గుల్షన్ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గుల్షన్ కుమార్ ( 5 మే 1951 – 12 ఆగస్టు 1997) [1] టి-సిరీస్ మ్యూజిక్ లేబుల్ (సుపర్ కేసట్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్) [2] వ్యవస్థాపకుడు, బాలీవుడ్ నిర్మాత. ఈయన అసలు పేరు గుల్షన్ కుమార్ దువా. ప్రస్తుతం టి-సిరీస్ ను ఆయన చిన్న తమ్ముడు కృష్ణ కుమార్, కొడుకు భూషణ్ కుమార్ నిర్వహిస్తున్నారు.[3] ఈయన కుమార్తె తులసీ కుమార్ నేపథ్య గాయని.[4]

గుల్షన్ కుమార్

జీవిత విశేషాలు[మార్చు]

పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు గుల్షన్. గుల్షన్ తండ్రి చంద్రభాన్ ఢిల్లీలోని దర్యా గంజ్ లో పళ్ళ రసాల దుకాణదారు.  తొలినాళ్ళలో గుల్షన్ కూడా ఆ దుకాణంలో పనిచేశారు.

వీరి కుటుంబం రికార్డులు, చౌకగా ఆడియో కేసట్లు అమ్మే దుకాణం కొనుగోలు చేశాకా, గుల్షన్ తన కెరీర్ ను అటు వైపుగా తీర్చిదిద్దుకున్నారు. ఈ చిన్న అడుగు విస్తారమైన సంగీత వ్యాపారం మొదలుపెట్టడానికి బీజాలు వేసింది.[5]

సంగీత వ్యాపారం, సినిమా రంగం[మార్చు]

ఆ తరువాత గుల్షన్ "సూపర్ కేసెట్స్ ఇండస్ట్రీస్" పేరుతో తన స్వంత ఆడియో కేసెట్ ఆపరేషన్ పరిశ్రమను మొదలుపెట్టారు. నోయిడా లో సంగీత నిర్మాణ సంస్థను స్థాపించారు. వ్యాపారం విస్తరించడం మొదలుపెట్టాకా గుల్షన్ తన నివాసాన్ని ఢిల్లీ నుంచి ముంబై కు మార్చారు.[6]

1989లో నిర్మాతగా బాలీవుడ్ లో లాల్ దుపట్టా మల్మల్ కా సినిమాతో అడుగుపెట్టారు గుల్షన్. 1990లో తీసిని ఆషికీ పెద్ద హిట్ అయింది. ఈ సినిమా సంగీతపరంగా కూడా చాల పెద్ద హిట్. ఆ తరువాత బాహర్ ఆనే తక్, దిల్ హై కే మన్తే నహీ, ఆయే మిలన్ కీ రాత్, మేరా కా మోహన్, జీనా మర్నా తేరే సంగ్ వంటి సినిమాలు తీశారు కుమార్.[6]

గుల్షన్ హత్య[మార్చు]

ముంబై, పశ్చిమ అంధేరి ప్రాంతంలోని జీత్ నగర్ జీతేశ్వర్ మహదేవ్ మందిరం బయట 12 ఆగస్టు 1997న గుల్షన్ ను కాల్చి చంపారు దుండగులు.[7] పోలీసులు, సంగీత దర్శకులు నదీమ్-శ్రవణ్ లలో నదీంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ తరువాత 9 జనవరి 2001న వినోద్ జగ్తప్ ఆ హత్య తనే చేసినట్టుగా ఒప్పుకున్నారు. 29 ఏప్రిల్ 2002న సెషన్స్ జడ్జి ఎం.ఎల్.తహిల్యాని వినోద్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ప్రాసిక్యూషన్ వినోద్ ను కాంట్రాక్ట్ హంతకునిగా నిరూపించలేనందున అతనికి ఉరిశిక్ష వేయడం లేదు అని వివరించారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు గుల్షన్ కుమార్ పార్ధివ శరీరాన్ని ఢిల్లీలో ఖననం చేశారు.[8]

టి-సిరీస్ మ్యూజిక్ లేబుల్[మార్చు]

గుల్షన్ నేతృత్వంలో టి-సిరీస్ భారతదేశంలోనే టాప్ మ్యూజిక్ లేబుల్ గా నిలిచింది. ఇప్పటికీ ఈ సంస్థే నెం.1గా కొనసాతుతోంది.[9]

భారతదేశంలో అతిపెద్ద సంగీతం, ఆడియోల తయారీ సంస్థ ఇది. ఈ సంస్థ చాలా సినిమాల ఒరిజినల్ సౌండ్ ట్రాక్ లు, రీమిక్స్ లు, పాత భక్తి భజనలు, 1960ల నాటి కొత్త తరం మెలోడీలు, 1990లు పాప్ హిట్లు కూడా విడుదల చేసింది.

నేటికీ భారతీయ సంగీత రంగంలో 60శాతం కన్నా ఎక్కువ మార్కెట్ టి-సిరీస్ సంస్థదే. అంతర్జాతీయంగా టి-సిరీస్  4.2మిలియన్ డాలర్ల టర్నోవర్ సంపాదిస్తోంది. 6 ఖండాల్లోని, 24దేశాల్లో ఎగుమతులు చేస్తోందీ సంస్థ. భారతదేశంలో 2500 మంది డీలర్లతో అతిపెద్ద పంపణీ నెట్వర్క్ గా నిలుస్తోంది.

నిర్మాతగా..[మార్చు]

 • ఆషికి 2 (2013)
 • పాప-ది గ్రేట్ (2000)
 • చార్ ధామ్ (1998)
 • జై మా వైష్ణవ్ దేవి (1995)
 • బేవాఫా సనమ్ (1995)
 • షబ్నమ్ (1993)
 • కసమ్ తేరీ కసమ్ (1993)
 • ఆజా మేరి జాన్ (1993)
 • జీనా మర్నా తేరే సంగ్ (1992)
 • మీరా కా మోహన్ (1992)
 • శివ్ మహిమ (1992)
 • సంగీత్ (1992)
 • దిల్ హై కే మాన్తా నహీ (1991)
 • ఆయే మిలన్ కి రాత్ (1991)
 • జీనా తేరి గలీ మే (1991)
 • వేలు నాయకన్ (1990)
 • అప్పు రాజా (1990)
 • లాల్ దుపట్టా మల్మల్ కా (1989)
 • సూర్యపుత్ర షానిదేవ్ (1997)
 • చాల్ కన్వరియా శివ్  కే ధామ్ (1996)
 • సత్యనారాయణ్ కీ విరాట్ కథ (1995)
 • బాహర్ ఆనే తక్ (1990)
 • యారియాన్ (2014)
 • నోటంకీ సాలా (2014)
 • భూత్ నాథ్ రిటర్న్స్ (2014)
 • క్రియేచర్ 3డి (2014)
 • బేబి (2015)
 • ఏక్ పహేలీ లీలా (2015)
 • ఎయిర్ లిఫ్ట్ (2016)

దర్శకునిగా[మార్చు]

 • బేవాఫా సనమ్ (1995)

సమర్పకునిగా[మార్చు]

 • ఎ లవ్ ఇష్టోరి (2010)
 • కజరారే (2010)
 • హమ్కో దీవానా కర్ గయే (2006)
 • లక్కీ (2005)
 • ముస్కాన్ (2003)
 • ఆప్కో పెహ్లే భి కహీ దేఖా హై (2003)
 • దిల్ హై కే మాన్తా నహీ (1991)
 • ఆషికీ (1990)

References[మార్చు]