Jump to content

తెలంగాణ క్రీడా ప్రాంగణం

వికీపీడియా నుండి
తెలంగాణ క్రీడా ప్రాంగణం
జనగాం జిల్లా, చౌడారం గ్రామంలోని తెలంగాణ క్రీడా ప్రాంగణం
ప్రాంతంతెలంగాణ, భారతదేశం
ప్రధాన వ్యక్తులుతెలంగాణ ప్రజలు
స్థాపన2022, జూన్ 2
నిర్వాహకులుతెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ క్రీడా ప్రాంగణం, అనేది తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో క్రీడా మైదానాల ఏర్పాటుకోసం తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమం. గ్రామాల్లో అందుబాటులో ఉన్న స్థలాలను ఎంపిక చేసి, ఉపాధి హామీ నిధులతో ఈ తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటుచేశారు. ఇందులో అన్ని వయసుల వారికి ఉపయోగపడేలా అన్ని రకాల క్రీడా సామగ్రిని అందుబాటులో ఉంచడంతోపాటు, ప్రత్యేకంగా వాకింగ్‌ ట్రాక్‌లు, పిల్లల ఆట వస్తువులు, బెంచీలు వంటివి ఏర్పాటు చేశారు.[1]

రూపకల్పన

[మార్చు]

2022 మే 18న హైదరాబాదులోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశంలో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ‘‘తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం’’ ఏర్పాటు చేయాలని నిర్ణయించబడింది. భవిష్యత్తు తరాలు శారీరక ధారుడ్యం, మానసిక ఉల్లాసంతో ఎదిగేందుకు తోడ్పడేందుకు ఈ క్రీడా ప్రాంగణాలు ఉపయోగపడతాయని, క్రీడల వల్ల ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేసీఆర్ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 19వేల గ్రామాలు, 5 వేల వార్డులలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసి, తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవం రోజున ఎంపిక చేసిన కొన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ప్రారంభించారు.[2]

జీహెచ్‌ఎంసీలోని ఒక్కో డివిజన్‌లో 3, ఇతర కార్పొరేషన్‌ పరిధిలోని డివిజన్లలో 2, చిన్న మున్సిపాలిటీల్లో వార్డుకు ఒకటి చొప్పున క్రీడా ప్రాంగణాలను ఏర్పాటుచేశారు. ఒక్కో క్రీడా ప్రాంగణాలకు 4 నుండి 8 లక్షల రూపాయలు ఖర్చుచేశారు.

సదుపాయాలు

[మార్చు]

ఖోఖో, కబడ్డీ, వాలీబాల్‌, లాంగ్‌ జంప్‌ పిట్‌తోపాటు వ్యాయామం కోసం సింగిల్‌, డబుల్‌ బార్‌లను ఏర్పాటుచేశారు. ప్రతి టీకేపీలో దాదాపు 300 మొక్కలను నాటి, వాటిని పర్యవేక్షించేందుకు ప్రతి మండలంలో ఒక ప్రత్యేక అధికారిని నియమించారు.[3]

మూలాలు

[మార్చు]
  1. telugu, NT News (2022-06-25). "ఊరికో..ఆటస్థలం". Namasthe Telangana. Archived from the original on 2022-06-25. Retrieved 2022-06-28.
  2. Velugu, V6 (2022-05-18). "ఇక గ్రామానికో క్రీడా ప్రాంగణం". V6 Velugu. Archived from the original on 2022-05-19. Retrieved 2022-06-28.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "క్రీడా ప్రాంగణం.. ఔత్సాహికులకు ప్రోత్సాహం". EENADU. 2022-06-02. Archived from the original on 2022-06-28. Retrieved 2022-06-28.