తులసి కుమార్ (గాయని)
తులసి కుమార్ దువా | |
---|---|
జననం | తులసి కుమార్ దువా 1986 మార్చి 15 ముంబై, మహారాష్ట్ర, భారతదేశం |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2006–ప్రస్తుతం |
టి-సిరీస్ (సంగీతం & చలనచిత్ర నిర్మాణ సంస్థ) కిడ్స్ హట్ (యూట్యూబ్ ఛానెల్) | |
జీవిత భాగస్వామి | హితేష్ రాల్హాన్ (m. 2015) |
తల్లిదండ్రులు |
|
బంధువులు |
|
తులసి కుమార్ దువా (జననం 1986 మార్చి 15) భారతీయ నేపథ్య గాయని, రేడియో జాకీ, సంగీతకారిణి. అంతేకాకుండా, ఆమె బాలీవుడ్ పరిశ్రమలో నటి.
ఆమె, గొప్ప గాయకుడు, టి-సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ కుమార్తె. ఆమె సినీ నిర్మాత భూషణ్ కుమార్, నటి ఖుషాలి కుమార్ లకు సోదరి.[1] ఆమె కిడ్స్ హట్ (Kids Hut) అనే యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతోంది, దీన రికార్డ్ లేబుల్ టి-సిరీస్ యాజమాన్యంతో ఉంది, ఇందులో నర్సరీ రైమ్స్, కథలతో సహా పిల్లల కంటెంట్ ఉంటుంది.[2]
2017లో, ఎయిర్‌లిఫ్ట్ (2016)[3] చిత్రం నుండి "సోచ్ నా సాకే" పాటకుగాను ఆమె ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ అవార్డు, మిర్చి మ్యూజిక్ అవార్డ్ - లిజనర్స్ ఛాయిస్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ లను గెలుచుకుంది.[4] అలాగే, 2020లో కబీర్ సింగ్[5] సౌండ్‌ట్రాక్ కోసం మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ – ఉత్తమ ఆల్బమ్ పురస్కారం ఆమె అందుకుంది. మరెన్నో పురస్కారాలను పొందిన ఆమె 2010, 2019లలో ఐ.ఐ.ఎఫ్.ఎ ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్‌కి కూడా నామినేట్ చేయబడింది.[6]
వ్యక్తిగత జీవితం
[మార్చు]పంజాబీ హిందూ కుటుంబంనకు చెందిన వ్యాపారవేత్త గుల్షన్ కుమార్, సుదేష్ కుమారి దంపతులకు ఆమె జన్మించింది.[7] దివ్య ఖోస్లా కుమార్ ఆమెకి కోడలు.
2015లో నేపాల్‌లో వ్యాపారవేత్త హితేష్ రాల్‌హాన్‌ని ఆమె వివాహం చేసుకుంది.[8] ఈ దంపతులకు 2017లో ఒక కుమారుడు జన్మించాడు.[9]
మూలాలు
[మార్చు]- ↑ "In father's footsteps". The Hindu. Archived from the original on 14 September 2006. Retrieved 31 March 2009.
- ↑ Shah, Karan (2014-10-17). "T-Series launches a new YouTube channel for kids". Indian Express. Retrieved 2021-10-23.
- ↑ "MMA Mirchi Music Awards". MMAMirchiMusicAwards. Retrieved 2021-06-24.
- ↑ "IIFA Awards 2017: List Of Winners". NDTV.com. Retrieved 2021-06-24.
- ↑ "MMA Mirchi Music Awards". MMAMirchiMusicAwards. Retrieved 2021-06-24.
- ↑ "IIFA 2019 nominations: Andhadhun grabs maximum nods, Raazi and Padmaavat follow". The Indian Express (in ఇంగ్లీష్). 2019-08-28. Retrieved 2021-06-24.
- ↑ "Lohri reloaded". The Asian Age. 13 January 2016.
- ↑ Bollywood singer Tulsi Kumar's sangeet ceremony – Times of India. The Times of India. (20 February 2015). Retrieved 30 December 2015.
- ↑ "Famous Bollywood Singer Becomes Mother, Shares First Pic And Name of the Baby". Yahoo Lifestyle. 26 December 2017. Retrieved 8 August 2019.