తెలంగాణలో ఆశ్రిత జానపద కళారూపాల జాబితా
Appearance
తెలంగాణ ప్రాంతంలో పటం ఆధారంగా, బొమ్మల ఆధారంగా కథలు చెప్పటం మిగితా తెలుగు ప్రాంతాల లాగానే విస్తృతంగా కనిపిస్తుంది.[1] ఈ కింది పట్టికలో వివిధ కులాల, వారి ఆశ్రిత కులాల, ప్రదర్శన కళలు చూడవచ్చు:
క్రమ సంఖ్య | ఆశ్రిత కళారూపం | పోషించే కులం | ప్రక్రియ | ప్రదర్శనాంశం |
---|---|---|---|---|
1 | కూనపులి | పద్మశాలి | పటం ఆధారంగా కథాగానం | మార్కండేయ పురాణం |
2 | సాధనాశూరులు | పద్మశాలి | ఇంద్రజాలం | ఇంద్రజాల విద్యలు |
3 | గౌడజెట్టి | గౌడ | పటం ఆధారంగా కథాగానం | గౌడపురాణం |
4 | ఏనూటి | గౌడ | పటం ఆధారంగా కథాగానం | గౌడపురాణం |
5 | రుంజ | విశ్వ బ్రాహ్మణులు | రుంజవాద్య ఆధారంగా | విశ్వకర్మపురాణం |
6 | పనస | విశ్వ బ్రాహ్మణులు | కథాగానం | విశ్వకర్మపురాణం |
7 | బీరన్నలు | కుర్మ | కథాగానం | బీరన్నకథ |
8 | మందహెచ్చులు | గొల్ల | బొమ్మల ప్రదర్శన కథాగానం మరియు పటం ఆధారంగా కథాగానం |
కాటమరాజు కథలు |
9 | ఒగ్గు | గొల్ల | కథాగానం / ఒగ్గువాద్యం | మల్లన్న కథ |
10 | గొల్ల భాగవతులు | గొల్ల | భాగవతం / నాటకాలు | రామాయణ, భారత, భాగవత కథలు |
11 | కొమ్ము | గొల్ల | పటం ఆధారంగా కథాగానం | కాటమరాజు కథలు |
12 | గోత్రాలవారు | కాపు, చౌదరి, వెలమ | నాటకాలు / కథాగానం | భాగోతాలు, గోత్రాలు కీర్తించడం |
13 | గొల్ల సుద్దులు | గొల్ల | కథాగానం | దాసరి కథలు / యాదవ కథలు |
14 | పిచ్చుకకుంట్ల | గొల్ల | కథాగానం | గోత్రాలు / కథాగానం |
15 | తెరచీరలవారు | గొల్ల | కథాగానం | గంగమ్మకథ/గంగపూజారులు/మల్లన్న కథలు |
16 | గంగిరెద్దులు | ఎర్రగొల్ల | గంగిరెద్దుల ఆట | గంగిరెద్దుల ఆటలు |
17 | బేరి పనస | కోమటి | కథాగానం | కన్యకా పురాణం |
18 | వీరముష్ఠి | కోమటి | కథాగానం | ఖడ్గాలు / కన్యకాపురాణం |
19 | కాకిపడిగెలు | ముదిరాజులు | పటం ఆధారంగా కథాగానం | పాండవుల కథలు |
20 | పిచ్చుక కుంట్ల | రెడ్డి / కాపు | కథాగానం | గోత్రాలు / కుంటి మల్లారెడ్డి కథలు |
21 | ఆదికొడుకులు | మేదరి | కథాగానం | మేదరికథలు |
22 | అద్దపు | మంగలి | పటం ఆధారంగా కథాగానం | అద్దపు పురాణం |
23 | పెక్కర్లు | కుమ్మరి | పటం ఆధారంగా కథాగానం | గుండబ్రహ్మయ్యపురాణం |
24 | మాసయ్యలు | రజకులు | పటం ఆధారంగా కథాగానం | మడేలు పురాణం |
25 | శారద గాళ్ళు | కాపు, రెడ్డి | బుర్రకథ | శారద కథలు |
26 | బండారి భక్తులు | పెరక | కథాగానం | పెఱకపురాణం |
27 | గోంధళే వీధి భాగోతం | ఆరె | భాగవతాలు / నాటకాలు | గోంధళే నాటకాలు |
28 | చిందు యక్షగానం | మాదిగ | యక్షగానం | రామాయణ, భారత, భాగవత కథలు |
29 | డక్కలి | మాదిగ | పటం ఆధారంగా కథాగానం | జాంబపురాణం |
30 | బైండ్ల/బవనీలు | మాదిగ | కథాగానం | ఎల్లమ్మ కథ / మాంధాత కథ |
31 | నులక చందయ్యలు | మాదిగ | కథాగానం | జాంబపురాణం |
32 | మాదిగ బోగం / మాదిగ మాష్టీలు | మాదిగ | ఇంద్రజాలం | గారడీ విద్యలు, భాగోతాలు |
33 | మాల జంగాలు | మాల | కథాగానం | చెన్నయ్య కథ |
34 | గుర్రపు | మాల | పటం ఆధారంగా కథాగానం | భేతాళ పురాణం |
35 | మాల మాష్టి | మాల | కథాగానం | పండుగ సాయన్న కథలు / బేతాళ పురాణం |
36 | మిత్తిలి | మాల | కడ్డీతంత్రీవాద్యంతో కథాగానం | రామాయణ కథలు / నాటకాలు |
37 | విప్ర వినోదులు | బ్రాహ్మణులు | ఇంద్రజాలం | ఇంద్రజాల విద్యలు |
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ జానపద కళాసౌరభాలు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ.