తాళ్ళపాక చిన తిరు వేంగళనాథుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గమనిక: విషయం సరి చూడాలి. "చిన తిరువేంగళనాధుడు", "చిన తిరుమలాచార్యుడు" వివరాలు కలగలిసినట్లున్నాయి.

తాళ్ళపాక చిన్నన్నగా పేరొందిన తాళ్ళపాక చిన తిరు వేంగళనాథుడు, తాళ్ళపాక అన్నమయ్య మనుమడు.

అన్నమయ్య వంశం తెలుగు సాహిత్యానికి ఆభరణం. అన్నమయ్య భార్య తిమ్మక్క తెలుగులో తొలి కవయిత్రి. "సుభద్రా కళ్యాణం" మంజరి ద్విపద కావ్యం రచించింది. ఈమె కుమారుడు నరసింహుడు సంగీత సాహిత్య కళా కోవిదుడు. నరసింగన్న భార్యలు నాచ్చారమ్మ, అనంతమ్మ. వారి పుత్రులు నారాయణుడు, అప్పలార్య, అన్నలార్య.

తిరుమలాచార్యుడు తండ్రి వలెనే సంకీర్తనా యజ్ఞం నిర్వహించాడు. ఇతని ఆధ్యాత్మ శృంగార సంకీర్తనలతో పాటు మరికొన్ని లఘురచనలు లభించాయి. ఇతని భార్య తిరుమలమ్మ. వారి కొడుకులు చిన తిరుమలయ్య, అన్నయ్య, పెదతిరువెంగళ నాధుడు, చినతిరువెంగళనాధుడు (చిన్నయ్య లేదా చిన్నన్న) , కోనేటి తిరువేంగళనాధుడు. చినతిరుమలయ్య తన తండ్రి, తాతలవలెనే ఆధ్యాత్మ, శృంగార సంకీర్తనలు రచించాడు. ఇంకా అష్టభాషా దండకం, సంకీర్తన లక్షణం (తండ్రి, తాతల సంస్కృత రచనలకు అనువాదం) వ్రాశాడు.

ఇలా తాళ్ళపాక కవులు తెలుగు భాషకు, ప్రత్యేకించి పదకవితకు, ద్విపద కవితకు ఎనలేని సంపదను ఒనగూర్చారు.

చిన్నన్న ద్విపద కరగును,
పన్నుగ పెద తిరుమలయ్య పదమునకెరగున్,
మిన్నంది మొరసె నరసింగన్న పద్య గద్య శ్రేణిన్"

అని తెనాలి రామకృష్ణుని చాటువు.

తాళ్ళపాక చిన్నన్న ఎనిమిది భాషలలో పండితుడు. ఇతని రచనలు

  1. శృంగార సంకీర్తనలు
  2. సంకీర్తన లక్షణము
  3. అష్టబాషా దండకము
  4. ఉషా పరిణయము
  5. అష్టమహిషీ కళ్యాణము
  6. పరమయోగి విలాసము
  7. అన్నమాచార్య చరిత్రము

తాళ్లపాక వంశవృక్షం[మార్చు]


మూలాలు[మార్చు]

  • సరస కమనీయ సాహితీమూర్తి - తాళ్ళపాక చిన్నన్న, ఆచార్య కె.జె.కృష్ణమూర్తి, 150 వసంతాల వావిళ్ల వాజ్మయ వైజయంతి.

బయటి లింకులు[మార్చు]

ఇంటర్నెట్ ఆర్చీవులలో లభిస్తున్న రచనలు