తస్కిన్ అహ్మద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తస్కిన్ అహ్మద్
2016 లో తస్కిన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
తస్కిన్ అహ్మద్ తాజీమ్
పుట్టిన తేదీ (1995-04-03) 1995 ఏప్రిల్ 3 (వయసు 29)
Dhaka, Bangladesh
మారుపేరుTazim Jamil Chowdhury and Dhaka Express
ఎత్తు6 ft 2 in (188 cm)[1]
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 83)2017 జనవరి 12 - న్యూజీలాండ్ తో
చివరి టెస్టు2023 జూన్ 14 - Afghanistan తో
తొలి వన్‌డే (క్యాప్ 112)2014 జూన్ 17 - ఇండియా తో
చివరి వన్‌డే2023 సెప్టెంబరు 6 - పాకిస్తాన్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.3
తొలి T20I (క్యాప్ 43)2014 ఏప్రిల్ 1 - ఆస్ట్రేలియా తో
చివరి T20I2023 మార్చి 31 - ఐర్లాండ్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.3
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2011–presentDhaka Metropolis
2012–2013Chittagong Kings
2015–2017చిట్టగాంగ్ వైకింగ్స్
2018Kandahar నైట్స్
2019సిల్హెట్ సిక్సర్స్
2019/20రంగాపూర్ రేంజర్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ట్వంటీ20
మ్యాచ్‌లు 13 59 54
చేసిన పరుగులు 219 142 115
బ్యాటింగు సగటు 12.16 7.47 8.84
100s/50s 0/1 0/0 0/0
అత్యధిక స్కోరు 75 14 15*
వేసిన బంతులు 2,269 2,369 874
వికెట్లు 30 81 52
బౌలింగు సగటు 55.92 30.37 27.15
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 2 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 4/82 5/28 4/16
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 9/– 4/–
మూలం: ESPNcricinfo, 11 March 2023

తస్కిన్ అహ్మద్ తాజీమ్ (జననం 1994 ఏప్రిల్ 3) బంగ్లాదేశ్ క్రికెట్ ఆటగాడు . అతను కుడిచేతి ఫాస్టు బౌలరు, ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఫస్ట్-క్లాస్, లిస్టు A క్రికెట్‌లలో ఢాకా మెట్రోపాలిస్‌కు, రంగ్‌పూర్ రేంజర్స్ ఫ్రాంచైజీకీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వన్డేల్లో రంగప్రవేశం చేసి 5 వికెట్లు తీసిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా తస్కిన్ అహ్మద్ నిలిచాడు.

అంతర్జాతీయ కెరీర్[మార్చు]

రంగప్రవేశం[మార్చు]

మష్రాఫ్‌కు గాయం అవడంతో అతనికి జాతీయ జట్టు నుండి పిలుపు వచ్చింది.[2] అతను 2014 ఏప్రిల్ 1న తన తొలి T20I ఆడాడు. ఆ మ్యాచ్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ వికెట్ తీసుకున్నాడు.

2014 జూన్ 17న, అతను భారతదేశంపై మొదటి వన్‌డే ఆడుతూ, 5 వికెట్లు తీశాడు.

2017 జనవరి 12న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తరఫున టాస్కిన్ తన తొలి టెస్టు ఆడి, కేన్ విలియమ్సన్‌ను అవుట్ చేసి, తన తొలి టెస్టు వికెట్‌ను తీసుకున్నాడు. [3]


2014 సీజన్‌లో దేశీయ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకు 2015 క్రికెట్ ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టులో టాస్కిన్ ఎంపికయ్యాడు. ప్రపంచ కప్ గ్రూప్ దశలో అతను, ఆఫ్ఘనిస్తాన్‌పై ఒక వికెట్, స్కాట్లాండ్‌పై మూడు, ఇంగ్లండ్‌పై రెండు వికెట్లు తీసుకున్నాడు. మెల్‌బోర్న్‌లో ప్రపంచ కప్ క్వార్టర్-ఫైనల్లో బంగ్లాదేశ్ భారత్‌తో తలపడే అర్హత సాధించడంలో ఇతనికి చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. తస్కిన్ మళ్ళీ మూడు వికెట్లు తీసి మరోసారి ఆకట్టుకున్నాడు. ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. [4] వికెట్ పడిన తర్వాత తస్కిన్, మష్రాఫ్ ల మధ్య జరిగిన "చెస్ట్-బంప్" అనే వేడుకను క్రికెట్‌కంట్రీ.కామ్ ప్రపంచ కప్‌లో మరపురాని క్షణాలలో ఒకటిగా నామినేట్ చేసింది. [5]

బౌలింగు వేగం[మార్చు]

తస్కిన్ ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బౌలర్. 2021 T-20 ప్రపంచ కప్ సమయంలో, టాస్కిన్ ఒక మ్యాచ్‌లో 150+కిమీ/గం, [6] వేగంతో వేశాడు. 2001లో హామిల్టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సమయంలో 140 కిమీ/గం. వేగంతో బౌలింగు చేసాడు.[6] [7]

వ్యక్తిగత జీవితం[మార్చు]

తస్కిన్, వ్యాపారవేత్త అబ్దుర్ రషీద్, సబీనా యాస్మిన్‌ల కుమారుడు. [8] టాస్కిన్ కింగ్ ఖలేద్ ఇన్‌స్టిట్యూట్ నుండి SSC, స్టాంఫోర్డ్ కళాశాల నుండి HSC పూర్తి చేసాడు. [9] ఆ తర్వాత అమెరికన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ-బంగ్లాదేశ్ (AIUB)లో చదువుకున్నాడు. [10]

2017 నవంబరులో, తస్కిన్ తన చిన్ననాటి స్నేహితురాలు సయేదా రబేయా నయీమ్‌ని వివాహం చేసుకున్నాడు. [11] 2018 సెప్టెంబరు 30న, వారి మొదటి బిడ్డ తష్ఫీన్ అహ్మద్ రిహాన్ జన్మించాడు. [12] [13]

మూలాలు[మార్చు]

  1. Panwar, Daksh (17 June 2015). "Taskin Ahmed: A tall, ఫాస్ట్ and handful poster-boy". The Indian Express. But the hyperbole — and it's not a hyperbole by much; he is 6'2″ — is understandable.[permanent dead link]
  2. "Mashrafe out, Taskin set for debut". Dhaka Tribune. 31 March 2014. Retrieved 10 November 2021.
  3. "Bangladesh tour of New Zealand, 1st Test: New Zealand v Bangladesh at Wellington, Jan 12–16, 2017". ESPN Cricinfo. Retrieved 29 December 2016.
  4. "RECORDS / ICC CRICKET WORLD CUP, 2014/15 / MOST WICKETS". ESPNcricinfo. Retrieved 10 November 2021.
  5. "ICC Cricket World Cup 2015: Top 10 most memorable moments". cricketcountry.com. Retrieved 20 November 2021.
  6. 6.0 6.1 "Mashrafe still holds Bangladeshi bowler's fastest delivery record". Bangladesh Sangbad Sangstha. Retrieved 24 May 2020.
  7. "Mashrafe Mortaza fastest bowler 148 kph". Daily Naya Diganta. Retrieved 24 May 2020.
  8. "`Happy Birthday` Taskin". Daily Bangladesh (in ఇంగ్లీష్). Retrieved 2021-07-09.
  9. "Happy Birthday Taskin Ahmed". 3 April 2019.
  10. "Taskin ties the knot". The Daily Star. 1 November 2017.
  11. "Taskin Ahmed Gets Married, Fans Troll Him And Wife". NDTV.
  12. "Imrul and Taskin become fathers of boys". NTV. 30 September 2018. Retrieved 31 March 2021.
  13. "Bangladesh cricketers greet fans on Eid". Prothom Alo. 1 August 2020. Retrieved 31 March 2021.