Jump to content

తీయన్

వికీపీడియా నుండి
తీయన్ (పంజాబ్/హర్యానా)
యితర పేర్లుతీజ్
జరుపుకొనేవారుమహిళ
రకంఋతుపరమైన పండుగ
ప్రారంభంశ్రావణం
జరుపుకొనే రోజుజూలై/ఆగస్టు

తీయన్ (పంజాబీ:ਤੀਆਂ]]) అనునది పంజాబ్, హర్యానా రాష్త్రములలో జరుపబడు తీజ్ యొక్క పండుగ. ఈ పండుగ ఋతుపరమైనది.[1] ఇది కుమార్తెలు[2][3], సోదరీమణులపై దృష్టి సారించే పండుగ.

వేడుకలు

[మార్చు]

ఈ పండుగ వర్షాకాలంలో చాంద్రమానంలో నెల సావన్ యొక్క మూడవ రోజు నుండి సావన్ మాసంలో పౌర్ణమి వరకు మహిళలచే జరుపబడుతుంది. వివాహమైన మహిళలు ఈ పండుగ సందర్భంగా వారి కన్నవారింటిలో పాల్గొంటారు.[4][5] గతంలో సాంప్రదాయకంగా మహిళలు సావన్ మాసమంతా తల్లిదండ్రుల వద్ద గడిపేవారు.[4][6]

బహుమతులు

[మార్చు]

మహిళలు, బాలికలు వారి తల్లిదండ్రుల యింటికి వెళ్ళినపుడు వారి సోదరులు వారికి బహుమతుల ప్యాకెట్ ను అందజేస్తారు. వాటిని "సంధర" అంటారు. దీనిలో పంజాబీ సూట్/చీర, లడ్డూ, గాజులు, మెహందీ, ఊయల ఉంటాయి.[4]

గిద్దా, ఊయల

[మార్చు]

ఈ పండగ సందర్భంగా బాలికలు, మహిళలు గ్రామంలో ఒక చోట చేరుతారు. వారు పెద్ద చెట్లకు ఊయలకు కడతారు. గిద్దా నృత్యాలను చేస్తారు.

సాంప్రదాయకంగా గిద్దా నృత్యంలో ఈ క్రింది పాటను పాడుతారు:

పంజాబీ:

ਓੁੱਚੇ ਟਾਹਣੇ ਪੀਂਘ ਪਾ ਦੇ
ਜਿਥੇ ਆਪ ਹੁਲਾਰਾ ਆਵੇ
[4]

Uchay tahne peeng pa de
jithey aap hulara aavey

అనువాదం

నా ఊయల పెద్ద చెట్టుకొమ్మ నుండి వ్రేలాడదీయబడింది
ఆ ఊయల దానికదే ఊగుతుంది.

ఈ తీయన్ పండుగలో ప్రధానమైన దృష్టి గిద్దా నృత్యంపై పెడతారు. గతంలో కొన్ని రోజులనుంది నాలుగు వారాలవరకు శుభాకాంక్షలు తెలిపేవారు. బాలికలు ఒకచోట చేరి ప్రతీరోజూ గిద్దా నృత్యాలను చేసేవారు. ఈ పండుగ "భల్లోహ్" నృత్యాన్ని మహిళలు చేయడం ద్వారా పూర్తయ్యేది. ఈ నృత్యంలో మహిళలు రెండు వరుసలలో నిలబడి నాట్యం చేసేవారు.[7] ఈ సాంప్రదాయం ప్రకారం మహిళలు ఒక దగ్గర చేరడం గ్రామాలలో ప్రస్తుతం అంతరించిపోయింది.[8]

ఆహారం

[మార్చు]

సాంప్రదాయకంగా తీయన్ పండుగలలో ఈ క్రింది ఆహార పదార్థాలు చేస్తారు:

  • ఖీర్ (rice boiled in milk) [4]
  • పూర్తాయ్ (వేయించిన బ్రెడ్) [4]
  • హల్వా
  • మల్పువా
  • గుల్గులై :బెల్లం రసంతో గోధుమ పిండి కలిపు ఉండలుగా చేసి వేయిస్తారు.[9]
  • మాండే : గోధుమ పిండితో తయారుచేస్తారు.[9]

మూలాలు

[మార్చు]
  1. Good Earth Punjab Travel Guide (2006)
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2022-08-03. Retrieved 2016-07-08.
  3. Savino, Natalie (03 09 2013) Leader: New cultural group Koonj-The Flock bringing migrants together for fun, theatre and dance [1]
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 Alop Ho Raha Punjabi Virsa: Harkesh Singh KehalUnistar Books PVT Ltd ISBN 81-7142-869-X
  5. Shankarlal C. Bhatt (2006) Land and People of Indian States and Union Territories: In 36 Volumes. Punjab, Volume 22 [2]
  6. Rainuka Dagar (2002) Identifying and Controlling Female Foeticide and Infanticide in Punjab [3]
  7. Yash Kohli The Women of Punjab 1983
  8. East of Indus: My memories of old Punjab: Gurnam Singh Sidhu Brar
  9. 9.0 9.1 Alop ho riha Punjabi virsa - bhag dooja by Harkesh Singh Kehal Unistar Book PVT Ltd ISBN 978-93-5017-532-3
"https://te.wikipedia.org/w/index.php?title=తీయన్&oldid=3909838" నుండి వెలికితీశారు