తిరువేంగడు ఎ.జయరామన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరువేంగడు ఎ.జయరామన్
వ్యక్తిగత సమాచారం
జననం(1933-09-06)1933 సెప్టెంబరు 6
మరణం2007 మార్చి 28(2007-03-28) (వయసు 73)
సంగీత శైలికర్ణాటక సంగీతం (గాత్రం)
వృత్తిగాయకుడు

తిరువేంగడు ఎ.జయరామన్ ఒక కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసుడు[1].

విశేషాలు[మార్చు]

ఇతడు తమిళనాడు రాష్ట్రంలోని శీర్కాళి సమీపంలోని తిరువేంగడు గ్రామంలో 1933, సెప్టెంబరు 6వ తేదీన జన్మించాడు. ఇతడు తొలుత మేళత్తూర్ స్వామినాథ దీక్షితార్ వద్ద, తరువాత మదురై మణి అయ్యర్ వద్ద, వెంబర్ అయ్యర్ వద్ద సంగీత శిక్షణ తీసుకున్నాడు. మదురై మణి అయ్యర్ వద్ద 20 సంవత్సరాలపాటు గురుకుల పద్ధతిలో సంగీతం అభ్యసించాడు. ఇతడు కల్పనా స్వరాలను ఆలపించడంలో దిట్ట అనిపించుకున్నాడు. ఇతడు గాత్రవిద్వాంసుడే కాక పండితుడు కూడా. భారతదేశం నలుమూలలా తిరిగి సంగీత విషయాలపై అనేక ప్రసంగాలు చేశాడు.ఇతడు ఆకాశవాణిలో ఏ-గ్రేడు కళాకారుడిగా సేవలందించాడు. ఇతని కుమారుడు తిరువేంగడు జె.వెంకటరామన్ మృదంగ కళాకారుడు.

పురస్కారాలు[మార్చు]

జయరామన్ తన సంగీతప్రయాణంలో ఎన్నో అవార్డులు, గుర్తింపులు పొందాడు. కంచి కామకోటి పీఠం ఇతడిని 1997లో ఆస్థాన విద్వాంసునిగా నియమించింది. 2004లో బ్రహ్మజ్ఞానసభ, చెన్నై ఇతడికి జ్ఞానపద్మ పురస్కారాన్ని ఇచ్చింది. 2005లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇతడికి కర్ణాటక సంగీతం గాత్ర విభాగంలో సంగీత నాటక అకాడమీ అవార్డును ఇచ్చింది.

మరణం[మార్చు]

ఇతడు చెన్నైలో 2007, మార్చి 28వ తేదీన మరణించాడు.[2]

మూలాలు[మార్చు]

  1. web master. "Tiruvengadu A. Jayaraman". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Archived from the original on 10 ఆగస్టు 2020. Retrieved 24 February 2021.
  2. web master. "Vocalist Thiruvengadu Jayaraman passes away 28 March 2007". kutcheri buzz. Archived from the original on 3 డిసెంబరు 2021. Retrieved 24 February 2021.