తాంబూలము

వికీపీడియా నుండి
(తాంబూలాలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
తాంబూలంలో వాడే వస్తువులు

తాంబూలం తమలపాకు, సున్నం, వక్క, కాచు, ఏలకులు మొదలైన సుగంధ ద్రవ్యాలతో దీనిని తయారుచేస్తారు. భోజనానంతరము దీనిని సేవించటం భారత సంస్కృతిలో ఒక భాగం. దీన్ని విడెము అని కూడా అంటారు. తాంబూలాన్ని కిళ్ళీ అని, పాన్ అని, బీడా అనీ కూడా వివిధ ప్రాంతాల్లో అంటారు.

తాంబూలంలో వాడే వస్తువులు

[మార్చు]

తాంబూలంలో ప్రధానంగా తమలపాకులు, వక్క సున్నం ఉంటాయి. ఇవి అనివార్యంగా ఉండే పదార్థాలు కాగా, తమతమ అభిరుచుల మేరకు అనేక ఇతర అధరువులను కూడా వాడుతూంటారు. వీటిలో జాజికాయ, జాపత్రి, పచ్చ కర్పూరం, కస్తూరి, కుంకుమ పువ్వు, పుదీనా, కొబ్బరి తురుము వగైరా వస్తువులున్నాయి.[1]

ఆరోగ్యానికి

[మార్చు]

శరీరానికి తాంబూల సేవనం ఉపయోగకరమైనది. ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఎ విటమిన్. సి.విటమిన్ లు తమలపాకులో పుష్కలంగా ఉన్నాయి. [2]

సారస్వతంలో, సంస్కృతిలో

[మార్చు]
  • దేవుడికి ఇచ్చే తాంబూల నైవేద్యంలో మూడు తమలపాకులు, రెండు వక్కలు, సున్నం ఉంచి సమర్పిస్తారు
  • ఆంజనేయస్వామికి ఆకుపూజ పరమ ప్రీతి అని ప్రజల నమ్మకం.[3]
  • పూర్వం యుద్ధాలకు వెళ్ళే సమయంలో తాంబూలాలు ఇచ్చి పంపేవారు.
  • శుభ సందర్భాలలో అతిథులకు రెండు తమలపాకులు, వక్క (ముక్కలు గానీ మొత్తంగా గానీ) కొబ్బరికాయ ఇవ్వడం ఒక సంప్రదాయం.
  • సంబంధ బాంధవ్యాలను కలుపుకునే సందర్భాల్లో తాంబూలాలు పరస్పరం ఇచ్చి పుచ్చుకోవడం ఆనవాయితీ.
  • చిలకలు చుట్టి భార్య భర్తకు అందివ్వడం తెలుగువారి సంస్కృతిలో సంప్రదాయంలో భాగం. తమలపాకులను భార్య తన చేతివేళ్ళకు కిరీటాల్లాగా తొడిగి, భర్తకు అందిస్తే భర్త ఒక్కోదాన్నీ నోటితో అందుకోవడం ఈ సంప్రదాయం
  • పెద్దనామాత్యుడు "నిరుపహతి స్థలంబు రమణీ ప్రియ దూతిక అందించు కప్పుర విడెము" అనే పద్యంలో, కవిత్వం రాయాలంటే ఉండాల్సిన అంశాల్లో కర్పూర తాంబూలం (కప్పుర విడెము) కూడా ఒకటని పేర్కొన్నాడు.
  • కిళ్ళీ విశిష్టతను తెలియజేస్తూ యుగంధర్ అనే సినిమాలో "ఓరబ్బా ఏసుకున్నా కిళ్ళీ" అనే పాట ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "ఆకులు, వక్కలు... ఆనవాయితీలు". www.eenadu.net. Archived from the original on 2020-08-29. Retrieved 2020-08-29.
  2. "తాంబూలంలోనే కాదు… వైద్యరంగంలో కూడా తమలపాకుకు అగ్రస్థానమే | | V6 Velugu". సమయం (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-11-08. Archived from the original on 2020-08-29. Retrieved 2020-08-29.
  3. "తాంబూలం వ‌ల్ల ఉప‌యోగం.. ప్రాధాన్య‌త ఏమిటి?". Samayam Telugu. Archived from the original on 2020-08-29. Retrieved 2020-08-29.
"https://te.wikipedia.org/w/index.php?title=తాంబూలము&oldid=3262608" నుండి వెలికితీశారు