తిప్పల నాగిరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిప్పల నాగిరెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం
నియోజకవర్గం గాజువాక నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1954
వెంకన్నపాలెం గ్రామం, పెదగంట్యాడ, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు తిప్పల అప్పలస్వామి
జీవిత భాగస్వామి రాధ
సంతానం కవిత, వంశీరెడ్డి, దేవన్‌రెడ్డి

తిప్పల నాగిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

తిప్పల నాగిరెడ్డి 1954లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, పెదగంట్యాడ, వెంకన్నపాలెం గ్రామంలో జన్మించాడు. ఆయన ఇంటర్మీడియట్‌ వరకు చదువుకున్నాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

తిప్పల నాగిరెడ్డి రాజకీయాల్లోకి రాకముందు వీఏఓగా పనిచేస్తూ ఆ వ్యవస్థను రద్దు చేయడంతో 1984లో కాంగ్రెస్‌ పార్టీలో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి, విశాఖ గ్రామ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా, వీఏవో సంఘం ప్రధాన కార్యదర్శిగా పని చేశాడు. ఆయన 2007 మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాడు.

తిప్పల నాగిరెడ్డి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచాడు. ఆయన అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. తిప్పల నాగిరెడ్డి 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ పై 16753 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.
  2. Sakshi (18 March 2019). "వైఎస్సార్‌సీపీ దళపతులు". Archived from the original on 19 January 2022. Retrieved 19 January 2022.
  3. The New Indian Express (27 May 2019). "Jagan wave helped me trump Pawan, says 'local hero' Nagireddy". Archived from the original on 17 November 2020. Retrieved 7 January 2022.
  4. Sakshi (22 March 2019). "అజ్ఞాతవాసా.. అజాతశత్రువా.. మీకు ఎవరు కావాలి?". Archived from the original on 7 January 2022. Retrieved 7 January 2022.