తిరుపతి - జమ్ము తావి హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరుపతి - జమ్ము తావి హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంహమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్
తొలి సేవ15 జూన్ 2017; 6 సంవత్సరాల క్రితం (2017-06-15)
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ మధ్య రైల్వే
మార్గం
మొదలుతిరుపతి (TPTY)
ఆగే స్టేషనులు12
గమ్యంజమ్ము తావి (JAT)
ప్రయాణ దూరం2,985 km (1,855 mi)
సగటు ప్రయాణ సమయం51 గం. 55 ని.లు
రైలు నడిచే విధంవీక్లీ[a]
సదుపాయాలు
శ్రేణులుఎసి 3 టైర్
కూర్చునేందుకు సదుపాయాలులేదు
పడుకునేందుకు సదుపాయాలుఉంది
ఆహార సదుపాయాలుఉంది
చూడదగ్గ సదుపాయాలుLarge windows
వినోద సదుపాయాలులేదు
సాంకేతికత
రోలింగ్ స్టాక్2
పట్టాల గేజ్బ్రాడ్ గేజ్
వేగం57 km/h (35 mph) విరామములతో సగటు వేగం

తిరుపతి - జమ్ము తావి హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు యొక్క పూర్తిగా 3-టైర్ ఎసి స్లీపర్ బోగీలు కలిగిన రైలు. ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి ని, జమ్మూ, కాశ్మీర్‌లోని జమ్మూ తావిని కలుపుతుంది. ఇది ప్రస్తుతం వారాంతములో (వీక్లీ బేసిస్) 22705/22706 రైలు నంబర్లతో నడుపుతున్నారు. [1][2]

సర్వీస్[మార్చు]

  • రైలు నం. 22705 / తిరుపతి - జమ్ము తావి హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం ప్రారంభమవుతుంది. ఇది 56 కి.మీ/గం. సరాసరి వేగంతో 2985 కి,మీ, దూరాన్ని గం.51 : 50 ని.లలో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది.
  • రైలు నం. 22706 / జమ్ము తావి - తిరుపతి హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం ప్రారంభమవుతుంది. ఇది 55 కి.మీ./గం. సరాసరి వేగంతో 2985 కి,మీ, దూరాన్ని గం. 53 : 55 ని.లలో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది.

ప్రయాణ మార్గం[మార్చు]

ఈ హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌(22705) ప్రతి మంగళవారం సాయంత్రం గం.5.10 ని.కి తిరుపతి నుంచి బయల్దేరి గురువారం రాత్రి గం.9.10 ని.కి జమ్ము తావి చేరుకుంటుంది. తిరుపతి నుంచి రేణిగుంట, రాజంపేట, కడప, తాడిపత్రి, గుత్తి, గుంతకల్, ఆదోనీ, మంత్రాలయం రోడ్డు, రాయచూర్‌ మీదుగా సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. అక్కడ్నుంచి ఖాజీపేట, రామగుండం, నాగపూర్, ఢిల్లీ, అంబాలా, లూథియానా, మీదుగా జమ్ముతావి వెళుతుంది.

బోగీలు[మార్చు]

రైలు, స్టేషన్ల గురించి సమాచారాన్ని చూపించడానికి ఎల్‌ఈడి స్క్రీన్ ప్రదర్శన యొక్క లక్షణాలతో భారతీయ రైల్వేలు రూపొందించిన పూర్తిగా 3-టైర్ ఎసి ఎల్‌హెచ్‌బి కోచ్లు, రైలు వేగం మొదలైనవి, ప్రకటన వ్యవస్థ ఉంటుంది. ఇది టీ, కాఫీ, పాలు, వెండింగ్ యంత్రాలు, కంపార్ట్మెంట్లో బయో టాయిలెట్లను కూడా, సిసిటివి కెమెరాలు కలిగి ఉంది.

కూర్పు[మార్చు]

ఈ రైలులో పదహారు ఎసి III టైర్ కోచ్లు, ఒక ప్యాంట్రీ కార్, రెండు జెనరేటర్ పవర్ కార్ కోచ్లు ఉంటాయి.

  • 16 ఎసి III టైర్
  • 1 ప్యాంట్రీ కార్
  • 2 జనరేటర్ పవర్ కార్

లోకో లింకు[మార్చు]

ఈ రైలు లాలాగూడా లోకో షెడ్ యొక్క డబ్ల్యుఎపి-4 లేదా డబ్ల్యుఎపి-7 ఇంజను ద్వారా లాగబడుతుంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

నోట్స్[మార్చు]

  1. Runs once in a week for every direction.

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-03-27. Retrieved 2018-05-25.
  2. http://www.indianrail.gov.in/mail_express_trn_list.html

బయటి లింకులు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]