తిరువాయిపాటి వెంకయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డాక్టర్ తిరువాయిపాటి వెంకయ్య

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1989 - 1994
ముందు జే.ఆర్. పుష్పరాజ్
తరువాత జి.ఎం.ఎన్.వి. ప్రసాద్
నియోజకవర్గం తాడికొండ నియోజకవర్గం

ఎమ్మెల్యే

వ్యక్తిగత వివరాలు

జననం 1929
పొన్నూరు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
మరణం 2021 ఆగస్టు 19
పొన్నూరు, గుంటూరు జిల్లా
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
నివాసం పొన్నూరు, గుంటూరు జిల్లా
వృత్తి రాజకీయ నాయకుడు

తిరువాయిపాటి వెంకయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1989లో తాడికొండ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

రాజకీయ జీవితం[మార్చు]

డాక్టర్ టి. వెంకయ్య కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1981 నుండి 86 వరకు పొన్నూరు సమితి అధ్యక్షుడిగా, 1987 నుండి 88 వరకు పొన్నూరు మున్సిపల్ ఛైర్మన్‌గా పని చేశాడు. ఆయన 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1991 నుండి 94 వరకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కార్పొరేషన్ ఛైర్మన్​గా పని చేసి 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోపాటి చేసి ఓడిపోయాడు.

మరణం[మార్చు]

టి. వెంకయ్య అనారోగ్యంతో బాధపడుతూ 2021 ఆగస్టు 19న గుంటూరు జిల్లా పొన్నూరులోని ఆయన స్వగృహంలో మరణించాడు.[1][2]

మూలాలు[మార్చు]

  1. Andhra Jyothy (20 August 2021). "తాడికొండ మాజీ ఎమ్మెల్యే వెంకయ్య మృతి" (in ఇంగ్లీష్). Retrieved 7 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. Eenadu (20 August 2021). "మాజీ ఎమ్మెల్యే వెంకయ్య కన్నుమూత". Retrieved 7 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)