Jump to content

తిరుచ్చి స్వామినాథన్ అయ్యర్

వికీపీడియా నుండి
తిరుచ్చి స్వామినాథన్ అయ్యర్
జననం1910
తమిళనాడు రాష్ట్రం, తిరుచిరాపల్లి
వృత్తికర్ణాటక గాత్ర సంగీత విద్వాంసుడు, సంగీత గురువు

తిరుచ్చి స్వామినాథన్ అయ్యర్ కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసుడు.

విశేషాలు

[మార్చు]

ఇతడు తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి నగరంలో 1910లో జన్మించాడు. ఇతడు తన తండ్రి తిరువయార్ సుబ్రహ్మణ్య అయ్యర్ నుండి సంగీతం నేర్చుకున్నాడు. 1926లో ఇతడు తన మొదటి కచేరీ ఇచ్చాడు. అది మొదలు ఇతను అనేక సంగీత ప్రదర్శనలు ఇచ్చాడు. ఇతడు అరుదైన త్యాగరాజ కృతులను ఆలపించడంలో పేరు గడించాడు. ఇతడు గాత్ర సంగీతం ఆలపించడంతో పాటుగా సంగీత శిక్షకుడిగా వృత్తిని స్వీకరించాడు. ఇతడు అనేకమంది శిష్యులకు సంగీతం నేర్పించాడు. 1987లో తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రం ఇతనికి కళైమామణి పురస్కారం ప్రకటించింది. 1993లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇతడికి కర్ణాటక సంగీతం గాత్రం విభాగంలో అవార్డును బహూకరించింది[1].

మూలాలు

[మార్చు]
  1. web master. "Trichy Swaminathan Iyer". SANGEET NATAK AKADEMI. Government of India. Archived from the original on 4 ఆగస్టు 2020. Retrieved 19 February 2021.