తెన్నేటి కాశీవిశాలాక్షిదేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెన్నేటి కాశీవిశాలాక్షి దేవి
జననం
వృత్తిప్రధానోపాధ్యాయురాలు (రిటైర్డ్)
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కథా రచయిత్రి, కవయిత్రి
జీవిత భాగస్వామికోపల్లె విజయప్రసాద్
తల్లిదండ్రులు
  • తెన్నేటి సీతారామయ్య (తండ్రి)
  • తెన్నేటి అన్నపూర్ణమ్మ (తల్లి)

తెన్నేటి కాశీవిశాలాక్షిదేవి తెలుగు రచయిత్రి. ఈమె విజయవాడలో తెన్నేటి అన్నపూర్ణమ్మ, తెన్నేటి సీతారామయ్య దంపతులకు జన్మించింది. ఈమె విద్యాభ్యాసం మొత్తం విజయవాడలోని మాంటిస్సోరి విద్యా సంస్థల్లో జరిగింది. అర్థశాస్తంలో, ఆంగ్లంలో ఎం.ఎ., తరువాత ఎం.ఇ.డి చేసింది. ఈమె భర్త వియోగి కలం పేరుతో రాసే రచయిత కోపల్లె విజయప్రసాదు. వీరికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. ఈమె ఒక ప్రయివేటు పాఠశాలలో టీచరుగా, ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసి ప్రస్తుతం విశ్రాంత జీవితం గడుపుతున్నది. ఆమె మామగారు శ్రీరాగి కూడా ప్రసిద్ధ రచయిత, ఆడపడుచు రమ్య మంచి కవయిత్రి. ఈమె ఇంట్లో సాహిత్య వాతావరణం ఈమెను రచయిత్రిగా తీర్చిదిద్దింది.[1]

ఆమె కవిత, కథానిక, నాటిక ప్రక్రియలలో రచనలు చేసింది. పిల్లలకు గేయాలు రాయటమే కాదు వారితో గేయ నాటికలు వేయిస్తుంది. ఈమెకు రేడియో నాటికలంటే ప్రాణం. చిన్నప్పటినుండి వాటిని వినేది. తాను పనిచేసిన ప్రయివేటు పాఠశాలలో పిల్లలచేత ఎన్నో నాటికలు వేయించింది. వారిచేత స్పష్టంగా డైలాగులు పలికించటం, భావావేశాల్ని నాటికల్లోని పాత్రలచేత చేయించటం ఈమె ప్రత్యేకత. ఈమె వద్ద శిక్షణ పొందిన విద్యార్థులు కళలన్నా, సాహిత్యమన్నా ఎంతో మక్కువ కలిగి ఉన్నారు. ఉపాధ్యాయురాలిగా ఒక తరాన్ని ప్రభావితం చేసి తల్లి భాషకు, సాహిత్యానికి ఎనలేని సేవలందించింది. చిన్మయ మిషన్‌ వారి ఎండాకాలం క్యాంపులలో ఈమె పిల్లలకు వివిధ విషయాలు భోదిస్తుంది.

రచనలు

[మార్చు]

ఈమె రెండు నాలుకలు అనే కథా సంపుటిని, బంగారు భవిత అనే నాటికల సంపుటిని ప్రకటించింది. ఈమె కథలు, కవితలు వివిధ పత్రికలలో అచ్చయ్యాయి.

మూలాలు

[మార్చు]
  1. జంధ్యాల, రఘుబాబు (3 April 2017). "విశాల దృక్పథమే ఆమె కలం బలం". ప్రజాశక్తి కర్నూలు జిల్లా అనబంధం. Retrieved 3 April 2017.[permanent dead link]