాంతపరుస్తుందని దైవప్రవక్త చెప్పేవారని అయిషా చెప్పారు.(బుఖారీ 7:328) శవం దగ్గర రోదిస్తూ శోషిల్లిన వారు ,రోగులూ తల్బినా తినాలని అయిషా చెప్పేవారు. తల్బినా రోగి హృదయానికి విశ్రాంతి నిచ్చి దాన్ని చైతన్యవంతంగా చేస్తుందని ,దుఖాన్ని విచారాన్ని పోగొడుతుందనీ దైవ ప్రవక్త చెప్పేవారని అయిషా చెప్పారు.(బుఖారీ 7:593) "తల్బినా తినండి" అని అయిషా ప్రోత్సహించేవారు."రోగికి ఇష్టముండదు గానీ భలే మేలుచేస్తుంది" అనేవారు అయిషా.(బుఖారీ 7:594)

"https://te.wikipedia.org/w/index.php?title=తల్బినా&oldid=3878451" నుండి వెలికితీశారు