తురకపాలెం (మాచవరం)
స్వరూపం
తురకపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°19′50″N 80°03′53″E / 16.330556°N 80.064722°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు |
మండలం | మాచవరం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522438 |
ఎస్.టి.డి కోడ్ |
"తురకపాలెం (మాచవరం)" పల్నాడు జిల్లా, మాచవరం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఈ గ్రామంలో అందరూ ముస్లిం సామాజిక వర్గానికి చెందినవారే. గ్రామస్థులు నాపరాయిని వెలికితీసి, దేవాలయాలలో ప్రతిష్ఠించే ధ్వజస్తంభాలను, ఉలితో అందంగా చెక్కుతారు. ముఖద్వారం, రాతిస్తంభాలు, ఇతర ఆకృతులను చక్కగామలుస్తారు. జిల్లాలో ఎక్కడ దేవాలయ నిర్మాణం జరిగినా ఇక్కడకు వచ్చి తమకు కావాల్సినవి తయారు చేయమని ఆర్డర్లు ఇచ్చి వెళతారు.ముస్లిం సోదరులు హిందూ దేవాలయాలకు అవసరమైన వస్తువులు తయారు చేయటం ఇక్కడి ప్రత్యేకత.[1] [2]