తాడిగుడ జలపాతం
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
తాడిగుడా
తాడిగుడ జలపాతం అనంతగిరి జలపాతం | |
---|---|
ప్రదేశం | అనంతగిరి, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
అక్షాంశరేఖాంశాలు | 18°17′14″N 83°6′43″E / 18.28722°N 83.11194°E |
రకం | Plunge |
మొత్తం ఎత్తు | 100 అ. (30 మీ.) |
పొడవైన బిందువు | 100 అ. (30 మీ.) |
తాడిగుడ జలపాతం, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా, అనంతగిరి వద్ద నున్న ఒక అద్భుతమైన జలపాతం పర్యాటక ప్రదేశం.[1]
నేపధ్యం
[మార్చు]ఈ జలపాతాన్ని అనంతగిరి జలపాతం అని కూదా పిలుస్తారు. దాదాపు 200 అడుగుల ఎత్తు నుండి దుమికే జలపాతం సందర్శకులకు కనువిందు చేస్తుంది.[2] ఈ జలపాతాన్ని సందర్శించుటకు అనువైన సమయం వర్షాకాలము. అనంతగిరి నుండి ఈ జలపాతం వరకు నడుచుకుంటూ కానీ లేదా పర్వతారోహణ చేసి కానీ చేరుకోవచ్చు. ఈ జలపాతం అనంతగిరి, అరకు లోయ ప్రధాన రహదారి నుండి దాదాపు 1 - 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అనంతగిరి నుండి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రధాన రహదారి నుండి జలపాతాన్ని కలిపే రహదారి చాలా చిన్నగానూ, గతుకులమయముగా ఉంది. సాధారణ వాహనాలు ఈ మార్గములో ప్రయాణించవలెనంటే కొద్దిగా ప్రయాసతో కూడుకున్న పని. అదే విలాస వాహనాలలో అయితే ప్రయాణం సుఖవంతముగా కొనసాగుతుంది. కావున ఈ జలపాతమును నడక ద్వారా చేరుకొనుట ఉత్తమమైన పని. 20 నిమిషాల నడకతో అనంతగిరి నుండి ఇక్కడికి చేరుకోవచ్చును. ఈ మార్గము ఎత్తుపల్లములో కాకుండా నేరుగా ఉండుటవలన ఎవరైనా ఈ మార్గములో సులభముగా నడయాడవచ్చును.[3]
ఈ జలపాతం వద్దనున్ను రాళ్ళు నున్నగా ఉండి, పాచిపట్టి ఉంటాయి. అందువలన వాటిపైకి ఎక్కేటపుడు జారి పడే ప్రమాదం ఉంది. అలాగే ఇక్కడి నీటిలో సందర్శకులు ఈదవచ్చు. కానీ ఇక్కడి నీరు మురికిగా ఉంటాయి. కావున ఈదకపోవడమే సురక్షితము.
ఎంత దూరం
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "పర్యాటక ప్రాంతాలు కళకళ". www.andhrajyothy.com. 2019-10-13. Retrieved 2020-02-03.[permanent dead link]
- ↑ Eenadu. "తెలుగింటిమింటి ధారలు - EENADU". www.eenadu.net. Archived from the original on 2020-02-03. Retrieved 2020-02-03.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-10-16. Retrieved 2016-10-18.