తాసిల్దార్ (సినిమా)

వికీపీడియా నుండి
(తాహసీల్దార్ (సినిమా) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
తాసిల్దార్
(1944 తెలుగు సినిమా)
దర్శకత్వం వై.వి.రావు
నిర్మాణం వై.వి.రావు
కథ వై.వి.రావు
తారాగణం భానుమతి (కమల పాత్ర),
డి.హేమలతాదేవి,
కమల కోట్నిస్ (రజని పాత్ర),
బలిజేపల్లి లక్ష్మీకాంతం,
చదలవాడ నారాయణరావు,
బి.ఆర్.పంతులు,
బెజవాడ రాజారత్నం,
వై.వి.రావు,
ఎమ్.ఎస్.రామారావు
సంగీతం హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి
గీతరచన బలిజేపల్లి లక్ష్మీకాంతం,
నండూరి సుబ్బారావు
సంభాషణలు బలిజేపల్లి లక్ష్మీకాంతం
ఛాయాగ్రహణం పురుషోత్తమ్
నిర్మాణ సంస్థ జగదీష్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తాసిల్దార్ 1944 సంవత్సరంలో విడుదలై ఆర్థికంగా ఘన విజయం సాధించిన తెలుగు సినిమా. దీనిని జగదీష్ పతాకంపై దర్శకుడు వై.వి.రావు నిర్మించాడు.

సంక్షిప్త చిత్రకథ

[మార్చు]

హీరో నరసయ్య ఒక తహసీల్దారు (నారాయణరావు). సామాన్య కుటుంబానికి చెందిన కమల (భానుమతి) ని పెళ్ళిచేసుకుంటాడు. ఆమె ఫ్యాషన్లకు, ఇంగ్లీషు భాషకు దూరం. లేనిపోని ఆడంబరాలకు పోయే తాసిల్దార్ తన పేరు తారాలేగా మార్చుకొని పాశ్చాత్య నాగరికతతో ప్రభావితమైన రజని (కమలా కోట్నిస్) పట్ల ఆకర్షితుడౌతాడు. ఒక ఫంక్షన్ లో కమల మన సాంప్రదాయం ప్రకారం ప్రవర్తించడంతో నవ్వుల పాలైన తాసిల్దార్ రజనిని రెండో భార్యగా ఇంటికి తీసుకొస్తాడు. అక్కడినుండి ఇద్దరు భార్యల మధ్య ఘర్షణ మొదలౌతుంది. డబ్బుపట్ల మోజుతో హీరో పంచన చేరిన రజనివల్ల తాసిల్దార్ ప్రభుత్వపరమైన చిక్కుల్లో పడతాడు. తర్వాత కామేశం (వై.వి.రావు) అనే స్నేహితుని హితబోధతో కళ్ళు తెరిచి పొరపాటును గ్రహించిన తాసిల్దార్ భార్య విలువను గుర్తిస్తాడు.

పాటలు

[మార్చు]
  1. అహా ఏమందునే చినవదినా నీ నిక్కు నీ టెక్కు - కె. జమునారాణి
  2. ఈ రేయి నన్నొలనేరవా రాజా యెన్నెలల సొగసంతా (యెంకి పాట) - ఎం. ఎస్. రామారావు
  3. మావారు తాసిల్దార్ కొదువలు తీరె కోరికలూరె - పి.భానుమతి
  4. ప్రేమలీలా మోహనకలశి చేకొనుమా కలశి - ఎం. ఎస్. రామారావు

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]