Jump to content

తిలోత్తమ (సినిమా)

వికీపీడియా నుండి
తిలోత్తమ
(1951 తెలుగు సినిమా)
దర్శకత్వం మీర్జాపురం రాజా
నిర్మాణం మీర్జాపురం రాజా
తారాగణం అంజలీదేవి,
అక్కినేని నాగేశ్వరరావు,
సూర్యప్రభ
నిర్మాణ సంస్థ శోభనాచల పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తిలోత్తమ 1951, ఫిబ్రవరి 16న విడుదలైన తెలుగు జానపద సినిమా. మీర్జాపురం రాజా దర్శకత్వంలో ఈ సినిమా శోభనాచల పిక్చర్స్ బేనర్‌పై నిర్మించబడింది. అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, సూర్యప్రభ నటించిన ఈ చిత్రానికి సంగీతం పి. ఆదినారాయణరావు సమకూర్చారు.[1] పేరుకు రాజాగారే దర్శకులైన తెర వెనుక అధిక భాగం సహాయాన్నందించింది చిత్రపు నారాయణమూర్తి. ఇదే రోజు ఆకాశరాజు అనే జానపద సినిమా కూడా విడుదలైంది.

ఈ సినిమాలో రెండు ప్రధాన పాత్రలు పోషించిన అంజలీదేవి, సూర్యప్రభ గార్ల భర్తలు రెండు కీలకమైన సాంకేతిక శాఖల్ని నిర్వహించడం విశేషం. అంజలీదేవి గారి భర్త ఆదినారాయణరావు గారు సంగీత దర్శకుడైతే, సూర్యప్రభ గారి భర్త వేదాంతం రాఘవయ్య నృత్య దర్శకునిగా పనిచేసాడు. సూర్యప్రభ గారి అక్కయ్య పుష్పవల్లి కూడా ఒక చిన్న పాత్రలో నటించింది.

నటీనటులు

[మార్చు]
  • అంజలీదేవి - తిలోత్తమ
  • అక్కినేని నాగేశ్వరరావు - దేవదత్తుడు
  • సదాశివరావు - చంద్రకాంత్
  • ఎం. కొండయ్య - గణపతి
  • సుందరరావు - సూరసేన
  • రామమూర్తి - వెంకటేశం
  • ఆదిశేషయ్య - మంత్రి
  • బాజ్జీ - లంబు
  • ఇమామ్‌ - జంబు
  • కృష్ణన్ - పింగళ
  • పి.ఎం.నాయుడు - ఆఫీసరు
  • సూర్యప్రభ - వసంతసేన
  • ఎ.వి.సుబ్బారావు - జయసింహ
  • విజయలక్ష్మి - చారుమతి
  • కనకం - మాలతి
  • వాణీలక్ష్మణ్ - మంజరి
  • గంగారత్నం - శెట్టి భార్య
  • కె.వి.సుబ్బారావు - శెట్టి
  • చిట్టి - హేమ
  • శాంత - సరళ
  • పుష్పలత - వకుళ
  • సరోజ - కాళి

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: మీర్జాపురం రాజా
  • నిర్మాత: మీర్జాపురం రాజా
  • మాటలు, పాటలు: తాపీ ధర్మారావు
  • సంగీతం: ఆదినారాయణ రావు
  • కళ: టి.వి.ఎస్.శర్మ
  • నృత్యాలు: వేదాంతం రాఘవయ్య
  • కథ అండ్ సినోరియో: చిత్రపు నారాయణమూర్తి
  • ఛాయాగ్రహణ: డి.ఎల్.నారాయణ
  • సెట్ట్టింగులు: చెంగయ్య
  • ఎడిటింగ్: చిత్రపు నారాయణమూర్తి
  • ప్రొడక్షన్ మేనేకర్: కె.సుబ్బారావు

సంక్షిప్త కథ

[మార్చు]
తిలోత్తమలో సూర్యప్రభ

పూలమాలలు కట్టుకుని జీవించే దేవదత్తుడు (అక్కినేని నాగేశ్వరరావు) అనే అందగాడిని వసంతసేన (సూర్యప్రభ) అనే వేశ్య, దేవలోకంలోని అప్సరస తిలోత్తమ (అంజలీదేవి), ఆమె అంశతోనే భూలోకంలో రాజకుమారిగా పుట్టిన తిలోత్తమ(అంజలీదేవి) ప్రేమిస్తారు. స్వర్గలోకంలోని తిలోత్తమ ఇంద్రజాలానికీ, ఆమెను ప్రేమించిన గంధర్వుని శాపానికీ దేవదత్తుడు గురి అవుతాడు. గంధర్వుని శాపం ఫలితంగా స్వర్గలోక తిలోత్తమ, దేవదత్తుడు కిరాతక రూపాలు ధరించి తమ జన్మవృత్తాంతాలు మరిచిపోయి ఉంటారు. ఆ స్థితిలో దేవదత్తుడు తన భార్య అయిన కిరాతకి వంధ్యత్వం పోగొట్టటం కోసం తనవల్లనే భూలోక తిలోత్తమకు కలిగిన బిడ్డను కాళికి బలి ఇస్తాడు. కాళి ప్రత్యక్షమై అందరి కష్టాలు కడతేర్చి బిడ్డను బతికిస్తుంది. స్వర్గలోక తిలోత్తమ స్వర్గానికి పోగా, దేవదత్తుడు భూలోక తిలోత్తమతోను, వసంతసేనతోను సుఖంగా జీవిస్తాడు[2].

పాటల జాబితా[3]

[మార్చు]
  1. ఆకాశమెంత అవనియెంత అనురాగము చెంత-
  2. ఇంతేనా బ్రతుకు దేవా ఇంతేనా బ్రతుకు కన్నుల పండుగగా -
  3. ఏ హేయ్ లేవిడి లేవిడి ఓడిపోయాడోయి. ఓడిపోయి సిగ్గులేక -
  4. ఓ లందకారి బంగారు బొమ్మ సందిట్ల్లో నను చేర్చవే-
  5. కారు చీకటుల..,.. చిట్టి చిట్టి నాన్న చిన్నారి నాన్న -
  6. జయ జయ జననీ జగదాంబ జయ జయ ఆశ్రిత -
  7. దరిశన మీయగరావా ఓ దేవా దాసిని మరచితివా -
  8. దీనురాలను కావవా దేవా కావవా దేవా -
  9. దేవా దేవా నాపై నిర్ధయ తగునా నమ్మినదానను -
  10. ధనమే పుణ్యం ధనమే మోక్షం ధనమూలమ్మని జగమనురా -
  11. మోహనాంగ రారా జవరాల నేలుకోరా మగవాని వయసులోన
  12. పూత్తూ తలైక్కుo పూంగా (ఆరు భాషల పాట)
  13. ప్రేమే పరమని ఏమేమో తలచుట కిదియేనా ఫలము -
  14. మనసులు కలసీ మమతలు విరిసీ మగువల మరతురే-
  15. వలపుల రాజు ఏడి నా ముద్దుల రేడు ఏడి వన్నెల చిన్నెల -
  16. శోభనగిరి నిలయా దయామయా - సి.కృష్ణవేణి
  17. సద్దు సేయకండోయి హాత్ హోత్ సద్దు సేయకండోయీ -
  18. సుందర నందకుమారా ఓమారా ఏలుకొనగ రారా -

మూలాలు

[మార్చు]
  1. "Thilothama (1951)". Indiancine.ma. Retrieved 2025-03-22.
  2. సంపాదకుడు (28 February 1951). "శోభనాచల వారి "తిలోత్తమ" చిత్రసమీక్ష". ఆంధ్ర సచిత్రవారపత్రిక. 43 (24): 24, 48. Retrieved 29 December 2019.[permanent dead link]
  3. ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

[మార్చు]