తుంగా వెంకట రమణారెడ్డి(T.V)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టీవీ.వి.ఆర్.కు నెల్లూరు టౌన్ హల్లో పౌరసమ్మానం, జమీన్ రయితు ఉపసంపాదకులు పెన్నేపల్లి గోపాలకృష్ణ సమ్మానపత్రం సమార్పిస్తూ..

ణామూర్తి.

నెల్లూరు వి. ఆర్. కళాశాలలో దాదాపు 30 సంవత్సరాలు ఆఫీసు మేనేజరుగా పనిచేశాడు. తెల్లని ధోవతి, తెల్లగా చలువ చేసిన స్లాక్, వెనక్కి దువ్విన నల్లని క్రాఫు , చేతిలో వెలిగే సిగరెట్టు ఇదీ ఆయన రూపం. ఆయన, కళాప్రపూర్ణ మరుపూరు కోదండరామరెడ్డి అక్కాచెల్లెళ్ళ కూతుళ్లను చేసుకున్నారు. ఈయన టి. వి. రమణారెడ్డిగా విద్యార్థులలో, ఆధ్యాపకులలో ప్రసిద్ధుడు. అప్పటి వి.ఆర్. కళాశాల కమిటి ఏవో కారణాలవల్ల ఆయనకు ఏపనీ అప్పగించక పోవడంతో ఆయన గదిలో కూర్చొని అధ్యాపకులతో, విద్యార్థులతో నిరంతరం సంభాషించేవాడు. గొప్ప సంభాషణా చతురుడు, సౌజన్య మూర్తి, యవరయినా పేద విద్యార్థులు ఫీజు కట్టలేక చదవు మానుకోవలసి వస్తే, తనే కట్టి ఆదుకొనే కరుణామూర్తి. ఆయనను చూడగానే ఎవరయినా బెరుకు లేకుండా దగ్గరకు వెళ్ళగలిగే రూపం, వ్యక్తిత్వం. కాలేజీ అడ్మిషన్ల సమయంలో ఆయన పిల్లలకు సందేహాలు తీర్చి తగిన సలహాలు ఇచ్చేవాడు. అదే ఆయన ప్రసిద్ధికి అసలు కారణం.

ఆయన తెలుగు, ఆంగ్ల సాహిత్యాలు బాగా చదివిన వాడు, చక్కగా పాడేవాడు. సినిమాలు, నాటకాలు అంటే బాగా అభిమానించేవాడు.1960 కొంచెం వెనకో ముందో కొందరు నెల్లూరు వారు జన్మహక్కు సినిమా నిర్మాణానికి పూనుకొన్నారు. యూత్ Youth Congress పత్రిక స్థాపించిన L.V.కృష్ణారెడ్డి వారిలో ప్రధాన పాత్ర వహించాడు. జానకిని కథా నాయికగా తీసుకొన్నారు. మహతి దర్శకుడు. రమణారెడ్డి సలహాదారు, బహుశా తనకు కుడా వేషం ఇచ్చారు కాబోలు. సినిమా పూర్తి కాలేదు. తర్వాత రెండు సినిమాలకు దర్శకశాఖలో పనిచేసాడు. వి.ఆర్.కాలేజి యదురుగా ఉన్న లీలా మహల్లో మంచి కళాత్మక చిత్రాలు వస్తే అభిరుచి ఉన్న విద్యార్థులకు చూపించి, సినిమాలో కళాత్మక విషయాలు బోధించేవాడు. సినిమాలు ఎలా చూడాలో బోధించేవాడు. మంచి సినిమాల గురించి తరచు చర్చించేవాడు. విద్యార్థులను ఇంట్లో ఉంచుకొని బహుపాత్రాభినయం నేర్పించేవాడు. ఆయన యెప్పుదూ పిల్లల కోడిలాగా విద్యార్థులు చుట్టూ ఉండగా కనిపించేవారు. sence of humar ఆయనలో అధికంగా ఉండేది. పిల్లలు చనవుగా TVR అని ఆయనను గురించి చెప్పేది. Radio Ramamగా ప్రసిద్హులయిన సిస్టా భాస్కర రామమూర్తి ఆయన తరిఫీదులో తానూ కళాకారులయినట్లు, ఆయన సలహా ప్రకారమే తాను మద్రాసు ఫిల్మ్ Instituteలో చేరినట్లు, అటువంటి అరుదయిన వ్యక్తిని చూడలేదని చెప్పుకొన్నాడు.

రమణారెడ్డి సినిమా రంగంనుంచి తిరిగి వచ్చి, వి.ఆర్. కాలేజిలో మేనేజరుగా చేరాడు. ఆ కాలేజిలో ఏటా సాంస్కృతిక ఉత్సవాలు మహా వైభవంగా జరిగేవి. ఈ సందడి అంతా రమణారెడ్డి పర్యవేక్షణలోనే. విద్యార్థులు రకరకాల రాజకీయ భావాలు కలవాళ్ళు విభేదాలు లేకుండా ఆయన పర్యవేక్షణలో నాటికలు, మోనో యాక్షన్ , సంగీతం, అన్ని రకాల పోటీలలో పాల్గొనేది. అందరికి తను సలహాలు, ప్రోత్సాహం ఇచ్చేది. ఏ విద్యార్తి అయినా ఆయన ఇంటికి వెళ్లి సహాయం అడిగితె కాదనకుండా చేసేవాడు.

రమణారెడ్డి దంపతులకు పిల్లలు లేరు. తన చుట్టూ ఉన్న పిల్లలనే కన్న బిడ్డలుగా భావించారు. పదవీ విరమణ నాటికి ఆర్ధిక పరిస్థితి ఏమి బాగులేదు. పూర్వ విద్యార్థులు పూనుకొని ఆయనకు నెల్లూరు టౌన్ హాల్లులో కనీవిని ఎరుగని తీరులో షష్టిపూర్తి సమ్మానం చేసి పర్సు బహుకరించారు. ఒక కాలేజి ఆఫీస్ మేనేజరుకు ఇంత గొప్ప సమ్మానం జరగడం చూచి నెల్లూరు పురజనులు విస్తుపోయారు.

రమణారెడ్డి దంపతులను ఆయన తోడల్లుడి పిల్లలే సంరక్షించి బాగా చూచుకొన్నారు.

మూలాలు : నెల్లూరు జమీన్ రైతు .