తులాబందుల నాగేశ్వరరావు
తులాబందుల నాగేశ్వరరావు తాడేపల్లి న్యాయవాది.1967 లో మంగళగిరి ఎమ్మెల్యే. అధికార భాష సభ్యులు గా పనిచేశారు. అతను 1942 లో నేషనల్ హెరాల్డ్ సంపాదకులు కోటంరాజు రామారావు తరుపున వాదించి బ్రిటీష్ ప్రభుత్వంపై గెలిచారు.వెనుకబడిన కులాల ఉధ్యమం సామాజిక ఉధ్యమం అని చాటారు.
జీవిత విశేషాలు
[మార్చు]తులాబందుల నాగేశ్వరరావు వడ్డేశ్వరం లో 1917 మే 21న చినబ్రాహ్మణయ్య, రోశమ్మ లకు జన్మించారు.1947 లో మద్రాసు హైకోర్టు న్యాయవాది గా పనిచేశారు. అతను గాందేయవాది. ఖద్దరే ధరించేవారు. అతనికి నలుగురు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు. 1954 లో కాకాసాహెబ్ కాలేల్కర్ కమిషన్ వచ్చినపుడు విజయవాడలో వెనుకబడిన కులాల మహాసభను జరిపారు. 1959 వరకు షెడ్యూల్డ్ కులాలు,జాతుల కేంద్ర సహాయ కమీషనర్ గా పనిచేశారు. కొండ జాతుల వారి సమస్యలపై అనేక వ్యాసాలు వ్రాశారు.
అతను 1986 మే 8 న మరణించాడు.
1967 ఎన్నికలు
[మార్చు]1967 ఫిబ్రవరి 21న జరిగిన మంగళగిరి శాసనసభ నియోజకవర్గం ఎన్నికలలో మొత్తం ఓటర్లు 75945. అందులో 58347 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 55848 ఓట్లు చెల్లినవి కాగా 2499 ఓట్లు తిరస్కరించబడ్డాయి. అందులో భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి టి.నాగేశ్వరరావుకు 18963 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి సి.పి.ఐ పార్టీకి చెందిన వి.ఎస్.కృష్ణకు 17071 ఓట్లు వచ్చినవి. టి.నాగేశ్వరరావు 1892 ఓట్ల మెజారిటీతో గెలిపొందాడు.[1]