Jump to content

తూంకుంట నర్సారెడ్డి

వికీపీడియా నుండి
తూంకుంట నర్సారెడ్డి
తూంకుంట నర్సారెడ్డి


రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌
పదవీ కాలం
2017 నవంబర్ 6 - 2018

ఎమ్మెల్యే
పదవీ కాలం
2009 - 2014
ముందు జె. గీతారెడ్డి]
తరువాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు
నియోజకవర్గం గజ్వేల్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1963
గజ్వేల్, సిద్దిపేట జిల్లా , తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు (2014 - 2018) తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ
తల్లిదండ్రులు వెంకట్ రెడ్డి

తూంకుంట నర్సారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో గజ్వేల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

తూంకుంట నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేశాడు. ఆయన 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2014లో తెలంగాణ  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. నర్సారెడ్డి అనంతరం కాంగ్రెస్ పార్టీని వీడి 2014 మే 20న హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[1]

తూంకుంట నర్సారెడ్డి 2017 మే 29న తెలంగాణ రాష్ట్ర రోడ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.[2][3] ఆయన టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని తెలియడంతో 2018 అక్టోబర్ 20న సస్పెన్షన్ చేశారు.[4][5] ఆయన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి[6] ప్రస్తుతం సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ (డీసీసీ) అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు.[7]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (20 May 2014). "గజ్వేల్ లో కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ". Archived from the original on 26 April 2022. Retrieved 26 April 2022.
  2. Sakshi (29 May 2017). "8 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  3. Suryaa (11 June 2017). "TSRDC చైర్మన్ బాధ్యతలు చేపట్టిన నర్సారెడ్డి" (in ఇంగ్లీష్). Archived from the original on 26 April 2022. Retrieved 26 April 2022.
  4. Mana Telangana (26 October 2018). "టిఆర్‌ఎస్ నుంచి నర్సారెడ్డి సస్పెన్షన్". Archived from the original on 26 April 2022. Retrieved 26 April 2022.
  5. The New Indian Express (27 October 2018). "Narsa Reddy suspended from TRS, to reunite with Congress". Archived from the original on 26 April 2022. Retrieved 26 April 2022.
  6. Sakshi (27 October 2018). "టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌కు వరుసగా వలసలు!". Archived from the original on 26 April 2022. Retrieved 26 April 2022.
  7. Andhra Jyothy (5 March 2021). "కేసీఆర్‌కు డౌన్‌ఫాల్‌ షురూ!" (in ఇంగ్లీష్). Archived from the original on 26 April 2022. Retrieved 26 April 2022.