తూలిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తూలిక.నెట్ ఒక అంతర్జాల పత్రిక. తెలుగు కథలకి ఆంగ్లానువాదాలు, తెలుగుకథ, రచయితలపై పరిశీలనాత్మవ్యాసాలు ప్రచురిస్తున్నారు. వ్యవస్థాపకులు, సంపాదకులు నిడదవోలు మాలతి.

విశేషాలు

[మార్చు]

తెలుగు భాషా, సంస్కృతి, సాహిత్యాల గురించి తెలుగేతరులకు తెలిసేలా "తూలిక" ([1] ) ను జూన్ 2001లో మొదలుపెట్టి నిరంతరాయంగా ఒంటి చేత్తో నడుపుకుంటూ వస్తున్నారు.ఎవరి నుంచి ఒక డాలర్ సహాయం పొందకుండా, ఎవరి ప్రోత్సాహం, తోడ్పాటు లేకుండా, తాను నమ్మిన దాన్ని ఆచరణలో చూపిస్తూ అందరికీ ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలుగు సాహిత్యానికి నిస్వార్థంగా తూలిక చేస్తున్న కృషి పట్ల తోటి సాహిత్యాకారుల, తెలుగు సంఘాల ద్వంద్వ వైఖరిని గురించి ఎన్నో సార్లు, ఎన్నో సందర్భాల్లో తన ఆవేదన ను, ఆక్రోశాన్ని వెలిబుచ్చారు[2] తూలికలో ఆమె వ్యాసాలని అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్ వంటి దేశాలలో తెలుగు పరిశోధకులు, తెలుగులు కానివారు చూడడం, వాటిని తమసైటుల్లో పెట్టుకోడం, రిఫరెన్సులివ్వడం చూసేక, క్రమేణా మన కథలద్వారా విదేశీయులకి మనసంస్కృతిగురించి తెలియజేయడం అనే నిర్దుష్టమైన ధ్యేయం ఆమెలో రూపు దిద్దుకుంది.[3]

  • తూలిక.నెట్ కేవలం తెలుగుకథలకే అంకితమై, తెలుగు కథలనీ, కథకులనీ ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రారంభించిన సైటు. ఆ నియమానికి కట్టుబడి ఉన్న సైటు.
  • కథలఎంపికలో కూడా చెప్పుకోదగ్గ భిన్నత్వం ఉంది. ఆమె ఎంచుకునే కథలు తెలుగుజాతిని విడిగా నిలబెట్టేవి, తనదైన, మనకే ప్రత్యేకమయిన విలువలూ, సంస్కృతి, ఆచారాలూ, సంప్రదాయాలు – ఇవి ఆవిష్కరించే కథలు[3].

తూలిక ప్రస్థానం[3]

[మార్చు]
  • తూలిక.నెట్ ప్రారంభించింది జూన్ 2001లో
  • అనువదించిన కథలు ఇప్పటివరకుః 150. ఇందులో శారద (ఆస్ట్రేలియా) అనువదించినవి 10,
  • ఇతర అనువాదకులు చేసినవి 10.
  • ఆమె రాసిన పరిశీలనాత్మక, విశ్లేణాత్మక వ్యాసాలుః 25.
  • ఇతరుల రచయితలవ్యాసాలు (వేరే సైటుల్లో ప్రచురించినవి తూలికలో పునర్ముద్రించినవి 3.
  • ఆమె తూలికకోసం అనువదించినవి. 3.
  • సంకలనాలు: 52 అనువాదాలు 3 సంకలనాల్లో వచ్చేయి. ప్రచురణకర్తలు జైకో, కేంద్ర సాహిత్య ఎకాడమీ (బెంగుళూరు విభాగం), లేఖిని సాహిత్య సాంస్కృతిక సంస్థ (హైదరాబాదు.).

మూలాలు

[మార్చు]
  1. "తెలుగు కథల ఇంగ్లీష్ అనువాదాల సైట్". Archived from the original on 2015-08-02. Retrieved 2015-08-13.
  2. "తెలుగు కథ నాడి 'తూలిక' -సారంగ సాహిత్యవార పత్రికలో ఇంటర్వ్యూ". Archived from the original on 2015-03-22. Retrieved 2015-08-13. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  3. 3.0 3.1 3.2 "తెలుగు కథ నాడి 'తూలిక'". magazine.saarangabooks.com/. Archived from the original on 31 డిసెంబరు 2013. Retrieved 8 May 2013. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)

బయటి లంకెలు

[మార్చు]

తూలిక వెబ్ సైటు

"https://te.wikipedia.org/w/index.php?title=తూలిక&oldid=4218078" నుండి వెలికితీశారు